❓ ప్రశ్న: 2028లో అబద్ధ క్రీస్తు వస్తాడని, 2036లో యుగాంతం అని కొందరు చెబుతున్న లెక్కల గురించి మీ అభిప్రాయం ఏంటి? మనం తారీకులపై ఆధారపడాలా లేక సూచనలపైనా? (0:54:17)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 20s)
- 🛡️ లేఖనం నిరర్థకం కాదు: ఇశ్రాయేలు మీదికి రష్యా, ఇరాన్ దండెత్తి రావాలి. ఆ యుద్ధంలో దేవుని జోక్యం వల్ల వారు నాశనం అయిపోవాలి. ఆ తర్వాతే ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది. ఆ దశరాజ్య కూటమి నాయకుడే 42 నెలలు ఏలుతాడు. ఇది లేఖన సత్యం.
- 🧱 తారీకుల భ్రమ: కొందరు 2036 వంటి తారీకులు చెబుతున్నారు. అవి వారి మానవ జ్ఞానంతో అర్థం చేసుకున్నవి. ఒకవేళ ఆ తారీకులకే యేసు వస్తే మనకు సంతోషమే, కానీ ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు. పరలోకమందు దేవదూతలు కూడా తెలియదు.
- ⚖️ సిద్ధపాటు ముఖ్యం: నెంబర్ల లెక్కలు తప్పిపోయే అవకాశం ఉంది కానీ, బైబిల్ చెప్పిన సూచనలు మాత్రం తప్పవు. మనం తారీకుల లెక్కలు పెట్టుకుని కూర్చోవడం కంటే.. సూచనలను బట్టి సిద్ధపడాలి. ఆయన ఎప్పుడు వచ్చినా మనం వెళ్లగలిగే స్థితిలో ఉండాలి.
Detailed English Translation:
❓ Question: What is your take on specific predictions like Antichrist coming in 2028? Should we focus on dates or signs?
- Unfailing Word: Prophecies like the rise of a one-world government are certain. The 42-month rule of the Antichrist is a biblical fact.
- The Unknown Hour: Jesus clearly stated that no one knows the exact day or hour.
- Focus on Readiness: Dates may fail, but divine signs won’t. We must watch the world events and prepare our hearts.
