57.Q: Salvation Through Blood and Truth (KSM 04) 🛡️

❓ ప్రశ్న: అయ్యా ప్రైస్ ది లార్డ్, రెండో తెసలోనిక 2:13 లో ప్రభువు వలన ప్రేమింపబడి.. మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని నియమించెను అని ఉంది. అంటే సత్యమును నమ్మాలి, యేసు క్రీస్తు రక్తాన్ని నమ్మాలి.. అప్పుడే రక్షణ అని ఇక్కడ స్పష్టంగా ఉంది. అయితే కేవలం యేసు రక్తాన్ని ఆశ్రయించినందుకు పరలోకం రక్షణ ఉంటుంది అని కొందరు అంటున్నారు కదా! మరి పూర్తి సత్యాన్ని నమ్మని వారి పరిస్థితి ఏంటి? ఈ రెండు వచనాలను ఎలా అర్ధం చేసుకోవాలి? (0:52:32)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (5m 28s)

  • 🛡️ రక్షణలో సూక్ష్మమైన విషయం: మంచి ప్రశ్న ఆదిత్య గారు. రెండో తెసలోనిక 2:13 లో ప్రభువు వలన ప్రేమింపబడి.. మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని నియమించెను అని ఉంది. కేవలము యేసు రక్తం మీద ఆధారపడటమే కాదు, సత్యమును కూడా నమ్మాలి అలా నమ్మితేనే రక్షణ అనేది ఇక్కడ లేఖనం చెప్తుంది. ఇక్కడ ఒక చాలా సూక్ష్మమైన విషయాన్ని మీరు అందరూ చూడాల్సిన అవసరం ఉన్నది ఏంటంటే – రక్షణ పొందిన తర్వాత కూడా కొన్ని ప్రమాదాలు ఉన్నాయి.
  • ⚠️ పోగొట్టుకునే ప్రమాదాలు: రక్షణ పొందిన తరువాత కూడా కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. అదేంటంటే – బహుమానం పోగొట్టుకునే ప్రమాదం, నిత్యమైనటువంటి పదవి హోదా కిరీటము పోగొట్టుకునే ఆ యొక్క ప్రమాదం, కోట్లాది పరిశుద్ధుల ముందు గద్దింపు పొందే ప్రమాదం ఉంది. వీటన్నిటి నుండి మనకు రక్షణ కావాలి. ప్రప్రథమమైన విషయం ఏంటంటే నరకం అనేది ఒక ప్రమాదం ఉన్నది, దాంట్లో నుంచి యేసుప్రభువు రక్షిస్తాడు.
  • ⚖️ జాగ్రత్త మరియు భయం: అయితే నరకం అనేది ఒక్కటే ప్రమాదం కాదు. ఇప్పుడు నరకం అనేది తప్పించుకున్న తర్వాత కూడా “భయముతోను వణుగుతోను మీ సొంత రక్షణ కొనసాగించుకోమన్నాడు.” తర్వాత క్రీస్తునందు యోగ్యమైన పనివానిగా నిన్ను నీవే కనపరుచుకుంటా జాగ్రత్త పడుమ అన్నాడు. జాగ్రత్త అంటే ఎప్పుడు అవసరం? ప్రమాదం ఉన్నప్పుడు జాగ్రత్త అవసరం. అక్కడ ఈ క్రీస్తు నందు మనం యోగ్యమైన పనివారిగా కనబడకపోతే మనం సిగ్గుపడతాం. “సిగ్గు పడనక్కరలేని పని వానిగా నిన్ను నీవే కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము” అని రెండో తిమోతి 2:15 లో ఉంది.
  • 🔥 అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు: ఇంకొక ప్రమాదం ఉన్నది.. మొదటి కోరింతి 3:15 లో – “ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును, అతడు తన మటుకు తాను రక్షింపబడును గానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును” అని అంటాడు. క్రీస్తు న్యాయపీఠం ముందుకు పోయినప్పుడు మన బోధ, మన సేవా జీవితము కరెక్ట్ గా లేకపోతే అక్కడ చాలా నష్టపోతాం. అగ్ని గుండానికి ఏం వెళ్ళాము గానీ అక్కడ కూడా ప్రమాదం ఉంది.
  • 🧱 తీర్పు దేవుని ఇంటనే: మొదటి పేతురు 4:17-18 కూడా లెక్కలోకి తీసుకోవాలి. అక్కడ “తీర్పు దేవుని ఇంట ప్రారంభమయ్యే కాలము దగ్గరికి వచ్చింది, అది మన వద్దనే ప్రారంభమైతే.. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తి హీనుడు పాపి ఎక్కడ నిలుస్తారు?” అన్నాడు. గనుక రక్షణ పొంది “నేను నరకానికి వెళ్ళను” అనే నిర్ధారణ పొందినంత మాత్రాన టోటల్ గా నిశ్చింతగా ఉండొచ్చు అనేది లేదు. నేను నరకంలో పడను అని నాకు తెలుసు గానీ, నాకు ఇంకా నా భయం నాకు ఉన్నది. నన్ను ఆయన నా రహస్య జీవితాన్ని గద్దిస్తాడేమో, నా సిద్ధాంతాన్ని పరీక్షించి గద్దిస్తాడేమో, నాకు ఇయ్యాల్సిన జీవ కిరీటం పక్కన పెడతాడేమో అని నా భయం నాకున్నది.
  • ముగింపు: అందుచేత రక్షణ అంటే నరకము నుండి రక్షణ మరియు ఈ నష్టముల అన్నిటి నుండి కూడా రక్షణ. కనుక యేసు రక్తమును ఆశ్రయిస్తే నరకము నుండి రక్షణ కలుగుతుంది, సత్యమును మనం ఆచరిస్తే ఈ మిగతా అవమానాల నుంచి రక్షణ కలుగుతుంది. అది అసలైన సంపూర్ణ సత్యం. ఓకే నాయనా.

Detailed English Translation:

❓ Question: 2 Thessalonians 2:13 says we are chosen for salvation through belief in the Truth. If the Blood of Jesus is sufficient for salvation, why is belief in the Truth also mentioned as a requirement? How do these two concepts work together for a believer?

  • Post-Salvation Dangers: While the Blood of Jesus secures our escape from Hell, the ‘Truth’ secures our standing in the Kingdom. Even after being saved from eternal damnation, a believer faces other spiritual dangers. These include the danger of losing eternal rewards, losing one’s crown, being stripped of a promised position of authority, and facing public rebuke before the assembly of saints.
  • The Necessity of Spiritual Diligence: Scripture commands us to work out our salvation with “fear and trembling.” If there were no danger after being saved from hell, ‘caution’ wouldn’t be necessary. As 2 Timothy 2:15 warns, we must strive to be workers who have no cause for shame. Believing and practicing the Truth is what prevents this eternal shame.
  • Saved ‘As Through Fire’: 1 Corinthians 3:15 describes a scenario where a believer’s works are burned up because they weren’t built on the Truth. Such a person is saved—meaning they don’t go to hell—but they suffer immense ‘eternal loss,’ escaping only as one fleeing through flames with nothing to show for their life.
  • Judgment Begins at the House of God: According to 1 Peter 4:17-18, if it is difficult for the righteous to be fully saved (meaning achieving the fullness of their inheritance), what will be the fate of the disobedient? Salvation from hell is by the Blood, but the ‘fullness of salvation’ and rewards depend on our adherence to the Truth.
  • Conclusion: Therefore, there are two aspects: The Blood of Jesus saves us from the punishment of Hell. The Truth of God saves us from the loss of rewards and eternal embarrassment. Together, they constitute the ‘Full Gospel’ and ‘Complete Salvation.’ Reliance on the Blood gets you into Heaven; reliance on the Truth determines your glory within it.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram