11. ప్రశ్న : అంబేద్కర్ గారు వేదాలను ఒప్పుకోలేదు. మరి మీరు వేదాలను గౌరవిస్తూ అందులో ఉన్న విషయాలను తీసుకొని “హైందవ క్రైస్తవం” అనే గ్రంధాన్ని రాసారు. ఏ విధంగా మీరు అంబేద్కరిస్ట్ అవుతారు?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: నేను అంబేద్కరిస్ట్ని, అంబేద్కర్ గారు వేదాలను ప్రామాణికంగా ఎంచలేదు వాటిని తృణీకరించారు. నేను అంబేద్కర్ ఆలోచన విధానం యావత్తు భారతీయులందరి ఆలోచన విధానం కావాలి అనే ఆశయంతో నేను పనిచేస్తున్నానని చెప్పుకుంటున్నాను. మరి నేనేమో వేదాలలో దైవ మార్గమును గూర్చిన ఉపదేశము ఉన్నదని “హైందవ క్రైస్తవం” రాసాను. ఇది అంబేద్కరిజం కాదు కదా అనే ప్రశ్న ఉన్నది. నా సమాధానం ఏంటంటే అంబేద్కర్ గారు నాకు సామాజిక విషయాలలో […]