❓ ప్రశ్న: విశాఖపట్నం నుండి ఫిలిప్ గారు అడిగారు – 30 సంవత్సరాలుగా మేము ఒక సేవకుని దగ్గరికి వెళ్తున్నామండి. ఆ 30 సంవత్సరాల క్రితం ఆ సేవకుడు రక్షింపబడి సేవ చేస్తున్నాడు. అయితే 30 సంవత్సరాల క్రితం తాను ఏ పాపములోనైతే ఉన్నాడో, ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత కూడా అదే పాపములో జీవిస్తున్నాడు. అక్కడికి వెళ్తున్నటువంటి విశ్వాసులు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఆ సేవకుడిని ఏ విధంగా యాక్సెప్ట్ (Accept) చేయాలి అని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు ఈ సోదరుడు. దీనికి మీరు ఏం చెప్తారు సార్? (0:18:25)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (3m 08s)
- ⚖️ మనస్సాక్షి అనే న్యాయాధిపతి: నేను అల్టిమేట్ (Ultimate) గా ఇలాంటి సందర్భముల అన్నిటి కొరకు నేను చెప్పగలిగిన సలహా, గైడెన్స్ (Guidance), మార్గదర్శక సలహా ఒకటే. ఏంటంటే – ప్రతి విశ్వాసి కూడా విశ్వ న్యాయాధిపతి అయిన దేవునికి లెక్క చెప్పాల్సిన అవసరం ఒక దినాన రాబోతుంది. ఆ తీర్పు దినాన్ని చేరక ముందు, ఆ దేవుని యొక్క ప్రాతినిధ్యంగా ఆ దేవుని ప్రతినిధిగా మనలోనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు – మన మనస్సాక్షి అనే న్యాయాధిపతి. గనుక ప్రతి విశ్వాసి తన మనస్సాక్షి తన మీద నేరారోపణ చేసుకోకుండా కూడా చూసుకోవాలి.
- 🚫 క్షేమాభివృద్ధి ఉండదు: ఇప్పుడు ఫలానా పాస్టర్ గారు సరైన విధంగా జీవించడం లేదు, ఒక పాపములో కొనసాగుతున్నారు అనేది వీళ్ళకి తెలిసిన తర్వాత.. ఆయన ముందు పోయి కూర్చుంటే వీళ్ళకు క్షేమాభివృద్ధి ఉండదు. ఆయన దగ్గర ఉన్న మిగతా సేవకుడు మిగతా విశ్వాసుడు గాని ఆయన సహదాసుడు గాని వాళ్ళు బాగానే ఉన్నారు. ఈయన ఒక్కడే ఆ పాపంలో కొనసాగుతున్నారు.
- ⚠️ జారత్వం అనే పాపం: నేను అనుకుంటాను.. అది సిగరెట్ లాంటిది ఏదైనా అయి ఉంటదేమో? అది ఏం పాపమో వాళ్ళు చెప్పలేదు. జారత్వం.. జారత్వమేనా? ఓ.. అయితే మరి జారత్వం ఆయన చేస్తూ ఉంటే, 30 ఏళ్ళ కింద నుంచి ఎప్పటి దాకా కొనసాగుతుంటే.. మరి ఆయన దగ్గర ఉన్నోళ్ళు మంచిగా ఎలా ఉన్నారో నాకు అర్థం కాలేదు.
- 🧐 అభ్యంతరం లేని స్థితి: ఒకవేళ నేను అనుకుంటాను.. వీళ్ళకి ఆ జాగ్రత్త సంగతి తెలియకపోయి ఉండాలి, లేకపోతే అసలు వాళ్ళు అది అభ్యంతరం ఏమి కాదు అన్న టీచింగ్ (Teaching) లో కొద్ది మంది ఉన్నారు. లేకపోతే అది జారత్వము కాదేమో అని, అసలు వాస్తవానికి దాంట్లో కూడా ఒక న్యాయం ఉన్నది అని వాళ్ళు ఏదో రకంగా మనస్సాక్షిని సాటిస్ఫై (Satisfy) చేసుకొని ఉంటారు. కనుక అక్కడ ఆ పర్టిక్యులర్స్ (Particulars) అన్నీ తెలిస్తే తప్ప మనం కరెక్ట్ జడ్జిమెంట్ (Correct judgment) ఇవ్వలేము.
- ✨ ముగింపు: అయితే ఆయన దగ్గర ఉండి బాగున్న వాళ్ళ సంగతి వదిలేద్దాం. ఇప్పుడు మనల్ని ఈ ప్రశ్న అడిగినటువంటి సహోదరుడికైతే ఇదంతా అభ్యంతరకరంగా ఉంది గనుక.. అక్కడ కూర్చుంటే క్షేమాభివృద్ధి ఉండదు. గనుక అర్జెంటుగా మీరు ఆ సహవాసాన్ని వదిలేసి, ఇలాంటి ఖండన లేనటువంటి, ఇలాంటి కండమినేషన్ (Condemnation) అనేది లేనటువంటి, ఒక ఈ క్వశ్చన్డ్ క్యారెక్టర్ (Questioned character) అనేది లేనటువంటి వేరే సంఘానికి, కాపరి దగ్గరికి అర్జెంట్ గా వెళ్ళిపోవాలి.
Detailed English Translation:
❓ Question: Philip from Visakhapatnam asks: We have been attending a church for 30 years. The pastor started his ministry 30 years ago, but he continues to live in the same sin he was in back then. While other believers seem fine, how should we accept such a pastor?
- The Judge Within: My ultimate guidance for such situations is this: every believer must eventually give an account to God, the Supreme Judge. However, even before that Day of Judgment, God has placed a representative within us—our conscience. Every believer must ensure that their conscience does not condemn them.
- No Spiritual Growth: If you are aware that a pastor is not living a righteous life and is persisting in sin, sitting under his ministry will not bring you spiritual growth or edification. It is problematic to remain in a place where the leadership’s integrity is compromised.
- The Gravity of Persistent Sin: If the sin involved is immorality (adultery/fornication) and it has persisted for 30 years, it is baffling how the congregation claims to be “fine.” Either they are unaware of the situation, or they have been conditioned to accept such behavior as non-objectionable.
- The Need for Separation: We cannot judge the hearts of those who choose to stay, as they may have rationalized the situation to satisfy their consciences. However, for the person asking this question, the situation is clearly a stumbling block.
- Conclusion: Since your conscience is troubled and you see no spiritual progress there, you should immediately leave that fellowship. Seek out a church and a shepherd where there is no such condemnation or questionable character. Your spiritual well-being depends on being in a holy environment.
