106. ప్రశ్న : మీద్వారా చాలా అద్భుతాలు జరిగాయి అని శిష్యులు చెప్పగా అక్కడక్కడ వినడం జరిగింది. కొంతమంది చనిపోయిన వారు కూడ లేచారని కొంతమంది సంతానం లేనివారికి ప్రార్థించినప్పుడు సంతానం అనుగ్రహించారని, కొంతమంది రోగులకు స్వస్థత జరిగిందని ఇలాంటి సాక్ష్యాలను మీరెందుకు ప్రమోట్ చేసుకోరు? ఈనాడు కొంతమంది వీటిమీదనే పెద్ద పెద్ద సంఘాలు ఎక్కువ మందిని గ్యాదర్ చేసి మీటింగ్ స్వస్థత కూటాలు జరుపుతూ ఉన్నారు.
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: మాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు దాని గురించి మీరు అడిగారు గనుక ఒక మంచి విషయం చెబుతాను. నేను నా సేవ ప్రారంభంలో నల్గొండ జిల్లా నకిరెకల్లో నేను మొదటి సంఘం స్థాపించాను. ఆ రోజుల్లో చాలా బిజీ ప్రీచర్ అయిపోయాను. నాకు ఏకాంత ప్రార్ధన కొరకు సమయం లేకుండా, స్థలం అనేది దొరకకుండా నేను చాలా ఇబ్బంది పడ్డాను. అప్పట్లో మాకు వరుసకు చిన్నాయన అయేటట్వంటి […]