1416.Q: Spiritual Leaders Entering Politics (KSM 208) 🎭

❓ ప్రశ్న: సెలబ్రిటీలు మరియు దైవజనులు రాజకీయాల వైపు రావడాన్ని ఎలా చూడాలి? కేఏ పాల్, రాజా వంటి వారు పార్టీలు పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి? (0:20:09) 🎭⚖️🛡️

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (08m 58s) 🎙️🛡️

  • ⚖️ శుభ పరిణామం: ఇప్పుడు విజయ్ తలపతి గారిది ఒక స్పెషల్ కేసు అది పక్కన పెడితే, మనం తెలుగు ప్రాంతంలో మీరు ప్రస్తావించిన క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ గాని, మన కేఏ పాల్ గారి పార్టీ గాని, నేను స్థాపించిన ఇండియా ప్రజా బంధు పార్టీ గాని ఇవంతా ఒక శుభ పరిణామం. బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించి ఉన్న దినాల్లో ఆయన ఓపెన్ గా క్రైస్తవులతో చెప్పిన మాట ఏంటంటే – “మీరు క్రైస్తవులు రాజకీయాలకు దూరంగా ఉండడాన్ని బట్టి మీ కమ్యూనిటీయే నష్టపోతుంది. మీరు రాజకీయాల్లోకి రావాలి మీరు యాక్టివ్ గా ఉండాలి. లేకపోతే మీ కమ్యూనిటీ ప్రయోజనాలు మీరు పరిరక్షించుకోలేరు.”
  • 🧱 దూరంగా ఉండటం వల్ల నష్టం: స్వాతంత్రం వచ్చిన కొత్తలో క్రైస్తవ సంఘాల్లో ప్రసంగాలు ఏంటంటే – “ఈ లోకం మనది కాదు, మన నివాసం పైన ఉంది, మనకు రాజకీయం అవసరం లేదు.” అని చెప్పేవాళ్ళు. కానీ వందఏళ్ల కిందట ప్రారంభమైనటువంటి ఆర్ఎస్ఎస్, ఈ సంఘ పరివారం క్రమక్రమేపి బలపడుతూ వచ్చి క్రైస్తవుల మీద హింసలు, చంపడము, చర్చీలు కూలగొట్టడం పెరిగింది. గ్రాహం స్టెయిన్స్ హత్య నుండి ఇది ఇంకా తీవ్రమైంది.
  • ⛈️ నేటి అవసరం: క్రైస్తవులను దేశానికి శత్రువులుగా, దేశద్రోహులుగా చిత్రించి విష ప్రచారం చేస్తున్నారు. ద్వేషాన్ని పుట్టించి రాజకీయ శక్తిగా మారి, క్రైస్తవులను హింసిస్తూ ఉంటే చట్టము నుండి కూడా రక్షణ రాకుండా ఇంత ప్రమాదకరమైన పరిస్థితి సృష్టించారు. అప్పటికి క్రైస్తవులలో కొద్దిమంది మేలుకొన్నారు.
  • 📢 పొలిటికల్ వాయిస్: దళితులకు గాని, బలహీన వర్గాలకు, మహిళలకు, మతపరమైన మైనారిటీలకు ఒక సంరక్షణ కావాలంటే మనకంటూ ఒక పొలిటికల్ వాయిస్ (Political Voice) ఉండాలని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి దారిలోకి ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న అకృత్యాలకు కౌంటర్ ఇవ్వడానికి ఒక రాజకీయ స్వరం అనేది అవసరం.
  • 🛡️ ప్రార్థన సరిపోదా?: “మనకు రాజకీయం ఎందుకండి మనం ప్రార్థన చేసుకుంటే చాలు” అంటే, నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఇంట్లోకి వచ్చి కొడుతున్నారు, చర్చిలో ప్రార్థన చేస్తే చర్చిలోకి వచ్చి కొడుతున్నారు. హార్మోనియం పట్టుకొని ఒక్క పాట పాడితే డిస్టర్బెన్స్ అంటున్నారు, మరి దీపావళి టపాకాయలు భయంకరంగా పేలిస్తే డిస్టర్బెన్స్ కాదా? అంత ద్వేషం అన్నమాట.
  • భవిష్యత్తు ఆశ: కేఏ పాల్ గారు యాక్టివ్ గా ఉన్నారు. ఎప్పటికైనా వారు ఒక ముఖ్యమంత్రిగా గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తే అందరికన్నా ముందు సంతోషపడేది నేనే. ఎందుకంటే కులమతాల ఈ ఉన్మాదము లేని మనిషి ఆయన. చూద్దాం భవిష్యత్తులో ఇవన్నీ కలిసి ఒక మహా రాజకీయ శక్తిగా మారి, కనీసం ఒక పదో పాతికో పార్లమెంట్ సీట్లలో గెలుచుకొనగలిగే స్థితిలో ఉంటే అప్పుడు దేశ రాజకీయాలు ఒక మలుపు తిరుగుతాయి.

Detailed English Translation:

❓ Question: How should we view celebrities and spiritual leaders entering politics? What is your take on parties like KA Paul’s and others? 🎭⚖️🤔

  • A Positive Step: Political parties led by Christians like KA Paul, actor Raja, or my ‘India Praja Bandhu Party’ are a positive trend. Dr. B.R. Ambedkar explicitly warned Christians that staying away from politics would harm the community’s interests.
  • Consequences of Indifference: Earlier, preachers taught that Christians should ignore this world as our home is in Heaven. This indifference allowed extremist forces to grow stronger and persecute Christians, burn churches, and spread malicious propaganda.
  • Necessity of a Voice: Today, Christians are falsely portrayed as anti-nationals. Even when cases are filed, legal protection is often missing. We need a political voice to defend the rights of Dalits, women, and minorities.
  • Is Prayer Enough?: People say, “Why politics? Just pray.” But people are being attacked inside their homes and churches while praying. When a sweet hymn is called a “disturbance” but loud crackers aren’t, it shows deep-seated hatred.
  • KA Paul: I would be happy if KA Paul became Chief Minister as he is free from religious and caste bias and can bring international funds. If all these parties unite and win even 20 seats, national politics will take a turn.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram