89.Q: Response to Criticism: Does Apostle Ophir Have No Disciples? (KSM 06) 👥

❓ ప్రశ్న: సార్, ఈ సాక్షి క్రిస్టియన్ వాయిస్ వాళ్ళు అంటున్న ఇంకో మాట ఏంటిదంటే – ఇప్పటివరకు మీరు ఒక్క శిష్యుని కూడా తయారు చేయలేదు అని. దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? (0:53:42)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (3m 38s)

  • 👥 విమర్శలోని అజ్ఞానం: నేను ఒక్క శిష్యుని కూడా తయారు చేయలేదు అన్నారంటే.. దానికి అర్థం ఏంటంటే వాళ్లకు అసలు టోటల్ గా నన్ను గూర్చి ఏమీ తెలియదు అనైనా అనుకోవాలి, లేకుంటే తెలిసిన విషయాలను కూడా చూడడానికి ఇష్టం లేని స్వచ్ఛంద గుడ్డివాళ్ళు అనైనా అనుకోవాలి. ఎందుకంటే నేను పదే పదే చెబుతున్నాను, నా పక్షంగా మాట్లాడుతున్న వాళ్ళు అనేకమంది చెబుతున్నారు.
  • 🛡️ వేలాది మంది శిష్యులు: ఓఫీర్ గారి సహవాసములో ఒక్క డాలర్, ఒక్క రూపాయి కూడా విదేశీ సహాయం లేకుండా ఒక 1000 సంఘాలు కట్టాడు. 800 మంది పాస్టర్స్ ఉన్నారు ఆయనతో. వాళ్ళందరూ విశ్వాసం మీద సేవ చేస్తూ, సంఘములోని విశ్వాసులు ఇచ్చే దశమ భాగాల మీద బ్రతుకుతూ, ఆ దశమ భాగాలలో దశమ భాగాలు ఓఫీర్ గారికి పంపిస్తే ఆయన మళ్ళీ సేవలో ఖర్చు పెడుతున్నాడు. ఇన్ని వందల మంది వందల సార్లు చెప్తుంటే.. ఒక్క శిష్యుడు లేడు అని ఎలాగ అంటారు?
  • ⚖️ నిజమైన శిష్యరికం: ఇప్పుడు ఆ 800 మంది పాస్టర్స్ నా శిష్యులే. ఆ 800 మంది బాప్తిస్మాలు ఇచ్చిన లక్షల మంది నా శిష్యులే. సిద్ధాంతపరంగా నాకు కమిట్ అయి (Commit), నా దగ్గర నేర్చుకొని.. అయ్యగారి బోధను మేము కూడా స్తంభముగా ఎత్తిపట్టి ముందుకు తీసుకెళ్తాం అనే కమిట్మెంట్ లేనోళ్లయితే, జీతాలే ఇవ్వని నాకు వాళ్ళు ఎందుకు నాతో కలిసి ఉంటారు? నాకు ఎదురు వాళ్లే డబ్బులు ఇస్తారు అంటే, నా దగ్గర వాళ్లు ఏదో నేర్చుకున్నారనే కృతజ్ఞత, గౌరవము, గురుభక్తి భావం ఉంటేనే కదా!
  • ముగింపు: గనుక ఓఫీర్ గారు 1000 సంఘాలు కట్టి, 800 మంది పాస్టర్స్ ని తయారు చేసినాక కూడా.. “ఆయన ఒక్క శిష్యుని తయారు చేయలేదు” అన్నాడంటేనే వాడు టోటల్లీ వెర్రివెంగళప్ప విధవాయి అని అర్థం. ఈ మధ్య రఘు ఏలు, దాసుబాబు, అరుణ్ కుమార్ గారు, నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు, ఐజక్ ప్రేమ కుమార్.. వీళ్ళందరూ నా శిష్యులు కాదా? వేల మంది ఉన్నారు. వీళ్ళు నన్ను అట్ల అనడం ఎట్లా ఉందంటే – పాతిక మందిని కడుపున మోసి కన్న ఆమెను పట్టుకొని ‘గొడ్రాల’ అన్నట్టు ఉంది. వాడు హవలా నెంబర్ వన్. అది విషయం. ఓకే.

Detailed English Translation:

❓ Question: Some critics claim that you haven’t produced even a single disciple so far. How do you respond to this statement?

  • Willful Ignorance: To say I have no disciples is either complete ignorance or a willful blindness to reality. Thousands can testify to the truth of my ministry.
  • A Network of Faith: I have established 1,000 churches and mentored 800 pastors without a single cent of foreign funding. These pastors live by faith and support this ministry out of their own convictions. This level of commitment is the highest proof of discipleship.
  • Commitment Beyond Salaries: These 800 pastors aren’t paid employees; they are disciples committed to the doctrine I teach. They support the ministry because they have learned from me and value the spiritual leadership provided.
  • Conclusion: To claim I have no disciples after raising 800 leaders is like calling a mother of twenty-five children “barren.” It is a baseless and foolish accusation. My disciples are visible and active across various platforms, standing firm in the truth.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram