❓ ప్రశ్న: అగాధము నుండి వచ్చే క్రూర మృగం అంటే నిజంగా పామా లేక అదొక ఆధ్యాత్మిక వర్ణనా? ప్రకటన గ్రంథంలోని ఏడు బూరలు ఎప్పుడు ఊదబడతాయి? దానియేలు 70వ వారానికి వీటికి ఉన్న సంబంధం ఏంటి? (1:56:45)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (07m 00s)
- 🛡️ 70వ వారం ఆరంభం: బూరలు ఊదబడడం ఇంకా మొదలు కాలేదు. బూరలు ఊదడం అనేది దానియేలు ప్రవచించిన 70వ వారం ఆరంభమైన తరువాతనే శోధింపబడతాయి. ఒక ప్రపంచ రాజు ఇశ్రాయేలుతో ఏడు సంవత్సరాలకు ఒడంబడిక (ఒప్పందము) చేసుకున్నప్పుడు 70వ వారం ప్రారంభం అవుతుంది.
- 🧱 రాజకీయ మార్పులు: అంతకంటే ముందు దశరాజ్య కూటమి ఏక ప్రభుత్వం స్థాపించాలి. ఉత్తర దేశపు రాజు (సిరియా లేక ఇరాక్ అధ్యక్షుడు) ఇశ్రాయేలుతో ఏడేండ్ల సంధి మీద సంతకం చేసినప్పుడు 70వ వారం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కూడా వెంటనే బూరలు ఊదబడవు. కొంతకాలం ప్రశాంతంగా ఉన్నాకనే బూరలు ఊదబడుట ప్రారంభం అవుతుంది.
- ⚖️ ఆధ్యాత్మిక వర్ణన: అగాధము నుండి వచ్చే క్రూర మృగం అంటే అది ఆధ్యాత్మిక వర్ణన. అంత్యకాలం వస్తున్న కొద్దీ ప్రకృతిలో కొన్ని మార్పులు వస్తాయి. కానీ ఇంకా ఆ అంత్య వారము (మహా శ్రమల కాలం) ప్రారంభం కాలేదు. ఇప్పుడేం బూరలు ఏమీ ఊదబడలేదు.
- ✨ అక్షరార్థమైన బూరలు: ప్రకటన 8వ అధ్యాయం ప్రకారం దేవుని ఎదుట నిలిచే ఏడుగురు దూతలకు ఏడు బూరలు ఇవ్వబడతాయి. అవి అక్షరార్థమైన బూరలు పరలోకంలో ఊదబడతాయి. ఇక్కడ భూమి మీద జరిగే సంభవాలను బట్టి ఇది ఫలానా నెంబర్ బూర అని మనం గుర్తుపట్టాలి. యేసు రెండవ రాకడకు సంబంధించి ఊదబడేవి అక్షరార్థమైన బూరలే.
Detailed English Translation:
❓ Question: Is the beast from the abyss a literal serpent or a spiritual description? When will the seven trumpets of Revelation be sounded? What is their connection to Daniel’s 70th week?
- The 70th Week Commencement: The sounding of the trumpets hasn’t started yet. They will only be sounded after the commencement of Daniel’s 70th week. This week begins when a world leader enters into a seven-year covenant (agreement) with Israel.
- Political Prerequisites: Before this, a ten-kingdom alliance must establish a one-world government. When the King of the North (the leader of Syria or Iraq) signs a seven-year peace treaty with Israel, the 70th week officially begins. Even then, the trumpets aren’t sounded immediately; they begin after a period of relative peace.
- Spiritual Symbolism: The beast emerging from the abyss is a spiritual description. As the end times approach, there will be changes in nature, but that final week (the period of Great Tribulation) has not yet begun. No trumpets are being sounded currently.
- Literal Trumpets in Heaven: According to Revelation 8, seven angels who stand before God are given seven trumpets. These are literal trumpets sounded in heaven. Based on the events occurring here on earth, we must identify which specific trumpet is being sounded. The trumpets related to the second coming of Jesus are indeed literal.
