1120.Q: Tithe – Law vs. Grace and Its Origins (KSM 221) 🪙

❓ ప్రశ్న: దశమ భాగం (Tithe) అనేది ధర్మశాస్త్రం ద్వారా వచ్చిందా లేక అబ్రహాము కాలం నుందే ఉందా? “మేము ధర్మశాస్త్రం కింద లేము, కృపలో ఉన్నాము” అని చెప్పి దశమ భాగం ఇవ్వకపోవడం సరైనదేనా? క్రైస్తవులు దీనిని ఎలా పాటించాలి? (1:33:50)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (07m 00s)

  • 🛡️ బాలశిక్ష vs గ్రాడ్యుయేషన్: ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు. బాల శిక్షలో ఉన్నోడు నూటికి పది రూపాయలు ఇచ్చాడు. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత (కృపలో) పావలా కూడా ఇవ్వట్లేదు అంటే అది న్యాయమా? నేను ధర్మశాస్త్రం కింద లేను కనుక దశమ భాగం ఇవ్వను అని మొత్తానికి ఎగ్గొట్టడం అనేది భక్తి కాదు. స్వేచ్ఛార్పణ అంటే అది నూటికి 10 కాదు 20, 30, 50 అయి ఉండాలి.
  • 🧱 ధర్మశాస్త్రం కంటే ముందే: దశమ భాగము ధర్మశాస్త్రము ద్వారా ప్రారంభం కాలేదు. సీనాయి కొండ మీద మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వక ముందే అబ్రహాము మెల్కిసెదకుకు దశమ భాగములను ఇచ్చెను (ఆదికాండం 14). యాకోబు కూడా 10వ వంతు ఇస్తానని మొక్కుకున్నాడు. అప్పటికి మోషే లేడు, ధర్మశాస్త్రం లేదు. మనం మోషే నీతికి వారసులం కాదు, అబ్రహాము నీతికి వారసులం.
  • ⚖️ కనిష్ట ప్రమాణం (Minimum): దశమ భాగం అనేది మినిమమ్ (Minimum), బాటం లైన్ అది. దాని మీద ఓవర్ అండ్ అబౌ (Over and above) ఇచ్చేది నీ స్వేచ్ఛార్పణం. లేవియా కాండము 27:30 ప్రకారం “దశమ భాగము యెహోవా సొమ్ము”. ఎవరైతే ఇవ్వలేదో మీరు దొంగలు అని దేవుడు మలాకీ 3:10లో చెప్తున్నాడు.
  • దేవుని ఆర్డర్: కల్వరి కొండ మీద యేసు ప్రభువు చేసిన యజ్ఞము ద్వారా సీనాయి కొండ నిబంధన కొట్టివేయబడింది. కానీ సీనాయి కొండ కంటే 500 సంవత్సరాల ముందు అబ్రహాము చేసినటువంటి ఆ పద్ధతి ఎందుకు కొట్టివేయబడుతుంది? అది దేవుని ఆర్డర్ (Order). ఇచ్చిన వాడు దీవించబడతాడు, ఇవ్వని వాడు నష్టపోతాడు.

Detailed English Translation:

❓ Question: Is tithing a part of the Law (Torah) or did it exist since the time of Abraham? Is it right to avoid tithing by claiming we are under Grace and not the Law? How should Christians practice it?

  • Schoolmaster vs. Graduation: The Law was our schoolmaster. If someone under the basic law gave ten percent, is it fair if someone who has ‘graduated’ (into Grace) gives nothing? Avoiding tithes by claiming you’re not under the Law is not true devotion. Freewill offering in Grace should be more than ten percent—perhaps 20, 30, or 50 percent.
  • Before the Law: Tithing did not start with the Law. Before Moses received the Law on Mount Sinai, Abraham gave tithes to Melchizedek (Genesis 14). Jacob also vowed to give a tenth. At that time, there was no Moses and no Law. We are heirs of Abraham’s righteousness, not the Mosaic Law’s righteousness.
  • The Minimum Standard: Tithing is the minimum—the bottom line. What you give over and above that is your freewill offering. According to Leviticus 27:30, “the tithe belongs to the LORD.” In Malachi 3:10, God refers to those who withhold it as robbers.
  • Divine Order: The covenant of Mount Sinai was abolished through Jesus’ sacrifice on Calvary. However, why would the practice started by Abraham 500 years before Sinai be abolished? It is a Divine Order. Those who give are blessed, and those who don’t, suffer loss.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram