1322.Q: Why is Rebellious Society Called a ‘Harlot’? (KSM 216) 💃

❓ ప్రశ్న: బైబిల్‌లో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే సమాజాన్ని ‘వేశ్య’తో ఎందుకు పోలుస్తారు? స్త్రీల మీద ఎందుకు ఎక్కువ కాన్సంట్రేషన్ జరుగుతుంది? (1:49:40)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (09m 00s)

  • 🛡️ సృష్టి అంతా స్త్రీయే: దేవుని ముందు సకల సృష్టి జాలము ఒక స్త్రీమూర్తి. ఎందుకంటే నిన్ను సృష్టించినవాడు నీకు భర్త (యెషయా 54:5). భౌతికమైన స్త్రీ కేవలం దానికి ఒక ప్రతీక. మగవాడైనా, ఆడవాడైనా దేవుని ముందు స్త్రీయే. సృష్టి యావత్తు ప్రసవ వేదన పడుతోంది అని రోమా 8 లో ఉంది, ప్రసవ వేదన పడేది స్త్రీయే కదా!
  • 🧱 ప్రతీకాత్మక భాష: నిజమైన భర్త (దేవుడు) ను మరచి వేరే పురుషుల వెంట వెళ్ళే వారిని వర్ణించాలంటే.. భర్తను వదిలి వెళ్ళే ‘వేశ్య’ కంటే మెరుగైన ఉపమానం ఏముంటుంది? ఇది విషయాన్ని కన్వే (Convey) చేయడానికి వాడుకున్న భాష మాత్రమే. స్త్రీ వేశ్యగా మారింది అంటే వెనుక పురుషుడు ఉన్నాడనే కదా! పురుష వేశ్యలు కూడా ఉన్నారు, కానీ సమాజం స్త్రీకే ఆపాదిస్తుంది.
  • ⚖️ సత్యదేవుని ఆరాధన: సత్యదేవుని ఆరాధించడం పతివ్రతా ధర్మము అయితే, ఆయనను కాదనడం వేశ్యా వృత్తి వంటిది. ఇది కేవలం స్త్రీలను కించపరచడంగా చూడకూడదు, దేవుని ముందు మన స్థానాన్ని అర్థం చేసుకోవాలి. ఎంత పాపినైనా యేసయ్య క్షమిస్తాడు, పరలోక రాజ్యంలోకి వేశ్యలు కూడా వస్తారు అని ఆయన చెప్పారు.

Detailed English Translation:

❓ Question: Why does the Bible compare a rebellious society to a harlot?

  • Universal Femininity: Before the Creator, all of creation is considered ‘feminine’ because He is the only ‘Husband’.
  • The Analogy of Betrayal: To describe turning from the Creator to false idols, the image of a harlot is used to perfectly illustrate the betrayal of a sacred bond.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram