76.Q: Blessing a Friend with a Loud Voice – Proverbs 27:14 (KSM 05) 🔔

❓ ప్రశ్న: సామెతలు 27:14 ప్రకారం స్నేహితుని గొప్ప శబ్దముతో దీవించడం పాపమా? వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువానికి ఆ దీవెన శాపముగా ఎంచబడును అని ఉంది కదా! దీని అర్థం ఏమిటి? ఇది పాపమా? సుదర్శన్ గారు విజయవాడ నుండి అడుగుతున్నారు. (0:59:43)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (1m 51s)

  • 🔔 సమయం మరియు సందర్భం: ఏమి లేదు నాయనా.. ఇప్పుడు పలికింది ఆశీర్వచనమే అయితే, సమయం సందర్భం చూసి అవతలి వాడికి కూడా ఎలాంటి ఎఫెక్ట్ (Effect) వస్తుందో చూసి ఆశీర్వచనం పలకాలి.
  • 😴 అసమయం: ఫర్ ఎగ్జాంపుల్ (For example) – ఒకడు అర్ధరాత్రి దాకా కష్టపడి, చెమటోడ్చి కష్టపడి ఇంటికి వచ్చి అలసిపోయి నిద్రపోయాడు. వేకువజామున అంటే మూడున్నర, నాలుగు గంటలకు వాడు గురకపెట్టి నిద్రపోతుంటే.. వాడి చెవులో నోరు పెట్టి గట్టిగా “సహోదరుడా ప్రభువు నిన్ను ఆశీర్వదించును గాక, నీకు ధనకనక వస్తు వాహనములు ఇచ్చును గాక, ఆత్మాభిషేకం ఇచ్చును గాక, హల్లెలూయా” అని వాడి చెవులో గట్టిగా అరిచామనుకో.. ఉలికిపడి లేచి కూర్చుంటాడు.
  • 🚫 దీవెన శాపమగుట: అప్పుడు వాడు మనల్ని తిరిగి తిడతాడు, కొట్టొచ్చు కూడా.. “ఏంట్రా బాబు నా బంగారు నిద్ర పాడుచేశావు” అని. ఆశీర్వచనం పలికావు.. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన.. అంటే నువ్వు మంచి మాటలు పలికినంత మాత్రాన చాలదు.
  • ముగింపు: అవతలివాడు వినగలిగిన స్థితిలో ఉన్నాడా లేదా చూసుకొని, సమయం సందర్భం చూసి నువ్వు శుభ వచనం అయినా పలకాలి అని అక్కడ పాఠం. ఓకే.

Detailed English Translation:

❓ Question: Proverbs 27:14 says that a blessing given loudly early in the morning will be counted as a curse. Is it a sin to bless a friend loudly? What is the practical lesson behind this verse?

  • Timing and Context: The essence of this verse is not about the content of the blessing but the timing and consideration for the other person. Even a good word can be perceived as an annoyance if delivered at the wrong time.
  • The Example of Disturbed Sleep: For instance, if a person has worked hard all night and is in a deep sleep at 4:00 AM, and you suddenly shout a loud blessing into his ear—”May the Lord bless you with wealth and the Holy Spirit! Hallelujah!”—he will be startled and angry.
  • When a Blessing Feels Like a Curse: Instead of feeling blessed, he might scold or even hit you for ruining his much-needed rest. To him, your ‘blessing’ felt like a curse or a disturbance at that moment.
  • Conclusion: The lesson here is that wisdom requires us to be mindful of a person’s situation and state of mind. Good intentions must be coupled with proper timing and common sense. A blessing should be delivered when the recipient is in a position to receive it joyfully.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram