130.Q: Sin and Death Before Adam and Eve (KSM 08)

❓ ప్రశ్న: ఆదాము హవ్వలు పాపం చేయకముందే సృష్టిలో పాపం, మరణం ఉన్నాయా? (0:56:42)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి

దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 23s)

  • 🐍 పాపం – ఆదాము కంటే ముందే ఉన్నది: అది రెండు ప్రశ్నలు.. పాపము ఉన్నదా అనేది వేరు, మరణం ఉన్నదా అనేది వేరు. పాపం అయితే ఉన్నది. ఎందుకంటే ఆదాము హవ్వలు సృష్టింపబడకముందే ఈ భూమి మీద అంతకుముందు ఉన్నటువంటి ప్రపంచము, సృష్టి జాలము ఎలా ఉండేదో మనకు తెలీదు కానీ, దేవుడు ఈ భూమిని నివాస యోగ్యముగా సృష్టించాడు. నివాస యోగ్యము అంటే అక్కడ నివాసులు ఉన్నట్లే లెక్క. లూసిఫర్ పడిపోయినప్పుడు భూమి మీద ప్రళయం వచ్చింది, ఆ తర్వాత పునఃసృష్టి కార్యక్రమమే ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉంది. కాబట్టి పాపం ఎవరి ద్వారా వచ్చిందో ఆ పాప పురుషుడు, ఆది మహా ఘటసర్పం (సాతాను) ఆదాము కంటే ముందే ఉన్నాడు. వాడు దేవదూతగా ఉన్నప్పుడే పాపం పుట్టింది, ఆ తర్వాత వాడిని భూమి మీదకు తోసివేయడం జరిగింది.
  • మరణం – మానవజాతి ప్రత్యేకత: కానీ మరణం అనేది అంతకుముందు లేదు. దట్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ మ్యాన్‌కైండ్. దేవదూతలకు మరణం లేదు. దేవదూతలు ఎలా అంటే చెట్టు లాగా.. చెట్టును నరికితే మళ్ళా కొమ్మలు మొలుస్తాయి కానీ చెట్టు చచ్చిపోదు. అలాగే దేవదూతలకు రక్తం ఉండదు, వారి బాడీ మొత్తం లైఫ్ ఎనర్జీ నిండి ఉంటుంది. ఎక్కడైనా నరికితే అది మళ్ళా మొలుచుకొస్తుంది, వాడు చచ్చిపోడు. వాడు అంతం కావడం అంటూ ఉండదు. కానీ మనిషిని అడ్డంగా నరికితే వాడు చచ్చిపోతాడు. ఎందుకంటే వాని ప్రాణమంతా రక్తము అనే ఒక ద్రవము మీద కూర్చుని ఉన్నది.
  • 🩸 యజ్ఞము మరియు మరణం: దేవుడు మనిషిని ఎందుకు ఇలా సృష్టించాడు అంటే.. విశ్వ పౌరులందరినీ దేవునితో సమాధాన పరచాలంటే వాళ్ళకు బదులుగా ప్రాణమును అర్పించే ఒక యజ్ఞ పురుషుడు కావాలి. యజ్ఞము జరగాలంటే మరణించడానికి అవకాశం ఉన్న జాతి ఒకటి ఉండాలి. మరణం లేని జాతిలో యజ్ఞం జరగదు. అందుకే మరణించడానికి అవకాశం ఉన్న ఈ మానవ జాతిని దేవుడు ఈ భూమి మీద సృష్టించాడు. అందుకే భూమి సృష్టింపబడుట అనగా యజ్ఞవేదిక నిర్మించబడుట. భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలందరూ వచ్చి జయధ్వనులు చేశారు. ఎందుకంటే ఎక్కడా జరగని ఒక మహాద్భుతం ఇక్కడ జరుగుతుందని వారికి తెలుసు.
  • ముగింపు: గనుక ఆదాము కంటే ముందు పాపం ఉన్నప్పటికీ, మరణం అనేది లేదు. మరణం అనేది కేవలం మానవజాతి ద్వారానే ప్రవేశించింది. ఆదాము పాపం చేసిన తర్వాతే మరణం అనేది రాజ్యము చేసింది అని రోమా పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు. దేవుడు ముందుగానే మనిషిని మరణించే స్వభావంతోనే సృష్టించాడు, ఎందుకంటే ఆయన యజ్ఞం చేయాలి కాబట్టి. అది విషయం. ఓకే.

Detailed English Translation:

❓ Question: Did sin and death exist in creation before the fall of Adam and Eve? (0:56:42)

  • The Reality of Sin Before Adam: Apostle Ranjith Ophir explains that sin predates Adam and Eve. Lucifer (Satan) rebelled against God long before humans were created. When he was cast down to earth, sin was already present in the universe. The restoration described in Genesis 1 took place after the earth had been impacted by this fall.
  • The Concept of Mortality: While sin existed, death did not. Angels are immortal beings made of life energy without blood; they cannot be killed in the physical sense. Death was a unique attribute introduced specifically for the human race. Human life is tied to the blood, making physical death possible.
  • The Purpose of Creation: God created a mortal race (humanity) because a sacrifice was needed to reconcile all creation to Himself. For a sacrifice (Yagna) to occur, there must be a being capable of dying. Therefore, Earth was established as a “Sacrificial Altar.” This is why angels rejoiced at Earth’s creation—they realized it was the platform for the ultimate redemption through Christ’s death.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram