191. ప్రశ్న : అయితే యేసయ్య దేవుడు మనిషిని తన స్వరూపంలో, తన పోలికలో చేసుకొని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా మనిషి జీవాత్మ ఆయెను అని ఉంది. మళ్ళీ పరిశుద్ధాత్మ మనకు యేసయ్య పోయినకా పెంతుకొస్తు రోజున పరిశుద్ధాత్మ వస్తది అని అంటారు గదా అయ్యగారు 120మందిపైకి. అది ఇది ఏమి same పరిశుద్ధాత్మనా అదే పరిశుద్ధాత్మ? ఇదేమి పరిశుద్ధాత్మ?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: కాదు కాదు అది వేరు, ఇదివేరు దేవుడు మట్టిబొమ్మలోనికి పరిశుద్ధాత్మను పంపాడు అనే మాట లేదు అక్కడ. ఆయన తన శ్వాసమును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. ఇప్పుడు దేవుడు, దేవుని శ్వాసము ఆమట్టిలోపల అప్పటిదాకా మట్టికి జీవం లేదు. మట్టి ముద్ద, అంతే. ఆ మట్టి ముద్దకు ప్రాణము రావడానికి ఊదాడు. మట్టిని ఆయన ఊదక ముందు, మాంసం, రక్తము, ఎముకలు కండరాలు, ఇవి ఏమి ఏర్పడలేదు. […]