56. ప్రశ్న: దేవుడు సర్వజ్ఞాని కదా, మరి దేవుడు ఒక మనిషిని పుట్టించిన తరువాత వాడు అన్యుడిగా ఉండి దేవున్ని గ్రహించకుంటే వాడు సరకానికి వెళ్తాడు అని దేవునికి ముందే తెలిసినప్పుడు వాణ్ణి పుట్టించి, బ్రతికించి, నరకములో వేయడం కంటే పుట్టించకుండా ఉండడమే మంచిది కదా! మరి ఇలా ఎందుకు జరుగుతుంది? సమాధానం ఇవ్వగలరు.
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: ఈ ప్రశ్న అడుగుతున్న వారెవరో గానీ వారు దేవుడు నా చేత వ్రాయించిన “యాకోబు దేవుడు” అనే గ్రంథాన్ని తప్పక చదవాలని నా యొక్క అభ్యర్ధన. దీన్ని ఏమంటారంటే The Doctrine of Predestination, అంటారు. దేవుని యొక్క భవిష్యద్ నిర్ణయాల సిద్ధాంతం అంటారు. పిల్లలింక పుట్టి వాళ్లింకా కీడైనా, మేలైనా చేయకముందే దేవుడు యాకోబును ప్రేమించెను, ఏశావును ద్వేషించెను. ఇంకా పిల్లలు పుట్టనేలేదు, వాళ్లు మంచి చేయనే లేదు, […]