❓ ప్రశ్న: యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులు ఆగిపోవడం సైన్స్‌కు విరుద్ధమా? సూర్యుడు ఒకే చోట ఉంటాడని సైన్స్ చెబుతుంటే, బైబిల్ లో సూర్యుడు ఆగిపోయినట్లు ఎందుకు రాయబడింది? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? (1:16:30)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (07m 00s)
- 🛡️ సాపేక్ష కదలిక (Relative Motion): సార్, మనం ట్రైన్ లో కూర్చొని ఉంటాం. కాసేపు అయినాక “హైదరాబాద్ వచ్చేసింది” అంటాం. హైదరాబాద్ వచ్చిందా? హైదరాబాద్ కి మీరు వచ్చారా? హైదరాబాద్ ఉన్నకాడనే ఉంది కదా, అది ఎక్కడికి రాదు ఎక్కడికి పోదు. కానీ ట్రైన్ లో కూర్చున్న మీకు ఆ స్టేషన్ ఇప్పుడు కనబడుతుంది గనుక “వచ్చేసింది” అంటాం.
- 🧱 దృష్టి కోణం: మనమే అక్కడికి పోయి అంటుంటాము. సూర్యుడు ఉదయించి మళ్ళా అస్తమించినట్టు కనబడుతున్నాడు కదా, ఆ రోజుల్లో ఆ స్థితి అక్కడ కదలకుండా ఉండమనే ఆజ్ఞ అది. అంతేగాని సూర్యుడు కదలాలి, చంద్రుడు కదలాలి అని ఆజ్ఞ కాదు. ఏది కదిలినందుకైతే సూర్యోదయం కనబడుతుందో, ఆ కదలికలను శాసించడం.
- ⚖️ యెహోషువ ఆజ్ఞ: యెహోషువ 10:12-13 – “సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము… సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను.” సూర్యుడు ఆగిపో అంటే సూర్యుడు కదిలినట్టుగా కనబడేటట్టు చేసే ఆ కదలికలు (భూమి కదలికలు) ఆగిపోమన్నాడు.
- ✨ ఖగోళ కదలికల నియంత్రణ: సైన్స్ లో ఇలా ఉంది కదా అని అర్థం కాకపోవచ్చు, కానీ యెహోషువ ప్రార్థించినప్పుడు ఆ వెలుగు నిలిచిపోవడానికి కారణమైన ఆ ఖగోళ కదలికలను దేవుడు ఆపివేశాడు. అది అసాధ్యం ఏమీ కాదు, సృష్టికర్తకు అది చాలా సులువు.
Detailed English Translation:
❓ Question: Is it against science that the sun and moon stood still when Joshua prayed? If science says the sun is stationary, why does the Bible say the sun stopped? What is the logic behind this?
- Relative Motion: Sir, imagine we are sitting on a train. After some time, we say, “Hyderabad has arrived.” Did Hyderabad move to us? No, we moved to Hyderabad. Hyderabad stays where it is. But because the station appears before you as you sit in the train, we say “it arrived.”
- Point of View: Similarly, we observe the sun rising and setting. The command given in those days was for that state of light to remain fixed. It wasn’t about whether the sun or moon literally moved in their orbits, but rather commanding the specific movements that cause the appearance of sunrise and sunset to cease.
- Joshua’s Command: Joshua 10:12-13 says, “Sun, stand still over Gibeon, and you, moon, over the Valley of Aijalon… So the sun stood still, and the moon stopped.” When he said “Sun, stop,” he was commanding the movements (the Earth’s rotation) that make the sun appear to move across the sky to halt.
- Celestial Control: One might find it difficult to reconcile this with modern science, but when Joshua prayed, God halted the celestial movements responsible for the daylight remaining constant. This is not impossible; for the Creator, it is very simple.
