1402.Q: Power of the Lord’s Table (KSM 209) 🍞

❓ ప్రశ్న: ప్రభువు బల్లలోని రొట్టె మరియు ద్రాక్షారసంలో నిజంగానే శక్తి ఉంటుందా? దీనిని కేవలం ఒక సాదృశ్యంగానే చూడాలా? (1:01:05) 🍞🍷🛡️

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 00s) 🎙️🛡️

  • 🛡️ లేఖన సత్యం: ప్రభువు బల్లలోని రొట్టె, ద్రాక్షారసం సామాన్యమైనవి అని కొందరు వాదిస్తున్నారు. అది వాళ్ళ అభిప్రాయం కావచ్చు కానీ.. మొదటి కోరింతి 10:16లో చాలా స్పష్టమైన మాటలతో చెప్పాడు కదా – “మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా? మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా?” అని. 🍷🥖📜
  • 🧱 వివేచన: ఈ రొట్టెను తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా అన్నాడు కానీ.. ‘సూచనయే కదా’ అనో లేక ‘సాదృశ్యమే కదా’ అనో అనలేదు. గనుక ఆ సహోదరులకు పూర్తిగా జ్ఞానం లేదు. ప్రభురాత్రి భోజనమును తినేటప్పుడు ‘ఇది ప్రభువు శరీరము’ అని వివేచించాలి. 11:29లో – “ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు” అని ఉంటుంది. 🧠⚖️⛈️
  • పరీక్షించుకొనుట: “అందులో నిజంగా శక్తి ఉంటే అయోగ్యంగా తీసుకున్న వాళ్లందరూ చనిపోవాలి కదా, అందరూ బాగున్నారు కదా” అని కొందరు వాదిస్తున్నారు. ఏమో.. వాళ్లు ప్రభురాత్రి భోజనానికి ముందు ఒప్పుకునే సమయం తీసుకున్నప్పుడు దేవుడు వాళ్ళని క్షమిస్తున్నాడేమో! అలాంటి ప్రమాదాలు జరగకుండానే ఒప్పుకోవాల్సిన సమయం ఇస్తాం కదా. అందుకే ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి అని పౌలు చెప్పాడు. 🛡️🙏
  • 🩸 అంతరంగ శుద్ధి: యేసు రక్తంలో స్నానాలు చేసి, దేవునితో సమాధానపడి పాల్గొంటున్నప్పుడు వాళ్ళ అంతరంగంలో ఏం సాగుతుందో వీళ్లకేం తెలుసు? లేఖనం మాత్రం అందులో శక్తి ఉందని, అది క్రీస్తు శరీరమని స్పష్టంగా చెబుతోంది. ఇతరుల భక్తిని మనం తీర్పు తీర్చలేము, కానీ వాక్యం చెప్పే సత్యాన్ని మాత్రం కాదనలేము. ✨🩸🕊️

Detailed English Translation:

❓ Question: Is there real power in the bread and wine of the Lord’s Table? Should it be viewed merely as a symbol? 🍞🍷🤔

  • Scriptural Clarity: Some argue that the bread and wine of the Lord’s Table are ordinary elements. That might be their opinion, but 1 Corinthians 10:16 states very clearly: “The cup of blessing which we bless, is it not the communion of the blood of Christ? The bread which we break, is it not the communion of the body of Christ?” 🍷🥖📜
  • True Discernment: The scripture says it is a ‘partaking’ or ‘communion’ of Christ’s body; it does not say it is merely a ‘sign’ or a ‘symbol.’ Those who say otherwise lack complete spiritual understanding. One must discern it as the Lord’s body. 1 Corinthians 11:29 warns, “For he who eats and drinks in an unworthy manner eats and drinks judgment to himself, not discerning the Lord’s body.” 🧠⚖️⛈️
  • The Act of Self-Examination: Some skeptics ask, “If there is real power, why don’t those who partake unworthily die instantly?” Perhaps it is because God forgives them when they take time to confess before partaking. We provide time for repentance specifically to avoid such judgments. This is why Paul urged every person to examine themselves. 🛡️🙏
  • Inner Spiritual Reality: When believers wash in the Blood of Jesus and reconcile with God before partaking, how can outsiders know what is happening in their hearts? Regardless of human arguments, the Word of God confirms that there is divine power in the elements and that they are the body and blood of Christ. ✨🩸🕊️

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram