65. ప్రశ్న : క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు కృపామయుడుగా కనబడుతున్నారు అయితే పాత నిబంధనలో సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీయుల మీదికి పాములను పంపించి చంపిస్తాడు? మిద్యానీయులతో వ్యభిచారం చేసినప్పుడు ఉరివేయమంటాడు కొంతమందిని. ఈ విధంగా చనిపోయిన వారంతా నరకానికి వెళ్తారా? పరలోకానికి వెళ్తారా? ఆ టైంలో వెంటనే శిక్ష వచ్చింది కానీ ఈ టైంలో వెంటనే శిక్ష రావడం లేదు. దేవుడు అప్పుడలా ఇప్పుడిలా ఎందుకు ఉన్నాడు?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: దేవుని వ్యక్తిత్వంలోని చక్కదనం సౌందర్యం ఏమిటంటే కొన్ని పాఠాలు నేర్పడానికి కొంతమందిని పాతనిబంధనలో కఠినంగా శిక్షిస్తూ కూడా వారు అజ్ఞానదశలో చేసిన పాపాలకు నిత్యత్వమంతా శిక్షించవద్దు అన్నటువంటి తండ్రి హృదయాన్ని కూడా దేవుడు చూపించాడు అని already నా messages లో చెప్పాను. మళ్లీ చెప్తున్నాను. 1 పేతురు 3:20 దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ద పరచబడుచుండగా, అవిధేయులైనవారి యొద్దకు, అనగా చెరలో […]
