❓ ప్రశ్న: దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం చేస్తాడు? (0:31:12)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 50s)
- 🛡️ చిత్తం కాకపోతే: మనం అడిగింది దేవుని చిత్తం కాకపోతే ఆయన జవాబు ఇవ్వడు. ఎందుకంటే ఇప్పుడు మనం అడిగింది భవిష్యత్తులో మనకే ప్రమాదంగా మారవచ్చు. కొన్నిసార్లు ఆయన ఇస్తాడు కానీ.. అది సరైన సమయం కాకపోతే వేచి ఉండమంటాడు.
- 🧱 విశ్వాసానికి పరీక్ష: ప్రార్థనకు జవాబు రాకపోయినా దేవుడిని నమ్మగలగడం అనేది విశ్వాసానికి అతిపెద్ద పరీక్ష. దేవుడు మంచోడు, ఆయనకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో అనే నిశ్చయత మనకు ఉందో లేదో చూడటానికి ఆయన ఆలస్యం చేస్తాడు.
- ⚖️ మారుమనస్సు కోసం: ప్రార్థన చేయగానే వెంటవెంటనే అన్నీ జరిగిపోతే, ఈ లోకంలో ఉన్న వేషధారులంతా బాప్తిస్మాలు పొందుతారు. పాపాన్ని అసహ్యించుకోకుండా కేవలం మేళ్ల కోసమే వచ్చే మనుషులు దేవునికి ఇష్టం లేదు. అందుకే ఈ లోక సంబంధమైన మేళ్ల విషయంలో దేవుడు నిదానిస్తాడు. అదృశ్య ప్రపంచం మీద దృష్టి పెట్టాలని ఆయన కోరుకుంటాడు.
Detailed English Translation:
❓ Question: Why does God take time to answer our prayers?
- Divine Will and Timing: If a request isn’t good for us in the long run, God denies it. Sometimes the blessing is granted but delayed for a more suitable time.
- Testing Faith: The greatest test of faith is when there is no immediate answer. God wants to see if we still trust His goodness and sovereignty despite the silence.
- Preventing Hypocrisy: If every prayer was answered instantly, people would flock to Christ for worldly gains rather than genuine repentance. God delays earthly benefits to keep our focus on the eternal kingdom.
