❓ ప్రశ్న: లూకా సువార్త 14:26 లో యేసుప్రభువు రక్తసంబంధులను విడిచిపెట్టమన్న మాటను కేవలం రక్షణ నిమిత్తమేనా? మరియ ఇతర సేవకుల కొరకు విడిచిపెట్టడం బ్రష్టత్వం అవుతుందా? దైవజనుని ద్వేషించి దేవుని ప్రేమించడం సాధ్యమేనా? (1:21:01) 🤝⚖️🫏
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (16m 50s) 🎙️🛡️
- ⚖️ యేసును హత్తుకొనుట: ఏం పర్లేదు, ఇప్పుడు అతను అన్న పాయింట్ కరెక్టే. నువ్వు యేసుప్రభువుని అంగీకరిస్తే నువ్వు నాకు వద్దు అని మన తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, భార్య చెప్పినా, పిల్లలు చెప్పినా, మన ప్రాణమే వచ్చి చెప్పినా – ఆ యేసు దేవుని నమ్ముకుంటే నేను వెళ్ళిపోతాను అంటే నువ్వు వెళ్ళిపో, నేను చచ్చిపోతా గానీ యేసయ్యనైతే వదులుకోను అని మనం అనాలి అనేది ఆ వచనాల భావం. నిజమే.
- 📜 దైవజనుల ప్రాముఖ్యత: అయితే ప్రతి తరములోనూ యేసును మనం కరెక్ట్ గా వెంబడించాలంటే ఆయన పంపినటువంటి దైవజనులు కూడా కొందరు ఉంటారు, వాళ్ళను వదిలేయడం ఈక్వల్ టు (Equal to) యేసుని వదిలేయడం. ఈ ప్రత్యక్షత వీళ్ళకు రావడం లేదు. ఇప్పుడు ఒక తరంలో మోషేను వదిలేసి యెహోవాను సేవించడం సాధ్యమా? సాధ్యం కాదు కదా! దావీదును ద్వేషించి యెహోవా దేవుని సేవ చేయడం సాధ్యమా? లేదు. ఏలియాను ద్వేషించి దేవునికి ప్రీతికరంగా సేవ చేయడం సాధ్యమా? కాదు కదా! అలాగే పౌలు మాకు అక్కర్లేదు కానీ యేసు కావాలనేది సాధ్యమా మరి? లేదు.
- 🧱 యేసుతో లింక్: గనుక నిష్కారణంగా యేసుప్రభువు పంపిన దైవజనులను ద్వేషించడం కూడా ఇవాళ యేసుకు దూరమే చేస్తుంది. కాబట్టి మనం యేసును హత్తుకొని ఉండడం ఎంత అవసరమో, పౌలును హత్తుకొని ఉండడం అంతే అవసరం. మోషేను, ఏలియాను హత్తుకొని ఉండడం అంతే అవసరం. నాకు మోషే వద్దు, ఏలియా వద్దు, పౌలు వద్దు, ఈ తరంలో దేవుడు పంపినటువంటి దైవజనుడు వద్దు అనుకుంటే వాడు ఆటోమేటిక్ గా బల్లితోకలాగా విడిపోతాడు. అది వాడు చాలా ఆలస్యంగా గుర్తిస్తాడు, అప్పటికే టైం దాటిపోతుంది.
- 🫏 యజమాని కుక్క: దేవుని సేవకుడు అనేవాడు దేవుడు పెంచుకున్న కుక్క అనుకో. విశ్వాస పాత్రుడు. ఒక పెద్ద మనిషి ఇంటికి పోయి వాళ్ళ కుక్కను కొడితే ఆయన ఊరుకుంటాడా? వాడు నన్ను గుబాన కొట్టి చంపుతాడు. అట్లా దేవుని సేవకుడు అనేవాడు దేవుడు పెంచుకున్న కుక్క అనుకో. అతని ద్వారా నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా దేవుడు తన వాక్యాన్ని ధారాళంగా పంపిస్తుంటే, ఆ ఎవరి ద్వారా దేవుడు ధారాళంగా వాక్య ప్రవాహాన్ని పంపిస్తున్నాడో వాడిని కొడుతున్నావ్ నువ్వు, వాడిని ద్వేషిస్తున్నావు, దూషిస్తున్నావు. మరి వాడుకుంటున్న యజమాని ఆయన గాయపడడా మరి? నేను మీ ఇంటికి వచ్చి మీ కుక్కను కొడితే మీరు గాయపడతారా లేదా? అట్లాగే దేవుడు గాయపడతాడు.
- 🛡️ దేవుడే కలుగజేసుకుంటాడు: ఇప్పుడు మోషే మీదికి అహరోను మిరియాములు వ్యతిరేక ప్రచారం చేసి తిరుగుబాటు చేశారు కదా? అప్పుడు మోషే వాళ్ళని ఏమ అనలేదు, దేవుడు వచ్చాడు. “అతను మీలాంటోడు కాదు కదా, అతని గురించి అలా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు?” అని దేవుడు మోషే పక్షంగా ఒక కక్ష తీసుకున్నాడు. అట్లా కుక్క కై కయ్యమని అరవకపోయినా, కరవకపోయినా పెంచుకున్న యజమాని అయితే వస్తాడు. నేను దేవుడు పెంచుకున్న కుక్కని అనుకో. ఇప్పటికి 45 ఏళ్లుగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ప్రతిరోజు కొత్త విషయాలు బయటికి వస్తానే ఉన్నాయి. మరి నన్ను ద్వేషిస్తే నన్ను పెంచుకున్న యజమాని గాయపడడా? తప్పకుండా ఇది 100% వాళ్ళు క్షమించరాని నేరం చేస్తున్నారు.
- 📉 భ్రష్టత్వం – అసలు అర్థం: కొందరు నన్ను బ్రష్టుడు అంటున్నారు. అసలు బ్రష్టుడు అనే మాట అర్థం ఏంటిది? ఇప్పుడు ముఖ్యమంత్రి పదవీ భ్రష్టుడు అయిపోయాడు అంటే ఆ తర్వాత అతన్ని ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం ఉండదు. అతని ఆజ్ఞలు అధికార యంత్రాంగం లోబడదు. అలాగే విశ్వాస భ్రష్టుడు అయితే ఆత్మలు రావు, బాప్తిస్మాలు ఇవ్వడు, కొత్త సంఘాలు కట్టడు, కొత్త సేవకులు రారు. రయ్యమని దూసుకెళ్ళిపోతున్న కారుని చూసి అది చెడిపోయింది అని చెప్పినట్టు ఉంది వీళ్ళ వాదన. నన్ను నిష్కారణంగా ద్వేషించి బయటికి వెళ్ళిపోయి బాగుపడ్డోడు ఇప్పుడు ప్రపంచ చరిత్రలో లేడు. వందల సంఘాలు కట్టినోడు 45 ఏళ్ల నుండి ఎవడైనా ఒక్కడిని చూపెట్టండి. ఇది నా ఛాలెంజ్. తిరుగుబాటు చేసి పోయి బాగుపడ్డోడు ఒక్కడు లేడు, అందరూ చచ్చిపోయారు, కొంతమంది అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు.
- 📖 దొంగిలించు ప్రవక్తలు: ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు నా బుక్స్ లో నుండి ప్రసంగాలు చేసుకుంటూ, ఓఫీర్ గారు మంచోడు కాదని ప్రచారం చేస్తుంటారు. ఇది దొంగతనం. ఇర్మియా 23:30 లో దేవుడు అంటున్నాడు – “తమ జతపని వాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని.” ఆ మాటలు వీళ్ళ దగ్గరికి దేవుడు పంపలే, దొంగిలించి ఇది నాది అని చెప్పుకుంటున్నారు. మత్తయి 12:33 ప్రకారం – “చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి.” రంజిత్ తోఫీర్ మంచోడు కాదు అన్న తర్వాత ఆయన చెప్పిన ప్రసంగాల మేటర్, మెటీరియల్ మీకు ఎట్లా పనికొచ్చినాయి? చెట్టు చెడ్డదని చెప్పుకుంటూ తిరుగుతున్నావు కదా, ఆ పండును కూడా వదిలేసేయ్. లేదు పండు మంచిదంటే మరి ఆయన మా గురువు అండి అని చెప్పుకునే సౌజన్యం ఉందా మరి? వీళ్ళు వేషధారులు, భయంకరమైన తీర్పు ఉంటది వీళ్ళ మీద.
- ✨ ముగింపు: దేవుని నమ్మితే రక్షణ కలుగుతుంది, ప్రవక్తను నమ్మితే రక్షణ కొనసాగుతుంది. ఫిలిప్పి 2:12 లో చెప్పినట్టు ఆ భయంతో వణకుతో మీ రక్షణ కొనసాగించుకోవడం కొరకు ప్రవక్తను నమ్మాలి. నిష్కారణంగా దైవజనుని ద్వేషించి దేవుని సేవించడం అనేది అసంభవం.
Detailed English Translation:
❓ Question: Is the command to forsake family (Luke 14:26) only for salvation? Is it apostasy to leave other servants of God? Can one hate the servant but love the Master? 🤝⚖️🤔
- The Primary Command: It is true that we must love Jesus more than our own life and family. If parents or children demand we leave Christ, we must choose Christ even if it means losing them. That is the essence of Luke 14:26.
- The Servant-Master Link: However, following Christ in any era requires honoring the messenger He sent. Rejecting the servant is equivalent to rejecting the Master. Could anyone follow God while rejecting Moses, Elijah, or Paul in their times? No. Despising the chosen messenger of your era distances you from God.
- The Analogy of the Master’s Dog: Think of a servant as a Master’s loyal dog. If you enter a man’s house and beat his dog, the owner will be deeply offended, even if you claim to respect him. When Aaron and Miriam spoke against Moses, God Himself defended him. Similarly, if someone attacks me—God’s servant for 45 years—the Master who uses me is grieved.
- Defining Apostasy: Critics call me an ‘apostate.’ But if I were one, souls wouldn’t be saved, and churches wouldn’t be built. It’s like looking at a speeding car and claiming it’s broken. Those who rebelled and left this ministry maliciously have never flourished; many have vanished or faced spiritual ruin.
- Spiritual Plagiarism: Many preachers steal the revelations from my books while simultaneously attacking my character. Jeremiah 23:30 warns against “prophets who steal My words from their neighbor.” Jesus said a tree is known by its fruit (Matt 12:33). You cannot claim the fruit (the message) is good while calling the tree (the messenger) bad. That is pure hypocrisy.
- Conclusion: Faith in God brings salvation; honoring the Prophet ensures that salvation continues. To claim to love the Master while hating His faithful messenger is impossible and invites divine judgment.
