1201.Q: Respecting Local Pastors and Spiritual Authority (KSM 217) 🛡️

❓ ప్రశ్న: మాకు ప్రవక్త అంటే ఇష్టం, ఆయన గ్రంథాలు చదువుతాము. కానీ ఆయన కింద ఉన్న లోకల్ సేవకులను గౌరవించాల్సిన పని లేదు, వాళ్ళు కేవలం బల్ల ఇవ్వడానికి మాత్రమే అని కొందరు అనుకుంటున్నారు. గురు భక్తి లేకపోతే ఆశీర్వాదాలు ఆగిపోతాయా? అంచెలంచెల అధికార వ్యవస్థను ఎలా చూడాలి? (1:43:50)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (15m 00s)

  • 🛡️ కోరహు పాపం: యెహోవాను దూషించకుండా, కేవలం మోషేను ఎదిరించిన కోరహు పాపమే నేడు కొందరిలో కనిపిస్తోంది. “దేవుడు ఇష్టం కానీ ఆయన పంపిన సేవకుడు ఇష్టం లేదు” అనడం దేవునికే విరోధం. అపోస్తలుడు నియమించిన స్థానిక కాపరిని గౌరవించకపోతే, అది అపోస్తలుడిని గౌరవించనట్లే.
  • 🧱 ఆశీర్వాద ప్రవాహం: నీళ్లు ఎప్పుడూ ఎత్తు నుండి పల్లంలోకి ప్రవహిస్తాయి. దైవజనుడిని నీకంటే పై స్థానంలో ప్రతిష్టించుకుంటేనే ఆశీర్వాదం అందుతుంది. “వాడు చదువు లేనోడు, రొట్టె కోసమే వాని దగ్గరకు వెళ్తున్నాం” అని అహంకారంతో ఉంటే, ఆత్మీయ లక్షణాలన్నీ ఎండిపోతాయి. ఆ దైవజనుడు చిన్నవాడైనా, చదువు లేనివాడైనా దేవుడు నియమించిన వాడు గనుక గౌరవించాలి.
  • ⚖️ నా జీవిత పాఠం: నా చిన్నతనంలో మాకు టీకే థామస్ గారు పెద్దయ్య గారు. కానీ రత్నం బ్రదర్ అని ఒక నిరక్షరాస్యుడు ఉండేవాడు. ఆయన గొర్రెలు కాచుకునేవాడు, అక్షరం ముక్క రాదు. కానీ దేవుడు ఆయనకు బైబిల్ చదవడం నేర్పించాడు. ఆయన ప్రార్థనలో నేను పరిశుద్ధాత్మ పొందాను. ఆయన చదువు లేనివాడని మేము ఎన్నడూ తృణీకరించలేదు, ఆయనలో దేవదూతను చూశాం. ఆ గౌరవం వల్లే నేడు నేను ఈ స్థితిలో ఉన్నాను.
  • దుఃఖపరచవద్దు: హెబ్రీ 13:7, 17 ప్రకారం మీకు వాక్యము బోధించే నాయకులను జ్ఞాపకం చేసుకుని వారిని అనుసరించాలి. వారు మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం కలుగుతుంది. లోకల్ పాస్టర్ గారే మీకు అందుబాటులో ఉంటారు, వారిని గౌరవించడం మీ సంస్కారం. గురు భక్తి అనేది దైవ భక్తిలో ఒక ముఖ్యమైన దినుసు.

Detailed English Translation:

❓ Question: Some say, “I love the Prophet, but I don’t need to respect the local pastors he appointed; they are just there to serve communion.” Is this attitude correct? Does a lack of respect for mentors hinder blessings?

  • The Sin of Korah: Opposing the appointed leader is opposing God. Korah didn’t insult God; he only challenged Moses. If you reject the local pastor appointed by an Apostle, you are rejecting the Apostle himself.
  • The Flow of Blessings: Water flows from high to low. If you place a man of God below you in your mind because he is less educated, you cut off your own blessings. Your spiritual life will eventually dry up due to this pride.
  • My Life Lesson: In my youth, we had a brother named Ratnam who was a shepherd and illiterate. Yet, God enabled him to read the Bible. I received the Holy Spirit through his prayers. We never looked down on him; we saw an angel of God in him. That respect is the secret of my current blessing.
  • Do Not Grieve Them: Hebrews 13:17 says your leaders watch over your souls. If they serve with grief because of your attitude, it will be of no benefit to you. Local pastors are your immediate support. Respecting them is not just about logic; it’s about spiritual culture.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram