71.Q: Mary’s Pregnancy and Joseph’s Consent (KSM 05) 🤰

❓ ప్రశ్న: కన్య మరియ గర్భం ధరించే ముందు తన భర్త యోసేపు అనుమతి ఎందుకు తీసుకోలేదు? ప్రభాకర్ మన్నం గారు అడుగుతున్నారు – కన్య మరియకు గాబ్రియేలు దూత ప్రత్యక్షమై నీవు ఒక కుమారుని కనెదవు అని చెప్పగా మరియ దేవుని మాటకు తలొగ్గింది. అయితే ఆమె అప్పటికే యోసేపుకు ప్రధానము చేయబడింది కదా! అంటే దాదాపుగా పెండ్లి అయినట్టే కదా.. అలాంటప్పుడు ఈ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు యోసేపును ఎందుకు పరిగణలోనికి తీసుకోలేదు? (0:39:01)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 38s)

  • 🤰 ప్రధానము మరియు దూరం: ఆమె యోసేపు దగ్గర లేదు అప్పుడు. ప్రధానం చేయబడింది, ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు అని ఉంది. అంటే ఇంకా వాళ్ళు కాపురం మొదలెట్టలేదు. ఆమెను యోసేపు దగ్గరికి ఇంకా పంపలేదు. ఆ ఊరు, ఈ ఊరు చాలా దూరం.
  • 📱 సమాచార వ్యవస్థ: మరి వెంటనే ఇట్లా దేవదూత గారు రాగానే “కొంచెం ఆగండి సార్” అని చెప్పి ఫోన్ చేయడానికి మొబైల్ కూడా లేదు అప్పుడు. కనీసం ట్రంక్ కాల్ బుక్ చేయడానికి కూడా లేదు. దేవదూత వచ్చినప్పుడు ఆయనకు అవునో కాదో అప్పుడే సమాధానం చెప్పాలి కానీ, “మా ఆయన్ని అడిగి వస్తాను” అనేది వీలు లేదు.
  • ⚖️ దైవ చిత్తమే సర్వోన్నతం: అండ్ మోర్ ఓవర్ (And moreover) అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే – సర్వశక్తి గల దేవుడే తన దూతను పంపి ఒక కార్యాన్ని కోరుకున్నప్పుడు, ఒకవేళ భర్త వద్దన్నా సరే ఆమె లోబడుతుంది.. అక్కడ ఆమె భక్తురాలు. ఇప్పుడు ఏ స్త్రీ అయినా భర్తకు అవిధేయత చూపడానికి అవకాశం ఉన్న ఏకైక అవకాశం ఏంటంటే – ఇది దేవుని మాట అని చేస్తే, దేవుడు ఆమెను నిర్దోషిగా ఎంచుతాడు.
  • 🛡️ ఆదర్శ ప్రాయం: ఇది దేవుని మాట.. గనుక “నా భర్త వద్దన్నాడు, అయితే నా భర్త మాట కంటే దేవుని మాటే నాకు ముఖ్యం” అని అనుకునే అవకాశం ప్రతి స్త్రీకి ఉన్నది. మరియమ్మ ఆ విషయంలో ఆదర్శప్రాయురాలు. ఇప్పుడు దేవుడు విగ్రహారాధన వద్దన్నాడని బైబిల్ లో ఉంది, ఒక పెళ్ళైన స్త్రీ భర్త ఆమెను విగ్రహారాధన చేయమని బలవంతం పెడితే – “లేదండి నా విశ్వాసం అది కాదు, దేవుని ముందు నేను దోషిగా నిలబడతాను. దయచేసి సంసార ధర్మము, కుటుంబ బాధ్యతలు అన్నీ ఓకే నేను నీకు పూర్తిగా లోబడతాను.. దైవారాధన విషయంలో మాత్రం దయచేసి మీరు జోక్యం చేసుకోకండి” అని చెప్పే అవకాశం ఉన్నది.
  • ముగింపు: అదేంటి మొగుడు మాట కంటే దేవుడు ముఖ్యం అంటే – దేవుడే ముఖ్యం! దేవుడు విశ్వానికంతటికీ మొగుడు, విశ్వానికంతటికీ భర్త ఆయన. గనుక స్త్రీకి అందరికంటే భర్త ముఖ్యం, కానీ భర్త కూడా కాదన్నా సరే ఒక్కోసారి ఒక మార్గంలో ఆమె నడిచిందంటే.. అది దేవుడు చెప్పిన ప్రకారం నడిస్తే ఆమె నిర్దోషం అవుతుంది. ఓకే.

Detailed English Translation:

❓ Question: Why didn’t Mary seek Joseph’s consent before agreeing to the divine pregnancy? Since they were already betrothed, which was as binding as marriage, shouldn’t Joseph have been consulted in such a major decision?

  • The Physical Circumstances: At the time of the Annunciation, Mary and Joseph were betrothed but had not yet begun living together. They were in different locations, and in that era, there were no means of instant communication like mobile phones to consult him immediately. When a divine messenger appears, a response is required on the spot.
  • The Supremacy of God’s Will: Mary was a woman of great faith. When the Almighty God reveals His will through an angel, that command supersedes all earthly authorities, including a husband’s. If God initiates a plan, a believer’s primary responsibility is to obey Him.
  • The Exception to Submission: While the Bible teaches a wife’s submission to her husband, there is one critical exception: when a husband’s demand contradicts God’s command. If a husband forces a wife into something unscriptural, like idol worship, she has the spiritual right to choose God’s way over her husband’s.
  • Mary as a Role Model: Mary serves as an example of prioritizing divine calling over social or marital expectations. She chose to be the ‘handmaid of the Lord’ first.
  • Conclusion: God is the ultimate authority over all creation. While a husband’s role is significant, God’s word is paramount. If a woman follows God’s specific instruction even against her husband’s wish, she remains guiltless in the eyes of the Creator. Mary’s immediate “yes” to God was an act of supreme faith that Joseph eventually accepted through divine intervention.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram