యాత్రికుడి పద ధ్వనులు
గేయకర్త, స్వరకర్త, గాయకులు: అపొ. డా: A S రంజిత్ ఓఫీర్ గారు
పల్లవి: వందిత శుభగుణశాలీ మానవ-మోచక! దయాంబురాశీ! అగణిత దూత ప్రణుతా! పతితావన!
చరణం-1: ఆది పాప శాపంబుగ ధరపై ముళ్ళనొసగి మా – క్రూర కరములకు నిను హింసించెడి – మార్గము జూపితే మా కొరకే యా శిక్ష భరించితే నాదు యేసువా! నాటి యెహోవా! భళిరే! ఈ దౌర్భాగ్య నరులపై నీదు కృపా బాహుళ్యమింతయా!
॥అగణిత॥
చరణం-2: నాకపు ఘన మందిరపు నివాసము కన్న పతిత ప్ర-క్షాళిత మానవ హృదియే ఘనమని మము దయ గంటివే మము నీ మహిమాలయముగ జేసితే నాదు యేసువా! నాటి యెహోవా! భళిరే! ఈ నిర్భాగ్యనరులపై నీ కరుణా దాతృత్వమింతయా!
॥అగణిత॥
1. వందిత =స్తుతింపబడుచున్న, 2. శుభగుణశాలీ = మంచి గుణములు కలిగినవాడా! 3. మోచక=విమోచకుడా! 4. దయాంబురాశీ=దయ+అంబురాశీ(దయాసముద్రుడా), 5. అగణిత=అసంఖ్యాకులైన, 6. ప్రణుతా స్తుతింపబడుచున్న వాడా! 7. పతిత+ఆవన=పతితుల పాలి ఆశ్రయమా! 8. ప్రకాళిత=కడుగబడిన