96. ప్రశ్న : కొన్ని చోట్ల పురుషులు సేవకు సమర్పించుకున్నవారు లేకపోతే ఎలా? ఇప్పటికి కొంతమంది పెద్దవాళ్ళు, నేను కొన్ని పెళ్ళిలు చేసాను, ప్రసంగాలు చేసాను. అని చెప్పిన స్త్రీలు కూడ కొందరున్నారు, వృద్ధులు! ఇలాంటి పరిస్థితిలో ఎలా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు : ఇప్పుడు అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టు ఊరకున్నాడని బైబిల్లో అపోస్తలుల కార్యాలు 17:31వ వచనంలో ఉంది. అది అన్ని సూత్రాలకు వర్తిస్తుంది. కొంతమందికి ముంచడం బాప్తిస్మమే కరెక్టని తెలియక అజ్ఞాన దశలో చిలకరింపు తీసుకున్నారు. చిలకరింపు పొందినోళ్ళందరూ నరకానికి వెళ్తారని నేను చెప్పలేను. ఎందుకంటే ముంగమూరి దేవదాసు అయ్యగారు, చిలకరింపు పొందారు, చిలకరింపు ఇచ్చారు. మరి ఆయన పరమ భక్తుడు, శ్రేష్ట భక్తుడు! మరి ఆయన […]