66. ప్రశ్న: మీరు సేవా ప్రారంభంలో కొన్ని లక్షల సువార్త కరపత్రాలు పంచారని విన్నాము. ఎలా పంచేవారు? కనబడిన వారందరికా? లేదా కొన్ని ఊర్లు select చేసుకునేవారా? ఎలా ఉండేది? మీకు ఆ కరపత్రాలు ఎక్కడినుండి వచ్చేవి?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఎలా చేసాం? అంటే ఒక గ్రామ పంచాయితీ ఆఫీసుకి వెళ్లి ఆ పంచాయితీ సమితికింద ఉన్న గ్రామాల Map తీసుకునేవారం. ఆ Map మీద చేతులుంచి ఇన్ని గ్రామాలలో సువార్త నింపాలి ప్రభువా! మాకు ఆత్మాభిషేకం దయచేయి అని ప్రార్థన చేసి తర్వాత ఏ గ్రామంలో ఎంత జనాభా ఉన్నదో దాని statistics తీసుకునేవారము. చర్చి ఉందా? లేదా సువార్తకు వ్యతిరేకత ఉందా? అనుకూలత ఉందా? ఇవన్నీ తెలుసుకున్న […]