❓ ప్రశ్న: నీతిమంతునికి ఆపద సంభవించదు (సామెతలు 12:21) మరియు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము (కీర్తన 34:19) – ఈ రెండు వచనాలకు సమన్వయం ఏమిటి? (0:39:00)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 43s)
- ⚖️ సత్యానికి రెండు పార్శ్వాలు: బైబిల్ లో అలాగా చాలా వచనాలు విరుద్ధంగా కనబడతాయి, కానీ అవి విరుద్ధ వచనాలు కాదు. ‘దే అప్పియర్ టు బి కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్ బట్ దే డు నాట్ రియల్లీ కాంట్రడిక్ట్ ఈచ్ అదర్’ (They appear to be contradicting each other but they do not really contradict each other). అవి ఒక నాణేనికి రెండు పక్కల లాగా, ఒక సత్యానికి అటు ఇటు వేరు వేరు కోణాలు. ఇది చాలా అద్భుతమైన ప్రశ్న.
- 🔍 దృక్కోణం మరియు ఆపద: నీతిమంతునికి కలిగే పరిస్థితులు, ఆపదలు ఈ లోకపు దృక్కోణం నుండి ఆపదలుగా కనిపిస్తాయి. కానీ ఆత్మ సంబంధి యొక్క వ్యూ పాయింట్ (Viewpoint) నుండి, పరలోక సంబంధి యొక్క దృక్కోణం నుండి అవి ఆపదలు కాదు. అది బంగారమును పుటము వేసే కొలిమి. “ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని” అన్నాడు. లోకం దృష్టిలో యోబుకు ఆపద కలిగింది, కానీ యోబు ఏమంటాడు? “నేను శోధింపబడిన తర్వాత సువర్ణము వలె ప్రకాశిస్తాను” అంటాడు. మరి ఆయనకు ఆపద వచ్చిందందామా లేక దేవుడు మేలు చేశాడందామా?
- ✨ శ్రమయే మేలు: మనకు ఆపద కలిగిందని లోకస్తులు, సాతాను అనుకుంటారు. కానీ మనం నిజంగా దేవుని సంబంధులమైతే.. “ఆహా ఎంత అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది నేను పరిశుద్ధ పరచబడటానికి” అనుకుంటాం. “నీ కట్టడలు నేను నేర్చుకొనునట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయెను” అన్నాడు భక్తుడు. శ్రమను మేలుగా చూసేవాడే భక్తుడు కానీ శ్రమను ఆపద అనుకునేవాడు భక్తుడే కాడు. ఈ లెసన్ క్రైస్తవులందరూ నేర్చుకోవాలి.
- 🛡️ బోధకుల బాధ్యత: పరిస్థితులు అనుకున్నట్టు జరగనప్పుడు “దేవుడు నాకు కీడు చేశాడు” అని అనుకోవడం భక్తిహీనుడి లక్షణం. పాస్టర్లు అందరూ తమ విశ్వాసులకు సరైన ఆలోచన విధానం నేర్పించాలి. “మీకు ఏ కష్టం రాదు” అని చెప్పడం సరైన బోధ కాదు. “కష్టాలు వచ్చినా దాన్ని మీరు కష్టం అనుకోకూడదు, ఇది మిమ్మల్ని పరిశుద్ధ పరిచే కంసాలి వాని అగ్ని” అని చెప్పినోడే కరెక్ట్ పాస్టర్. లేకపోతే ఈ ప్రాస్పరిటీ ప్రీచింగ్ (Prosperity Preaching) చేసేవాళ్ళు అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు పొట్టులాగా కాలిపోతారు. కాబట్టి శ్రమ అనగా అది ఆపద కాదు, అది మనకు మేలు. అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: How do we reconcile Proverbs 12:21, which says “no harm befalls the righteous,” with Psalm 34:19, which says “many are the afflictions of the righteous”? (0:39:00)
- Two Sides of the Same Coin: Apostle Ranjith Ophir explains that these verses are not contradictory but represent two different perspectives of the same truth. While they may appear to conflict, they describe the same reality from worldly and spiritual viewpoints.
- The Spiritual Perspective of Trouble: From a worldly or carnal perspective, trials and tribulations are seen as ‘harm’ or ‘disasters.’ However, from a spiritual perspective, these are not harms but a refining process—like gold being purified in a furnace. Job saw his suffering not as an end but as a process that would make him shine like gold.
- Suffering as a Blessing: True believers view trials as opportunities for sanctification and learning God’s statutes. As the Psalmist said, “It was good for me to be afflicted.” A believer who sees trouble as a means to become holier understands that “no harm” actually happens because everything ultimately works for their good.
- Correct Pastoral Teaching: He cautions against ‘Prosperity Preaching’ that promises a life without trouble. True teaching prepares believers to face trials with the understanding that they are being refined by God. Seeing suffering as an ‘affliction’ is human, but seeing it as a ‘blessing’ is the mark of a true follower of Christ.
