1193.Q: The Arrogance of Satan and the Universal Plan (KSM 217) 🏹

❓ ప్రశ్న: విశ్వంలో దుర్మార్గులు ఎందుకు బలంగా ఉన్నారు? వారు ఇతరులను దౌర్జన్యం చేస్తున్నా ఆర్థికంగా, శారీరక శక్తితో ఎందుకు వర్ధిల్లుతున్నారు? ప్రజలు కూడా వారి మాటలే ఎందుకు వింటున్నారు? సాతాను ఎందుకు ఇంకా గెలుస్తానని విర్రవీగుతున్నాడు? దీని వెనుక ఉన్న విశ్వ ప్రణాళిక ఏంటి? (0:49:47)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 50s)

  • 🛡️ విశ్వ చరిత్ర రహస్యం: ఈ ప్రశ్నలకు సమాధానం నేను ‘విశ్వ చరిత్ర’ (Universe History) గ్రంథంలో రాశాను. విశ్వం మనకు అర్థమైతే ఈ లోకం ఎందుకు ఇలా ఉందో అర్థమవుతుంది. లోకం అర్థమైతే మన జీవిత స్థితిగతులు అర్థమవుతాయి. ఈ భూమి మీద తాగుడు, డ్రగ్స్, వ్యభిచారం, రాజకీయ నేరాలు ఎందుకు జరుగుతున్నాయో అందులో వివరించాను.
  • 🧱 సాతాను పొగరు: దేవుడు ‘షేర్’ అయితే, నేను ‘సవా షేర్’ (దేవుని కంటే గొప్పవాడిని) అనుకునే ఒక గర్వాంధుడు ఉన్నాడు, వాడే సైతాను. వాడు ఇప్పటికీ నమ్ముతున్నాడు – “నేను తప్పకుండా గెలుస్తాను, ఒకనాటికి సృష్టికర్తను పడద్రోసి ఈ విశ్వమంతటినీ నా సామ్రాజ్యంగా చేసుకుంటాను” అని. వాడు పిచ్చోడు కాదు, పూర్ణ జ్ఞాని అని దేవుడే చెప్పాడు. ఆ జ్ఞానంతోనే వాడు తనదైన స్కెచ్ (Sketch) వేసుకున్నాడు.
  • ⚖️ సినిమా కథ ముగింపు: సాతాను అంటాడు – “ముగింపు మీరు రాయడం కాదు, నేను రాస్తాను.. ఆఖరిదాకా చూడండి కథ మొత్తం అడ్డం తిరిగిపోతుంది” అని. ఆ బరితెగింపు, ఆ పొగరు వానిలో ఉంది. వాని లక్షణాలే సమాజంలోని కొందరు దుర్మార్గులైన బలవంతులలో కనిపిస్తున్నాయి. వాడు తయారు చేసిన మనుషులే నేడు బలంగా ఉంటూ దౌర్జన్యం చేస్తున్నారు.
  • అల్టిమేట్ విక్టరీ (Ultimate Victory): సాతాను ఎన్ని కలలు కన్నా, అదంతా వాని భ్రమ మాత్రమే. అల్టిమేట్ గా సృష్టికర్త యెహోవా దేవుడే గెలుస్తాడు. మనం సృష్టికర్తను ఆరాధిస్తూ వానిని ఎదిరించాలి. వానికి ఎంత బలుపు ఉన్నా, దేవుని ప్రణాళిక ముందు వాడు ఓడిపోక తప్పదు. నేరాలు జరుగుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటున్నట్లు అనిపించినా, దాని వెనుక ఒక విశ్వ ప్రణాళిక ఉంది.

Detailed English Translation:

❓ Question: Why do the wicked seem so powerful and prosperous? Why does Satan still act like he will win, and what is the divine plan behind allowing this evil to flourish?

  • The Secret of Universe History: I explained these in my book ‘Universe History.’ Understanding the universe helps us understand why the world and our lives are the way they are. It covers why sin, drugs, and political crimes exist.
  • Satan’s Pride: Satan thinks he is superior to God. He genuinely believes that one day he will overthrow the Creator and make the universe his own empire. God Himself said Satan was perfect in wisdom, and he uses that wisdom to plot his rebellion.
  • The Delusion of the Ending: Satan claims he will write the final chapter and that the story will flip in his favor at the end. This extreme arrogance and ‘power’ (balupu) are reflected in the wicked and powerful men of today’s society. They are his products.
  • Ultimate Victory: Despite Satan’s delusions, the Creator alone will win. We worship God and serve Him. Though it may seem God is silent while crimes occur, there is a cosmic plan in motion that will culminate in His absolute victory.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram