❓ ప్రశ్న: సర్ థాంక్యూ సర్. అదేవిధంగా సార్ ఇప్పుడు అభిషేకము అంటే ఏమిటి? అభిషేకం పొందుకున్నాడు, అభిషేకము కలిగింది అంటారు కదా.. దాన్ని ఎలా గుర్తించాలి? అభిషేకం పొందిన వారు ఎలా ఉంటారు? లేదా ఎలా గుర్తించొచ్చు? అభిషేకం పొందని వారు ఎలా కనబడతారు? దీనిపై క్లారిటీ ఇవ్వగలరు. (0:48:07)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (4m 13s)
- 🕊️ యేసయ్య మాటల్లో సరళత: వెరీ సింపుల్ (Very simple) ఏదైనా యేసయ్య మాటలలోనికి మనం వెళ్ళిపోతే అన్ని సింపుల్ గానే ఉంటాయి. ప్రభువు మాటలు పక్కన పెట్టి మన సొంత తెలివితేటలతో ఆలోచిస్తే అంతా కన్ఫ్యూజన్ (Confusion). ఏసుప్రభు వారు చాలా డీపెస్ట్ స్పిరిచువల్ ట్రూత్ (Deepest spiritual truth) చాలా సింప్లెస్ట్ లాంగ్వేజ్ (Simplest language) లో చెప్పారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే – “పరిశుద్ధాత్మ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి పొందుదురు” అన్నారు.
- ⚡ అభిషేకం అంటే శక్తి: కనుక పరిశుద్ధాత్మ మీ మీదికి రాకముందు శక్తి పొందరు అని అర్థం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చుట.. అదే అభిషేకం. అభిషేకం అంటే సౌలు తలమీద సమూయేలు ప్రవక్త తైలం పోసినట్టు, దావీదు మీద తైలం పోసినట్టు.. తల మీద నూనె పోయబడినట్లు పరిశుద్ధాత్మ నూనెలాగా మన మీద పోయబడడం అభిషేకం.
- 🏠 లోపలికి రావడం vs మీదికి రావడం: పరిశుద్ధాత్మ మన లోపలికి రావడం కాదు.. ఆయన మన లోపలికి వచ్చి మనల్ని ఒప్పిస్తాడు, మారుమనసు కలిగిస్తాడు, రక్షణ అనుభవం కలిగిస్తాడు. మన లోపలికి వచ్చినప్పుడు మనం నూతనంగా జన్మిస్తాం, మనోనేత్రాలు తెరవబడతాయి. కానీ పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు ‘శక్తి’ అడిషనల్ (Additional) గా వస్తుంది.
- 💪 నిరూపణ – అదనపు బలం: బ్రతికున్న వాళ్ళందరూ బలవంతులు కాదుగా! బలము లేనోళ్ళందరూ శవాలు కాదుగా.. కొంతమంది బ్రతికే ఉంటారు కానీ ఏ పని చేయలేరు, నీరసంగా ఉంటారు. కానీ కొంతమంది ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతారు. అలాగా ఆత్మీయ జీవితంలో కూడా శక్తి దేనికి అవసరం అంటే – దేవుని చిత్తము నెరవేర్చడానికి శక్తి కావాలి. గనుక పరిశుద్ధాత్మ పొందినట్లుగా అతనికి గాని, గమనిస్తున్న పరిసరాల్లోని వ్యక్తులకు గాని నిరూపణ ఏంటంటే – దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అతనికి అడిషనల్ గా శక్తి వచ్చి ఉంటుంది. అంతకుముందు చేయలేనివి అతడు చేయగలుగుతాడు. అది వరములు అనే కాదు.. వరములు అయ్యి ఉండొచ్చు లేక వరము లాగా కనబడకపోవచ్చు. ప్రార్థన చేయడానికి శక్తి, సువార్త ప్రకటించడానికి శక్తి ఉంటుంది.
- 🛡️ పిరికితనం vs అభిషేకం: ఇప్పుడు కొంతమంది పెంతుకోస్తు వారు అన్యభాషలు వస్తేనే పరిశుద్ధాత్మ వచ్చినట్టు అనే సిద్ధాంతం ఉంది. మరి పరిశుద్ధాత్మ పొంది చర్చి లోపల మాత్రమే అన్య భాషలు మాట్లాడి, బహిరంగంగా సువార్త చెప్పాలంటే భయపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను బ్రదర్ ఇమ్రాన్ తో భేటీ చేసినప్పుడు – “వద్దు అక్కడికి వెళ్ళకండి వాళ్ళు ఏమైనా చేస్తారు చంపుతారు” అని చెప్పి నన్ను బెదిరించిన పెంతుకోస్తు వాళ్ళు ఉన్నారు. అందరూ అన్య భాషలు మాట్లాడే వాళ్ళే గానీ పిరికోళ్ళు! మళ్ళీ అన్యభాషలు మాట్లాడించి పిరికోళ్ళుగా చేయడానికి పరిశుద్ధాత్మ రాడు.
- ✨ ముగింపు: పరిశుద్ధాత్మ నా మీదకు వచ్చాడు గనుక నాకు ధైర్యం ఉంది, శక్తి ఉంది. గనుక భాషలు ఉన్నా లేకపోయినా, ప్రవచనం ఉన్నా లేకపోయినా అది సెకండరీ.. సువార్త ప్రకటించే ధైర్యము, శక్తి, దేవుని కొరకు నేను జీవించాలనే పట్టుదల, జీవించగలిగే బలం ఎవరిలో ఉంటుందో వాడు అభిశక్తుడై ఉంటాడు. ఈ బలము, శక్తి, పట్టుదల లేకుండా అన్య భాషలు మాట్లాడే పిరుకోళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని అభిశక్తులు అని చెప్పడానికి వీలు లేదు. రైట్.
Detailed English Translation:
❓ Question: What is the true meaning of ‘Anointing’ (Abhishekam)? How can we distinguish between someone who is truly anointed and someone who is not? Is it just about spiritual gifts, or is there more to it?
- Simplicity of Christ: Spiritual concepts are simple when defined by Jesus. He said, “You shall receive power when the Holy Spirit has come upon you” (Acts 1:8). Therefore, the anointing is the reception of divine power through the Holy Spirit.
- Symbolism and Reality: Just as Samuel poured physical oil over Saul and David, the anointing is the Holy Spirit being poured ‘upon’ a person as spiritual oil. There is a difference between the Spirit dwelling ‘within’ (which brings salvation and new birth) and the Spirit coming ‘upon’ (which brings additional power).
- The Evidence of Power: A person can be alive but physically weak. Similarly, a believer can be saved but spiritually ineffective. The anointing provides the ‘additional strength’ needed to fulfill God’s will. The evidence for the individual and those around them is the newfound ability to perform tasks for God that were previously impossible.
- Boldness vs. Religious Tradition: Some believe that speaking in tongues is the sole proof of the anointing. However, if a person speaks in tongues in church but is too terrified to preach the Gospel in public, they are not operating in the true anointing. The Holy Spirit doesn’t empower people to be cowards.
- Conclusion: True anointing is identified by boldness, divine energy, and a persistent determination to live for God and preach the Truth. Spiritual gifts are secondary; the primary evidence of being anointed is the courage to face any opposition for the sake of the Gospel. Those who lack this boldness but display religious gifts are not truly anointed in the biblical sense.
