82.Q: The Revelation of ‘Haindava Kraistavam’ (KSM 06) ✨

❓ ప్రశ్న: సార్, ఇప్పుడు హైందవ క్రైస్తవం యొక్క గ్రంథము మీరు ముగిస్తూ వెనకాల అట్ట మీద.. “ఇది నాకు నేరుగా సత్యలోకము నుండే ఈ యొక్క ప్రత్యక్షత కలిగింది” అనే మాటను మీరు అందులో రాశారు. మరి అందులోనే ఇంకొక మాట కూడా వాడారు ఏంటంటే – “నాకంటే ముందు ఇంకా కొంతమంది భక్తులు కూడా రాశారు” అని. వేదాలలో క్రీస్తు అనే యజ్ఞము అనే పత్రిక ఇలాంటి కొన్ని విషయాలను తీసుకొని మీరు నాకంటే ముందు కొందరు చెప్పారు అన్నారు.. మరి ఆల్రెడీ వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ మీకు సత్యలోకం నుంచి రావడం ఏంటి అనే ప్రశ్న వేస్తున్నారు. దీని మీద మీ జవాబు ఏంటి సార్? (0:12:38)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (5m 22s)

  • 📜 పూర్వీకుల పునాది: అదేమి ప్రశ్న కాదు. ఒక విషయం ఏంటంటే – మొట్టమొదట ‘యజ్ఞము’ అనేది ఒక పుస్తకముగా రాసినవారు అద్దంకి దావీదు గారు, మా తాతగారు, మా చిన్న తాతగారు. తర్వాత మండపాక కేశవరాయ శర్మ గారు అని ఒక బ్రాహ్మణుడు.. వేదములే చదివి ఆయన రక్షణ పొంది అప్పట్లో ఎలీము భక్తసింగ్ గారి సేవ ఆరంభించినప్పుడు ఎలీము వచ్చి భక్త్ సింగ్ గారి చేతనే బాప్తిస్మం పొందారు. ఆయన కూడా ‘యజ్ఞము’ అనే ఒక కరపత్రిక విడుదల చేశారు, దాన్ని భక్త్ సింగ్ గారే ఆశీర్వదించి దాన్ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత పండిత్ ఫ్రాన్సిస్ గారు విశేషంగా వారు ఎన్నో పుస్తకాలు రాశారు.
  • 🤝 పండిత్ ఫ్రాన్సిస్ గారి కృషి: యజ్ఞమును ఎత్తి చూపుతూ ఆయన ఎన్నెన్నో పుస్తకాలు, దాదాపు నేను ఎరిగి 40, 50 టైటిల్స్ ఉన్నాయి.. పండిత్ సి.హెచ్. ఫ్రాన్సిస్ గారివి. మరి ఆయన మాకు గురుతుల్యులు, పితృ సమానులు. వారి పుస్తకాల వల్ల కూడా ఎంతో సేకరించారు దేవుడు ఆయా కాలములలో ఆయా భక్తుల ద్వారా. వీళ్ళందరూ నాకంటే ముందున్నవాళ్ళు, వాళ్ళు నాకు దారి చూపించారు.
  • ⚖️ మక్కికి మక్కి అనుకరణ కాదు: అయితే నేను హైందవ క్రైస్తవంలో ఎత్తి చూపినంత విపులంగా, అంత డీటెయిల్డ్ (Detailed) గా వీళ్ళు ఎవ్వరూ కూడా రాయలేదు. నేను రాసిన సమాచారము ఇంతకుముందు రాసిన భక్తులకు మక్కికి మక్కి ఎక్కడ కూడా అనుకరణ కాదు. అలాగ ఉంటే అది గ్రంథ చౌర్యం అవుతుంది, పుస్తక అంశమును సమాచారం దొంగిలించడం అవుతుంది. ఎక్కడైతే నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నానో వాళ్ళ పేర్లు అక్కడ నేను రాశాను. అక్కడ ఉన్నటువంటి మేటర్ నేను ప్రెసెంట్ చేసిన విధానం మాత్రం అపూర్వం, అంతకుముందు ఎవరు కూడా దాన్ని చేయలేదు. అందుకే ఫ్రాన్సిస్ గారిని గురించి ఇంత గొడవ కాలేదు, నన్ను గురించి అవుతుంది.
  • ⚔️ బలమైన లాజిక్ మరియు ఒప్పించే ప్రయత్నం: వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే అవతల వాడిని ఒప్పించే ప్రయత్నము జరగలేదు, తమకు తోచింది రాశారు అంతే. కానీ నేనేమో అవతల వాడిని పీక గురిసినట్టు కార్నర్ చేసి ఒప్పించడానికి ప్రయత్నం చేసినంత స్ట్రాంగ్ లాజిక్ వాడాను. My book is more convincing than any other book which came earlier. అందుచేత మా తాతగారే మా మాతామహులు.. మా అమ్మ యొక్క నాన్నగారు కే.వీ. జాకబ్ గారు, కొత్తపల్లి జాకబ్ గారు.. ఆయన “నాకలోకములను సృజించిన నాధుడ యేసుని గొలువరే మోకరించుచు” అనే పాట రాశారన్నమాట. మరి “మోకరించుచు సిలువ దాపున శ్రీని రూపాలుని బిలువరే” అని పాట.. అందులో “సంధియము మీకేలగలిగెను సామవేదము చదవరే, అందునుండు ప్రజాపతి ఎవ్వడు అరయ యేసుని గానరే” అని రాశారు. మాసిలామణి గారు కూడా ఒక పాటలో రాశారు “యేసే ప్రజాపతి పరమేశం” అని. అంటే ప్రజాపతి యజ్ఞము, విరాట పురుషుడు.. ఇట్లా మా జాకబ్ గారు, దావీదు గారు మా తాతయ్యలు, అలాగే ఫ్రాన్సిస్ గారు, మండపాక కేశవరాయ శర్మ గారు ఇంతమంది అటు దారి చూపించారు నాకు.
  • 🔍 సొంత పరిశోధన – 70 సార్లు: అందుచేత వేదములు నేనంటూ ప్రత్యేకం మళ్ళీ నాకంటూ ఒక సొంత పరిశోధన ఉండాలని 70 సార్లు చదివాను. చదివినప్పుడు ఈ పెద్దలు చెప్పిన దానికంటే ఇంకా విశేషమైన సమాచారం అందులో నాకు ఎంతో కనపడింది. అందుచేత పెద్దలు దారి చూపారు, పైనుండి దేవుడు కూడా బయలుపరిచాడు. అందులో క్లాష్ ఏమీ లేదు.
  • ముగింపు: నేను మొదటి నుండి చెబుతున్నా.. ఈ సత్యము చెప్పిన వాడిని నేను మొదటి వాడిని కాదు. పెద్దలను కూడా దేవుడు వాడుకొని నాకు దారి చూపించాడు, ఆ దారిలో నేను పరిశోధన ముందుకు సాగినప్పుడు మరింత పరిపూర్ణమైన అవగాహన నాకు వచ్చింది. ఇంత సంపూర్ణమైన అవగాహన ముందున్న వాళ్ళ ఎవరికీ లేదు. వాళ్ళు ఉన్న పుస్తకాల్లో రాయలేదు, వాళ్ళు రాసింది కొంత.. ఐదు పైసలు అనుకోండి, కానీ వాళ్ళు రాయిన సమాచారం 95% నేను మళ్ళీ సేకరించాను. అందుచేత పైనుండి దేవుడు తప్పకుండా నాకు బయలుపరిచాడు. దారి చూపడానికి ఆ భక్తులను వాడుకున్నాడు, గమ్యం చేరడానికి పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేశాడు. ఇందులో పెద్ద చర్చ ఏమున్నది? ఓకే.

Detailed English Translation:

❓ Question: Your book ‘Haindava Kraistavam’ claims to be a direct revelation from Heaven (Satyaloka), yet you also mention previous saints who wrote on the same topic. Critics argue: if they already said it, why do you claim a direct revelation?

  • The Foundation of the Elders: This is not a contradiction. I openly acknowledge the pioneers who preceded me, including my grandfathers, Addanki David and K.V. Jacob, and scholars like Mandapaka Keshavaraya Sharma and Pandit C.H. Francis. These men were instruments used by God in their respective times to point in this direction.
  • Respecting Mentors: Pandit Francis, for instance, wrote nearly 50 titles regarding the ‘Yajna’ (Sacrifice) in the Vedas. He is like a father figure to me. Their works were the starting point from which God began to gather information through me.
  • Originality in Presentation: While they showed the way, the depth and detail in ‘Haindava Kraistavam’ are entirely unique. I have not merely copied their work; that would be plagiarism. I have credited them wherever I used their data. My method of presentation, however, is unprecedented. Earlier works expressed their views but didn’t necessarily aim to logically corner and convince the opponent. My book uses such strong logic that it is more convincing than any work that came before it.
  • Exhaustive Research: Building on the foundation of my elders, I personally researched the Vedas, reading them 70 times. During this intensive study, I discovered a vast amount of information—about 95% of the book—that was never documented by previous authors.
  • Conclusion: I have always said that I am not the first person to speak these truths. God used those elders to show me the path, but when I journeyed down that path, the Holy Spirit granted me a more complete and perfect understanding. There is no conflict in honoring the ones who showed the way while receiving divine help to reach the final destination.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram