❓ ప్రశ్న: విశాఖపట్నం ఎయిర్ పొల్యూషన్ ర్యాలీలో యేసు ప్రభువు జన్మను గూర్చి చేసిన దూషణపై మీ స్పందన ఏమిటి? (0:30:25) 📢👺⚖️
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 55s) 🎙️🛡️
- 👺 మతోన్మాదం: అది ఉన్మాదము, ఉన్మాదం. మైండ్ పోయింది వాళ్ళకు. “వేశ్యకు పుట్టినవాడు” అని యేసును దూషించడం వాళ్ళ మనసులో కరుడుకట్టిన ద్వేషాన్ని వెళ్ళగక్కడమే తప్ప, అసలు దేవుడు అన్నవాడు ఆయన మానవాతీతంగానే పుడతాడు. మరియమ్మ ఏ పురుషుడు ముట్టుకోకుండానే గర్భవతి అయింది అని కదా!
- 🏛️ శ్రీరాముని జన్మ: మరి ఆ రకంగా ఇప్పుడు కౌశల్యమ్మ కూడా అట్టే గర్భవతి అయింది. దశరధుడు ఆమెను ముట్టుకొని ఆమెతో శారీరకంగా సంసారం చేసినందుకు శ్రీరాముల వారు పుట్టలేరు. ఆయన పుత్రకామేష్టి యాగం చేశారు. యజ్ఞ పురుషుడు ఒక పాయసం ఇస్తే ఇది తాగమంటే, అప్పుడు ముగ్గురు భార్యలకు నలుగురు కొడుకులు పుట్టారు. మరి వీళ్ళెవరు ఎవరు కూడా దశరధుని జీన్స్ (Genes) తో పుట్టినట్టు కాదుగా! కానీ ఆయన పేరు దాశరధి. దాశరధి అంటే దశరధుని తనయుడు అని.
- 🧱 వినాయకుని జన్మ: అసలు వినాయకుడు ఎట్లా పుట్టాడు? పుట్టినట్టు శివుడికే తెలియదు. పార్వతీ దేవి తాను స్నానానికి ముందు రుద్దుకున్న నలుగు పిండితో ఆ బొమ్మ చేసి ప్రాణం పోసింది. మరప్పుడు శివుడి జీన్స్ అతనికి లేవు కదా! కనుక ఇలాగ దేవతలు, దేవుళ్ళు అన్నవాళ్ళ జన్మలు అతీతంగానే ఉంటాయి కానీ ప్రకృతి సిద్ధంగా ఉండవు అనే విషయం హిందూ ధర్మంలోనే ఉన్నది.
- 🛡️ సంస్కార హీనం: కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా ఒక అవతార పురుషుడు జన్మను అట్లా అవమానించడు. దేవుడే అవతరించాలనుకున్నప్పుడు ప్రకృతి నియమాలను పాటించనవసరం లేదు అనే ఉదాత్తమైన కాన్సెప్ట్ హిందూ ధర్మంలోనే ఉన్నప్పుడు, యేసు జన్మను గూర్చి అట్లా అరవడం ఏంటది? చెత్తవాగుడు. అలాగైతే మీ దేవుళ్ళందరూ ఎలా పుట్టారని మనం కూడా అనాలన్నమాట.
- ⚖️ లీగల్ యాక్షన్: వాడు తప్పకుండా అతడి మీద లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు మనోళ్ళందరూ కూడా. యేసుప్రభువును దూషిస్తూ అతని మొహం మాత్రం రాకుండా వీడియో తీసి వైరల్ చేశాడు, కానీ మనోళ్ళు ఎదురు నుంచి తీసిన వీడియోలో మొహం వచ్చింది. ఆ ఆధారాలతో అతని మీద కేసు తప్పకుండా జరుగుతుంది.
Detailed English Translation:
❓ Question: What is your response to the derogatory comments made about Jesus’ birth in Visakhapatnam? 📢👺⚖️
- Fanaticism: Insulting Jesus’ birth as illegitimate is a sign of pure hatred. In any religion, a divine incarnation is supernatural.
- Hindu Examples: Kausalya didn’t conceive Rama through physical union with Dasaratha, but through a sacrificial offering (Payasam) from a Yagna. Similarly, Ganesha was created from clay/paste by Parvati; Shiva’s genes weren’t involved.
- Hypocrisy: Hindu scriptures themselves teach that divine births are beyond natural laws (like Lord Ayyappa). If so, why insult Jesus’ birth?
- Legal Action: We will take legal action. Although the culprit tried to hide his face in his video, he was caught in another. He will not escape.
