103.Q: “Don’t Join a Religion”: Understanding the Inner Meaning (KSM 07) ✝️

❓ ప్రశ్న: మతంలోకి రావద్దు అని మీరు చెప్పడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? మిగతా క్రైస్తవులకు మీకు గల తేడా ఏమిటి? మీరు బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు చేస్తున్నది ఒక మతం తరపున సువార్త కాదా? (0:32:02)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 48s)

  • ✝️ మతము vs క్రీస్తు: ఇప్పుడు ఈ రెండు విషయాలు కలిపి అడిగారు మీరు, నేను విడగొట్టి సమాధానం చెప్తాను. ప్రప్రథమంగా ఏంటంటే.. మతంలోకి ఒకరిని మార్చుకోవాలని మేము ఆశించటం లేదు. మీరు మతంలోకి రావద్దు అని ఎందుకొరకు అన్నానో అదే ప్రసంగంలో చెప్పాను. మీరు హిందూ మతం మంచిది కాదనో, ఇస్లాం మంచిది కాదనో, క్రైస్తవమే మంచిదనో అనుకొని మేము చెప్పి.. నువ్వు నమ్మి క్రైస్తవ మతంలోకి వస్తే.. మతములో నుండి నుండి కూడా.. క్రైస్తవ మతంలో ఉండి నరహంతకులైనోళ్ళు, వ్యభిచారులైనోళ్ళు, క్రైస్తవులై ఉండి దొంగలైనోళ్ళు, లంచగొండులైన వాళ్ళు ఉన్నారు. పాపాలు చేసేవాళ్ళు, మనస్సాక్షి లేకుండా ఆ దేవుడంటే భయం లేకుండా ఉన్న పాప భీతి లేని నికృష్టులు అన్ని మతాల్లో ఉన్నారు. ఈ క్రైస్తవ మతస్తుల్లో కూడా ఉన్నారు.
  • 📖 ఆచారాల మార్పిడి కాదు: గనుక హిందూ మతం మంచిది కాదని క్రైస్తవ మతంలోకి రావడము.. మతము ఏదైనా ఒకటే పళ్ళు పట్టుకోవడానికి ఏ రాయి అయితే ఉన్నది అన్నట్లు.. నేను మతంలోకి కాదు! ఇంకోటి ఏంటంటే నేను ప్రచారం చేసేది క్రిస్టియానిటీ కాదు.. నేను క్రీస్తును ప్రకటిస్తున్నాను.. పౌలు అన్న మాట అది. మతంలోకి రమ్మంటే అర్థం ఏమిటంటే.. మీరు ఆ గురువారం ఆ స్వామికి, శుక్రవారం ఈ దేవికి మీరు మొక్కడం కాదే, ఆదివారం యేసు స్వామికి మొక్కాలి.. మీరు ఆ పుష్కరాలు అక్కడ ఇక్కడ కాదు, యేసు నామంలో బాప్తిసం పొందాలి అని ఇట్లాగ ఆచారములలో ఆ ఆచారం బాగాలేదు ఈ ఆచారం మంచిది అని చెప్తే మతం ప్రకటించినట్టు.
  • 🛡️ యేసు అనే వ్యక్తి: కానీ నేను అసలు దేన్ని చెప్పడం లేదు.. ఆదివారం అని చెప్పడం లేదు, బాప్తిస్మాన్ని చెప్పడం లేదు, ఏం చెప్పడం లేదు. యేసు అనే ఒక వ్యక్తి మీ పాపాల కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసము ఉంచడం వల్ల మీకు పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన మీ హృదయంలో మీ రాజుగా ప్రభువుగా ప్రతిష్టించుకోండి అని చెప్తున్నాను అంతవరకే. ఆయన మీ హృదయంలో ప్రభువు అయిన తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం ఈ గ్రంథంలో రాయబడ్డ ప్రకారం ఎలాగ నడవాల్సి వస్తుంది. మ్.. ఇప్పుడు యేసు నా ప్రభువైనందుకు ఆయన చెప్పినందుకు కొన్ని పనులు చేయడం వేరు.. యేసును ప్రభువుగా కలిగి లేకుండానే ఆ హిందూ మతాచారం బాగాలేదు ఈ మతాచారం బాగుండదు అనుకోవడం వేరు.
  • మతంలో ఉన్నోళ్ళందరూ క్రీస్తులో ఉండరు: దాని దీనికి హస్తిమశకాంతం తేడా ఉంటుంది అది ఒకటి. ఉమ్.. కొంతమంది మతంలో ఉండొచ్చు క్రీస్తులో ఉండరు.. మ్మ్.. అవును. మతంలో ఉన్నోళ్ళందరూ క్రీస్తులో ఉండరు. మతంలో ఉన్నోళ్ళందరూ క్రీస్తులో ఉంటే ఉమ్.. క్రైస్తవ దొమ్మీలు, క్రైస్తవ హంతకులు ఉండొద్దు, క్రైస్తవుడు ఒక్కడు కూడా జైల్లో ఉండొద్దు మరి! అవును. గనుక క్రిస్టియానిటీలో ఉండడం ఈక్వల్ టు క్రీస్తులో ఉండడం కాదు. ఓకే. అది తర్వాత.. ఇంకొక విషయం.. వేరే ఏదైనా కాల్ వస్తుందా తీసుకోండి తీసుకోండి. (ఇక్కడ శివచరణ్ గారి కాల్ ద్వారా వివరణ కొనసాగుతుంది).
  • 🧘 ఆత్మీయ ఎదుగుదల – శివచరణ్ గారికి సమాధానం: శివచరణ్ బాబు, ఒకప్పుడు మనము ఎన్నో తప్పులు చేసి ఉంటాము. తర్వాత యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాము. ఎంత ప్రయత్నించినా అప్పుడప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయి పడిపోయినట్టుగా పరిస్థితి కలుగుతూ ఉంటుంది. ఇలాగ ఎందుకు జరుగుతుంది, మనకు జయం ఎలా వస్తుంది, పడిపోయే ప్రమాదమే లేకుండా పరిశుద్ధ మార్గం ఎలా నడవాలి అనే ప్రశ్న మీరు అడుగుతున్నారు. నేను చెప్తున్నాను వెరీ సింపుల్.. అపోస్తల కార్యాలు రెండు 42 లో చెప్పినటువంటి నాలుగు విషయాలు మీరు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే.. ఒక్క రోజులోనే మీరు మార్పు రాకపోవచ్చు, దాన్ని క్రమక్రమేపి కొన్ని వారాలు నెలల లోపల తప్పక మీరు ఈ యొక్క సుడిగుండాల నుండి బయటకి వస్తారు గట్టెక్కుతారు.
  • 📖 నాలుగు స్తంభాలు: ఆ నాలుగు ఏంటంటే.. మొట్టమొదట అపోస్తలుల బోధ యందును, తర్వాత సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుటయందును. ఈ నాలుగు కూడా మీరు క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. మీ ఊర్లో ఉన్నటువంటి ఒక సంఘాన్ని చూసుకోండి. అక్కడ మన సహవాసానికి మీరు వెళితే, ప్రతి ఆదివారము అపోస్తలులు చేసిన బోధ.. మొదటి శతాబ్దంలో క్రీస్తు అపోస్తలులు చేసిన ఆ బోధనే మనం వింటూ ఉంటే.. ప్రతి ఆదివారము సరైన విధానములో సిద్ధపడి మన పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని ఆయన శరీర రక్తంలో మనం పాలుపొంది ప్రభురాత్రి భోజనంలో కొనసాగితే.. మూడవదిగా పరిశుద్ధుల సహవాసంలో సాధ్యమైనంత ఎక్కువగా మనం ఉంటూ ఉంటే.. నాలుగవదిగా వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన.. ఈ రెండు ఏది నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థనలో కొనసాగితే మీకు శోధన రావడానికి అవకాశం ఉండదు.
  • ముగింపు: ఫస్ట్ అఫ్ ఆల్ శోధన వచ్చే అవకాశం ఉండదు, వచ్చినా దాన్ని గెలిచేటటువంటి బలము, మనోబలం, సంకల్ప బలం దేవుడు మీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మీలో ఉండి ఆ యుద్ధాన్ని చేసి మీకు జయం సాధించి పెడతాడు. దానికి టైం పడుతుంది. యాకోబు భక్తుడు చెప్పాడు.. మనమందరము అనేక విషయాల్లో తప్పిపోవుచున్నాము, తొట్రిల్లుచున్నాము. గనుక ఒక్కసారైనా తప్పు చేయని భక్తుడు ఎవడు లేడు. ఒక్కసారైనా తప్పు చేయనోడు ఉంటే వాడిని మనం దేవుడు అంటాం, భక్తుడు అనం. కనుక మీరు అతిగా బాధపడకండి.. తప్పక దేవుడు మీకు జయ జీవితం ఇస్తాడు. అది విషయం. ఓకే.

Detailed English Translation:

❓ Question: What is the deeper meaning behind your statement, “Don’t join a religion”? How does your ministry differ from other Christian groups, and isn’t preaching from the Bible a religious act? (0:32:02)

  • Faith Over Religious Labels: My mission is not to transfer people from one religious folder to another. I say, “Don’t join a religion” because religious affiliation doesn’t guarantee righteousness. There are criminals and immoral people in every faith, including Christianity. Simply changing rituals—like attending a church on Sunday instead of a temple on Friday—is not true salvation.
  • Preaching the Person of Christ: I do not promote ‘Christianity’ as a set of traditions. Following Apostle Paul’s example, I preach Christ. Religion focus on rituals, but my message is about a Person—Jesus Christ—who died for your sins and rose again. When you accept Him as your King and Lord, your life changes from within.
  • The Four Pillars of Spiritual Health: To maintain this spiritual life, one must follow the four pillars mentioned in Acts 2:42—Apostles’ doctrine, fellowship, breaking of bread, and prayer. Engaging in these disciplines consistently builds the spiritual strength needed to overcome temptations and grow in holiness.
  • A Gradual Process of Sanctification: Spiritual maturity takes time. Even the most faithful struggle at times. As James 3:2 says, we all stumble in many ways. The goal is not instant perfection but a consistent walk with God through His Word and Spirit.
  • Conclusion: True Christianity is not about belonging to a religion; it’s about Christ living in you. By sticking to the apostolic pattern and staying in fellowship, a believer gains the power to lead a victorious life.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram