115. ప్రశ్న : మీ యుగాంతం బుక్కు మూడుసార్లు చదివాను. మీరు చెప్పినట్టు దశరాజ్యకూటము నుండి చిన్న రాజ్యం అనే సిరియా నుండి ఒకాయన వస్తాడు. ఆయన కుయుక్తితో రాజు అవుతాడు అని! మరి మీరు చెప్పిన ప్రకారం బైబిల్ పరిశోధించిన తర్వాత సకల రాజకీయ పరిస్థితులు పరిగణలోకి తీసుకుంటే, చాలా దగ్గరలోనే మనకా పరిస్థితి రానే వస్తుందని అర్థం అవుతుంది. కాని దశరాజ్యకూటమిలో ఒక వ్యక్తి ప్రపంచరాజు అవ్వాలన్నా ఇప్పుడున్న స్టాండడ్స్ ప్రకారం 28 సంవత్సరాలనుండి 30 సంవత్సరాలైనా! అయ్యిండాలి జనరల్గా అయితే! కాని అబద్ధ క్రీస్తనే వ్యక్తి ఇప్పుడు పుట్టివుంటాడా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: అబద్ద క్రీస్తుగా ఒకడు పుట్టి పెరగడం అనేది ఉండదు! అక్కడ విషయం ఏంటంటే, ఒకడు మామూలు రాజకీయ నాయకుడే! ఒక మామూలు మానవుడే! వాడు మాములుగా నీలాగ, నాలాగా పుట్టాడు. ఆ ముఖ్యమైన పవర్ పొజిషన్ లోనికి వస్తాడు. వచ్చిన తరువాత ఏం జరుగుతాదంటే ఒక చిన్న యుద్ధం జరుగుతుంది. యుగాంతంలో నేను ఈ విషయం క్లియర్గా చెప్పాను. ఒక చిన్న యుద్ధం జరిగినప్పుడు, ఆ రాజు చనిపోతాడు. […]