80.Q: Response to ‘Sakshi Christian Voice’ and Hindu Scriptures (KSM 06) 📖

❓ ప్రశ్న: సార్, ఈ మధ్య మరి ఈ ‘సాక్షి క్రిస్టియన్ వాయిస్’ అనబడినటువంటి వాళ్ళు హైందవ క్రైస్తవం అనేటువంటి మీ చేత మరి దేవుడు రచింపజేసిన అటువంటి గ్రంధాన్ని ఆ మరి ఈ మధ్య ఆ పేజీలు పేజీలుగా అందులో ఉన్నటువంటి అంశాలను YouTube లో పెట్టడం జరుగుతా ఉంది. అందులో ఉన్నటువంటి అబద్దాలు అని చెప్పేసి హైందవ గ్రంథాలలో చాలా అశ్లీలం ఉన్నది ఆ అశ్లీలం రంజిత్ తోఫిర్ గారికి కనపడలేదా ఆ అశ్లీలం ఉన్నటువంటి దేవతలు కూడా ఆ పాపము చేసేటటువంటి సంఘటనలను వదిలిపెట్టి ఆ గ్రంధాల లోపలి నుంచి క్రీస్తును చూపెడుతాను క్రీస్తు పోలికలు ఉన్నాయి అంటూ వాటిని మాట్లాడుతున్నాడు ఇది ఎంత వరకు సబబు? అసలు రంజిత్ తోఫిర్ గారు క్రైస్తవులే కాదు అనే మాటలు ఇవన్నీ కూడా అనుకుంటున్నారు సార్. దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి? (0:06:39)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (4m 05s)

  • 🎯 క్రీస్తును చూపించడమే లక్ష్యం: ఇప్పుడు వేదములలో ఉన్న సకల విషయములను ఎత్తి చెబుతాను అంటూ నేను ఆ గ్రంథం రాయలేదు. అసలు హైందవ క్రైస్తవం గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం క్రీస్తును చూపించడం. ఎవరికీ క్రీస్తును చూపించడం? బైబిల్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు, బైబిల్ మీద నమ్మకం లేదు, గౌరవం కూడా లేదు.. బైబిల్ లో ఇలా రాయబడింది అంటేనే నిప్పులు చెరిగేటటువంటి ద్వేషం నింపుకున్నటువంటి సోదరులకు యేసు ఇదిగోనని చూపిస్తే, వాళ్ళ కనుదృష్టి ఒక్క నిమిషమైనా యేసు మీదకు వస్తే.. తతిమ కార్యం ఆకర్షించే కార్యం పరిశుద్ధాత్మ దేవుడు జరిగించుకుంటాడు, వాళ్ళు రక్షించబడతారు అనే ఆశతో ఆ గ్రంథం రాయడం జరిగింది.
  • 🔍 పరిమిత విషయ సేకరణ: ఇప్పుడు క్రీస్తును చూపటానికి గ్రంథం రాశాను తప్ప వేదముల్లోని సకల విషయాలన్నీ ఎత్తి చెప్పే గ్రంథం అది కానే కాదు. వేదములలో ఎన్నో ఉండొచ్చు.. అందులో వైజ్ఞానిక విషయాలు ఉన్నవి, కొంత అశ్లీలత అక్కడక్కడ ఉన్నది, ఆ తర్వాత కొంత అభిచారము మంత్ర విద్యలను గూర్చి ఉన్నది.. అవన్నీ నాకు అవసరం లేదు. పర్సనల్లీ నేను యేసుక్రీస్తుకు సాక్షిని.
  • 🌍 ఒక్కొక్కరికి ఒక్కో మార్గం: యేసును చూపించడానికి నేను పోనుకున్నప్పుడు, ఇప్పుడు వేదం అంటే ఒకడికి నమ్మకం లేదు సైన్స్ అంటే నమ్మకం.. వాడికి సైన్స్ ద్వారా యేసుని చూపిస్తాను. ఇంకొకడికి వేదం అన్నా సైన్స్ అన్నా ఇష్టం లేదు ఖురాన్ మీద నమ్మకం.. ఖురాన్ ద్వారా యేసుని చూపిస్తాను. ఇంకోరికి వేదం అంటే నమ్మకం.. అప్పుడు వేదము ద్వారా యేసుని చూపిస్తాను. ఇవేవి తెలియదు వీళ్ళకి కొంతమందికి.. అప్పుడు బైబిలే నాకు ప్రామాణికం అనుకున్నవాడు నామకార్థంగా ఉన్నాడు రక్షణ పొందకుండా, వాడికి బైబిల్ వాక్యాలు ఎత్తి చెబుతాం.
  • తాపత్రయం మరియు విచక్షణ: నేను ఎలా చెబుతాను? నాకు ఉన్నటువంటి ప్రయాస, ప్రయత్నము, నా తాపత్రయం అంతా ఏంటంటే ఒక మనిషి దృష్టి యేసు మీదకి రప్పించాలి. అందుకు అవసరమైనది ఏదైనా నేను తీసుకుంటాను అంతే గానీ అక్కడ వేరే విషయాలు నాకు సంబంధం లేదు. ఇప్పుడు అశ్లీలత ఉన్నది అన్నాడు.. దాన్నెత్తిన చెప్పినందువల్ల, చూపించినందువలన ఎవరు క్రీస్తును చూడరు కదా! క్రీస్తును చూపించాలి. క్రీస్తును చూపించడానికి అవసరమైతే, పనికొస్తే అప్పుడు అవి కూడా చూపిస్తాను. వాళ్ళని అవమానించాలి, వాళ్ళని ఏదో బాధ పెట్టాలి, వాళ్ళని కించపరచాలి అనుకున్నోళ్ళకి అవన్నీ కావాలి. నాకు కావలసింది హిందువులను కించపరచడం కాదు, వేదమును గౌరవించే వాళ్ళు, వేద భక్తులు, వేదాభిమానులకు యేసును చూపించాలి. అందుకు కొరకే నేను అది చేశాను.
  • 🛡️ ముగింపు: ఒక వేదమే కాదు అప్పుడప్పుడు ఖురాన్ ఎత్తి చెప్పాను, సైన్స్ లో నుండి తీసుకున్నాను.. ఏ శాస్త్రం ఎత్తుకున్నా నేను క్రీస్తుకు సాక్షిని గాని వేదములకు కాదు. క్రీస్తుకు సాక్షిని.. క్రీస్తు అనే ఒక చారిత్రిక పురుషుడు ఉన్నాడు (A Historic person called Jesus of Nazareth, Son of Mary, Son of God).. ఆయనకు నేను సాక్షిని. ఆయన చూపడానికి నేను ఏది అవసరమైతే, ఏది పనికొస్తే అది వాడుకుంటాను.. ఇది ఎన్నో సార్లు చెప్పాను. ఓకే.

Detailed English Translation:

❓ Question: ‘Sakshi Christian Voice’ is criticizing your book ‘Haindava Kraistavam’, pointing out obscenities in the Vedas and questioning why you use those texts to show Christ. They even claim you aren’t a Christian for doing so. What is your response to this?

  • Mission to Present Christ: I didn’t write this book to catalogue everything in the Vedas. The primary goal of ‘Haindava Kraistavam’ is to present Christ to those who harbor deep hatred or disregard for the Bible. By using texts they respect, I aim to pivot their attention toward Jesus. If they look at Him for even a moment, the Holy Spirit can initiate the work of salvation.
  • Selective Research: I am a witness for Jesus Christ, not for the Vedas. While the Vedas may contain scientific facts alongside obscenities or occultism, those things do not concern me. My mission is focused. If someone trusts Science, I use science; if they trust the Quran, I use the Quran; if they trust the Vedas, I use the Vedas to lead them to Christ.
  • Strategies for Different People: For a nominal Christian, I use the Bible. For others, I use whatever foundation they have to build a bridge to Christ. My only ‘obsession’ or effort is to bring a person’s focus to the Savior.
  • Inviting, Not Insulting: Those who wish to mock or demean Hindus search for obscenities to highlight. My intention is not to insult or belittle Vedic devotees but to show them Jesus within their own cultural context.
  • Conclusion: Whether through science, other religious texts, or secular knowledge, I remain a witness for the historical person, Jesus of Nazareth, the Son of God. I will use any effective tool to fulfill my commission of testifying about Him.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram