❓ ప్రశ్న: ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థనలో ఆసక్తి పెరగాలంటే ఏమి చేయాలి? ప్రార్థిస్తే అసలు ఏం జరుగుతుంది? (1:24:57)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 23s)
- ❤️ ప్రేమ మరియు ప్రార్థన: థాంక్యూ సో మచ్. ఆత్మీయ ప్రపంచం ఏదైనా నాచురల్ గా ఉండాలి గానీ.. చేయాలి అనుకొని చేస్తే అది భారమే. ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే.. నేను ఇంకొక విషయం అడుగుతాను. యవ్వనస్తులు కొంతమంది ప్రేమలో పడడం అనేది ఉంది ఇప్పుడు.. సర్వసహజంగా ప్రేమలో పడడం. ఒకరి మీద ఒకరికి ఆసక్తి కలుగుతుంది, ప్రేమ, ఇష్టం. ఒక మనిషి మీద ప్రేమ విపరీతంగా ఉన్నప్పుడు ఊరికే మాట్లాడాలని ఆశ పుడుతుంది. దేవుని మీద అలాంటి ఆశ పుట్టినప్పుడు చేసేదే అసలైన ప్రార్థన. అన్ని ఆజ్ఞలకు మూలము, ముఖ్యమైన ఆజ్ఞ ఏదంటే.. “నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో ప్రేమించాలి.”
- 📱 హృదయపూర్వకమైన సంభాషణ: దేవుని మీద ఒక ఎమోషనల్ లవ్ ఉండాలి. మగవాడు అయితే తన ప్రేయసి మీద ఉన్నంత కంటే ఎక్కువ ప్రేమ, ఆడపిల్ల అయితే తన ప్రియుడు మీద ఉన్నంతకంటే ఎక్కువ ప్రేమ.. పోనీ కడుపున పుట్టిన చిన్న పిల్లలే ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏవో కొన్ని మాటలు మాట్లాడినా, వాడు మళ్ళీ మాట్లాడాలి, మళ్ళీ వినాలి అని ఎంత మురిసిపోతారు తల్లిదండ్రులు! మరి ఒకరి మీద ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళని చూడాలని ఆశ, వాళ్ళతో మాట్లాడాలని ఆశ, ఏదో రకంగా కలిసి ఫెలోషిప్ చేయాలని ఆశ ఉంటుంది.
- ✨ ఆసక్తి తగ్గడానికి కారణం: దేవుని మీద ఉన్నటువంటి అతి తీవ్రమైన ప్రేమ ఉన్నప్పుడు మోకరించాలి, ఆయనను ఆత్మనేత్రాలతో చూడాలి, నా మనసులో భారం ఆయనకు చెప్పుకోవాలి అని ఆయన మీద ప్రేమతో మోకరించినప్పుడు ప్రార్థన అనేది సహజంగా పుడుతుంది. ఇంకా ప్రార్థన మీద ఇష్టం లేదు అని అంటే.. ముందు దేవుని మీద విసుగు వచ్చింది! వీడు దేవుని దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేసి తాత్కాలికమైన మేలులు, అవి పొందలేక దేవుని మీద సణిగి గొణిగి ప్రార్థన అంటే ఇష్టం లేదు అనుకుంటున్నాడు.
- ⚖️ ముగింపు: హృదయ పరిస్థితిలో ఉన్నటువంటి సమస్య ఇది. కనుక నేను చెప్తున్నాను.. ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి అని నేను ప్రసంగాలు చేయను.. దేవుని ప్రేమించండి అని ప్రసంగం చేస్తాను. నిజంగా వీళ్ళందరూ దేవుని ప్రేమించడం జరిగితే.. వద్దు వద్దు అన్నా సరే ప్రార్థన కూటాలు మొత్తం నిండిపోతాయి. అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: Why is prayer necessary, and how can one develop a genuine interest in it? (1:24:57)
- Prayer as an Expression of Love: Apostle Ranjith Ophir explains that prayer should be a natural conversation born out of love for God, much like the constant communication between lovers or a parent and child.
- The Root Issue: A lack of interest in prayer often indicates a problem with the “state of the heart,” where one is more focused on worldly gains than on a relationship with God.
- Conclusion: When a person truly falls in love with the Creator, prayer becomes a necessity and a delight rather than a religious duty.
