237. ప్రశ్న : మీరు “హైందవ క్రైస్తవం” గ్రంథంలో రామతత్వం, శివతత్వం, విష్ణుతత్వం. ఈ మూడు కలిసినది యేసు తత్వం అని చెప్పారు. అయితే రాముడిలో యేసు తత్వం ఉంటే రాముడు పరలోకానికి వస్తాడా? కృష్ణుడు పరలోకానికి వస్తాడా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: నేనైతే రాముడు పరలోకంలో ఉంటాడనే నమ్ముతున్నాను. ఎందుకంటే రాముడు రామాయణంలో ఒక్కసారి కూడా నేను దేవుడను నన్ను ఆరాధించండి అని చెప్పలేదు. నేను మీ పాపములను క్షమిస్తాను అని చెప్పలేదు. ఆయనొక మంచి, నీతిగలిగిన రాజు. ఆ రోజుల్లో బలి కర్మకాండ అమలులో ఉండేది. బలికర్మకాండ ఎందుకు ఉంటుంది అంటే సర్వపాప పరిహారార్థం రక్తప్రోక్షణం అవసరం అని నమ్మకం ఉన్నది గనుకనే యజ్ఞాలు చేసారు. గనుక వేరు మనుషులెవరో […]