101.Q: Is Christianity a Religion or a Way of Life? (KSM 07) 🛤️

❓ ప్రశ్న: క్రైస్తవ్యం అనేది మతమా లేక మార్గమా? మతము మరియు మార్గము అనే పదాలకు గల డెఫినిషన్ ఏమిటి? క్రైస్తవ సమాజంలో, హిందూ సమాజంలో ఉన్న పెద్దలు దీనిని ‘జీవన విధానం’ అని కూడా అంటున్నారు కదా! దీనిపై మీ వివరణ ఏమిటి? (0:20:25)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 13s)

  • 🛤️ క్లారిటీ లేని వాడుక: ఈ విషయంలో ఆ వొకాబులరీ (Vocabulary) వాడుతున్న వాళ్లకు కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు క్రైస్తవుడు కూడా “ఇది మతం కాదు, ఇది మార్గము” అని చెప్పుకుంటున్నటువంటి వాళ్లకు కూడా.. మార్గం అంటే ఏంటి? మతం అంటే ఏంటి? అనే సంగతి వాళ్ళకు, క్రైస్తవ నాయకులకు కూడా ఆ క్లారిటీ లేదు. ఎందుకు అని అంటే.. గలతీ పత్రికలో పౌలు భక్తుడు స్వయానా చెప్పిన మాట నేను వినిపిస్తాను చూడండి.
  • 📖 లేఖన సాక్ష్యం: గలతీ మొదటి అధ్యాయము 22, 23, 24 వచనాలు.. “క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని.. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతిని మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిచిరి”. ఇది పౌలు భక్తుడు రాసిన మాట. కింద ఫుట్ నోట్ లో ‘విశ్వాసము’ అని రాయబడి ఉన్నది కానీ అది పర్యాయ పదంగా రాశారు కానీ మూల భాషలో ఉన్న ఆ మాటను మతమని ట్రాన్స్‌లేట్ చేయొచ్చు, విశ్వాసమని ట్రాన్స్‌లేట్ చేయొచ్చు.
  • ⚖️ మతం అంటే ఏమిటి?: పౌలు భక్తుడు చెబుతున్నాడు.. “ఒకప్పుడు నేను ఈ క్రైస్తవ మతము అనే దానిని నేను పాడు చేశాను, అదే మతాన్ని ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను” అని. గనుక యేసు ప్రభువు వారి మార్గంలో ఉన్నవాళ్ళు క్రైస్తవ మతములో ఉన్నారు అంటే దోషం ఏమిటి? మతం అనేది తప్పు మాట కాదు. అయితే ఇతర మతముల వంటి మతము కాదు అని వాళ్ళ భావన. మతం అంటే దానికి ప్రామాణిక పవిత్ర గ్రంథం ఉండాలి, దేవుడు ఎవరు, దేవుని చేరే మార్గం ఏమిటి, అవలంబించాల్సిన భక్తి సాధన నియమములు, పూజా విధానములు ఇట్లాంటి డిమార్కేషన్స్ (Demarcations) ఉంటే అది ఒక మతం.
  • 🏛️ ఇతర మతాలతో పోలిక: ఇప్పుడు ఇస్లాం ఉంది.. మహమ్మద్ ప్రవక్త, అల్లాహ్ దేవుడు, ఖురాన్ పవిత్ర గ్రంథం. అలాగే క్రైస్తవ్యం.. జీసస్ దేవుడు, బైబిల్ పవిత్ర గ్రంథం. ఇవి రిలీజియన్స్ (Religions) అని చెప్తే తప్పు కాదు. కానీ హిందూత్వం అనేదానికి ఒకటే హోలీ బుక్ అనేది లేదు, ఎందరో దేవుళ్ళు, ఎన్నో పూజా విధానాలు. గనుక “ఇదొక మతం కాదు బాబు, ఇదొక జీవన విధానం” అని వాళ్ళు చెప్తుంటే అది కరెక్టే. కానీ స్ట్రిక్ట్ గా (Strictly) జుడాయిజం, ఇస్లాం మరియు క్రిస్టియానిటీ ఇవి రిలీజియన్స్ అని చెప్తే తప్పు కాదు.
  • ముగింపు: మనవాళ్ళు మిషనరీల కాలము నుండి ఎందుకు అలాగ చెబుతూ వచ్చారు అంటే.. మీకు తెలిసిన ఇతర మతముల వంటి మతం ఇది కాదు, అన్నిటి కంటే ఇది విశిష్టమైన శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉన్నది అని చెప్పడం చేతకాక అలాగే చెప్పారు. కానీ బైబిల్ లోనే మతము అనే సంగతి పౌలే అన్నట్టు ఉన్నది. గనుక క్రైస్తవ్యం ఒక విశిష్టమైన మతం మరియు మోక్షానికి నడిపించే ఏకైక మార్గము. అది విషయం. ఓకే.

Detailed English Translation:

❓ Question: Is Christianity a religion or a way of life? What are the definitions of ‘Religion’ and ‘Way’? Religious and political leaders often call their faiths a ‘way of life’—what is your take on this? (0:20:25)

  • Lack of Clarity in Usage: Many people, including Christian leaders, use the terms ‘Religion’ and ‘Way’ without a clear understanding of their definitions. They often shy away from the word ‘Religion,’ thinking it diminishes the faith, but this stems from a lack of clarity.
  • Scriptural Basis: In Galatians 1:22-24, Apostle Paul writes that the churches in Judea heard that “the man who formerly persecuted us is now preaching the faith (religion) he once tried to destroy.” The original text can be translated as both ‘Faith’ and ‘Religion.’ Paul himself acknowledged that he was preaching what others identified as a religion.
  • Defining Religion: A religion is typically defined by specific parameters: a sacred scripture, a defined deity, a clear path to reach God, and specific rituals or codes of conduct. By these standards, Islam and Christianity qualify as religions because they have distinct boundaries (e.g., The Bible and Jesus Christ).
  • Comparison with Hinduism: In Hinduism, there isn’t a single sacred book or a single way of worship; it encompasses diverse beliefs and deities. Therefore, when leaders call it a ‘way of life’ rather than a structured religion, they are technically correct. However, structured faiths like Christianity are indeed religions in a formal sense.
  • Conclusion: Historically, missionaries emphasized that Christianity was “not a religion but a way” to highlight its uniqueness and personal relationship with God. While it is indeed the ‘Way’ to salvation, calling it a religion is scripturally and linguistically accurate. It is a unique religion that serves as the only way to the Father.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram