❓ ప్రశ్న: 666 ముద్ర గురించి జరుగుతున్న ప్రచారం నిజమేనా? అంత్యకాల సూచనలు ఎప్పుడు నెరవేరుతాయి? ఈ మధ్య ట్రంప్ అల్లుడు ఒక కంపెనీ పెట్టి 666 ముద్రను ప్రారంభించాడని, మన దేశంలోకి కూడా వచ్చేసిందని ప్రచారం చేస్తున్నారు.. దీనిపై మీ వివరణ ఏంటి సార్? (1:18:50)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 47s)
- 🐉 సెన్సేషనలిజం మరియు అపోహలు: థాంక్యూ సో మచ్. ఈ మధ్య ట్రంప్ అల్లుడు తను ఒక కంపెనీ పెట్టి 666 ముద్రను ప్రారంభించాడు, ఇప్పుడు మన దేశంలోకి కూడా వచ్చేసింది అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తున్నారు సార్ అని అడిగారు. ఇదంతా కూడా సెన్సేషనలిజం (Sensationalism) అంటారు. సెన్సేషనలిజం అంటే అర్థం ఏమిటంటే.. ఒక గాసిప్ క్రియేట్ చేసి మీడియా దృష్టిని, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఏదో ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని ప్రచారంలోకి తీసుకురావడం. దట్ ఈజ్ సెన్సేషనలిస్టిక్ జర్నలిజం (That is sensationalistic journalism). అదంతా కూడా ట్రాష్ (Trash) అని నేను అంటున్నాను. 666 ముద్ర ఏదీ ఇంకా రాలేదు. దానితో పోల్చదగినవి ఏవైనా ఉంటే వచ్చి ఉండొచ్చు. సమ్ కైండ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ (Some kind of identification), సమ్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఏ పర్సన్ (Some way of identifying a person). ఆధార్ కార్డు చూసి ఒకడు అంటాడు.. ఇదే 666 అంటాడు. అమెరికాలో సోషల్ సెక్యూరిటీ నంబర్ (SSN) అని ఉంటే.. ఇదిగో ఇదే 666 అంటాడు. ఇవన్నీ కూడా ట్రాష్.
- 📖 ప్రపంచ ఏక ప్రభుత్వం మరియు 10 మంది రాజులు: నేను క్లియర్ గా చెప్తున్నాను సకల జనులు ఆలకించండి. 666 ముద్ర ఎప్పుడు వస్తుందంటే.. ముందు దశరాజ్య కూటమి, 10 మంది రాజుల కూటమి ద్వారా ప్రపంచ ఏక ప్రభుత్వము స్థాపించబడాలి. ప్రపంచ ఏక ప్రభుత్వము.. ఇటు సిరియా గానీ, ఇరాక్ అధ్యక్షుడు గానీ, ఈ రెండు దేశాల్లో నుండి వచ్చిన అతడో ఇతడో ఎవరో ఒకడు చైర్మన్ గా ఉంటాడు. ఆ 10 నేషన్ కాన్ఫెడరేట్ గవర్నమెంట్ (10 Nation Confederate Government). ఆ గవర్నమెంట్ కు అతడు 666 ఊరకనే వేయడు. “నా విగ్రహానికి మొక్కండి, నేను దేవుడినని మీరు ఒప్పుకోండి” అని డిమాండ్ చేస్తాడు. ఆ విగ్రహానికి సాగిలపడి, మ్రొక్కి.. “ఇక నాకు ఇంతకుముందున్న దేవతలు కాదు, నీవే నాకు దేవుడవి. అన్నం పెట్టినవాడే దేవుడు, ఇంకో దేవుడు ఉంటేనేమి పోతేనేమి.. నీవే నా దేవుడవు” అని ఆ ప్రపంచ నియంతకు మ్రొక్కి, అతన్ని ఆరాధించి, అతని భక్తుడైనాడు అనడానికి ఒక అక్నాలెడ్జ్మెంట్ (Acknowledgment) గా ఈ 666 ముద్ర అప్పుడు వేస్తారు.
- 🛡️ 666 ముద్రకు ముందు జరగాల్సిన అంతర్జాతీయ పరిణామాలు: ఇప్పుడు ఆధార్ కార్డు గానీ, అమెరికాలో ఎస్.ఎస్.ఎన్ (SSN) గానీ లేకపోతే ఇంకో విధంగా ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ నంబర్స్ గానీ, చిప్స్ గానీ ఏదైనా.. మనకు ఇవ్వకముందు “ఉన్న దేవతలను వదిలేసి కొత్త దేవుడిని మొక్కండి” అని ఎవడైనా బలవంతం చేసి అలాగా మొక్కేటట్టు చేసి అప్పుడు ఇచ్చాడా? అంటే అటువంటిది ఏదీ లేదు. కనుక ఇవేవీ కూడా 666 కు సంబంధం లేదు. ముందు అమెరికా మీద దేవుని ఉగ్రత వస్తుంది. అమెరికా మొత్తం పతనం అయిపోతుంది. రష్యా ఇజ్రాయిల్ మీదకు వచ్చేసి రష్యా పతనం అయిపోతుంది. ఏ ఒక్క అగ్రరాజ్యానికి శక్తి చాలనందుచేత 10 అరబ్ రాజ్యాలు వన్ వరల్డ్ గవర్నమెంట్ (One World Government) ఏర్పాటు చేస్తాయి. వాళ్ళ చైర్మన్, ఆ వన్ వరల్డ్ గవర్నమెంట్ యొక్క ప్రెసిడెంట్.. “నేనే ప్రపంచానికి రాజును, దేవుడిని కూడా ఒప్పుకోండి. లేకపోతే మీకు అమ్మడానికి అధికారం ఉండదు, కొనడానికి అధికారం ఉండదు” అని డిమాండ్ చేసి ఊరూరా వాడి విగ్రహాలు పెడతాడు. దానికి సాగిలపడి మొక్కాలి.. అప్పుడు నుదుట 666 వేయించుకోవాలి. అప్పుడు వచ్చేదే బైబిల్ లో చెప్పిన 666 నంబర్.
- ⏳ ముగింపు మరియు స్పష్టత: దానికి సిద్ధపాటుగా ఇంకా చిన్న చిన్న సిస్టమ్స్ (Systems) ఏమైనా వాళ్ళు ట్రయల్స్ లాగా చేస్తూ ఉన్నారేమో తెలియదు కానీ, ఇప్పుడు క్రీస్తు విరోధి ప్రభుత్వమే రాలేదు గనుక ఇప్పుడు వచ్చేది ఏదీ ఆ బైబిల్లో 666 కాదు. ముందు మనం చెప్పుకున్నట్టుగా ఆ దశరాజ్య కూటమి రావాలి, ఆ తర్వాత ఆరాధనతో కూడిన ముద్ర ప్రక్రియ మొదలవ్వాలి. ఇవన్నీ జరగకుండా వచ్చే ఏ టెక్నాలజీని కూడా 666 అని మనం భ్రమపడకూడదు. అదంతా కేవలం జర్నలిజం పేరుతో జరుగుతున్న ప్రచారం మాత్రమే. అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: Is the sensational news about the 666 mark true? Does the venture by Donald Trump’s son-in-law signify its beginning? How should we understand end-time prophecies regarding this? (1:18:50)
- The Reality of Sensationalism: Apostle Ranjith Ophir explains that rumors linking current technologies or business ventures to the 666 mark are mostly “sensationalistic journalism.” These are gossips designed to grab attention. He clarifies that existing identification systems like Aadhaar cards or Social Security Numbers are not the biblical mark.
- Global Governance and the Ten Kings: Scripturally, the 666 mark is tied to a specific global event: the formation of a ten-nation confederacy and a One World Government. The leader of this government will not just issue a number; he will demand worship. The mark serves as an acknowledgment of those who worship him as a deity.
- Geopolitical Prerequisites: Before the mark is implemented, significant global shifts must occur, including the fall of current superpowers and the rise of a unified power bloc. The mark involves economic control (buying and selling) but is fundamentally rooted in mandatory worship and the rejection of God.
- Conclusion: Since the global government of the Antichrist has not yet arrived, no current technology or chip can be identified as the biblical 666 mark. Believers must focus on the scriptural order of events rather than being swayed by media rumors.
