(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఈ వీడియోచూసాను ఇంకొక్క comment చెయ్యడానికి అవకాశం లేదు, ఎవరు కూడా అనుకోరు కలలోనైనా అద్దంకి రంజిత్ ఓఫీర్ అను నేను ఏం కామెంట్ చేస్తానో… తెలుసు, పగటికలలు తప్ప అది జరుగదు. 2021లోపల ఇదిమొత్తం హిందూ రాజ్యం చేస్తాను అంటున్నారు. అది 2031, జరుగదు 2051కి కూడ జరగదు. అది ఎప్పుడు జరిగేపని కానేకాదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు. ఆర్టికల్ 370 విషయంలో కాశ్మీర్ విషయంలో మేము ఒక అమెండ్మెంట్ తెచ్చాం గదా. అలాగే కొన్ని మార్పులు చేస్తూ వచ్చాం గదా! అలాగే ఇదికూడ జరుగుతుంది. మీరు చూస్తా ఉండండి అంటాడు ఆయన. అయితే నేను చెబుతున్నాను. ఏం చేస్తారు మీరు కాశ్మీర్‌ను అక్కడ ప్రజల మనోభావాలు అణచివేసి ఎదురు ప్రశ్నించే సామర్థ్యం, సత్తా ఉన్న నాయకులను లోపలేసి మూసేసి, అక్కడ ఇంటర్నెట్ పని చేయకుండా చేసి, Mobile టవర్స్ పని చేయకుండా చేసి, అక్కడ ఒక అణచివేత చర్యలుక్రింద దాని ఏదో చేసారు. పార్లమెంట్లో బిల్లు పాస్ చేసారు. అయితే ప్రజల హృదయంలో ఉన్న భావాలను మీరు మార్చగలిగితే ఒక్కప్పటి స్వేచ్చా మీరు మళ్ళీ ఇచ్చి చూడండి ఏం జరుగతదో ఒకని సంకెళ్ళు వేసి బంధించి వాడు నాకు లోబడుతున్నాడు అని చెప్పిన్నట్టు ఉన్నది ఈ పరిపాలన. ప్రజలలో మనం ప్రజా అభిప్రాయసేకరణ నిర్వహించి ఏదైనా చెయ్యాలి అనేది వీళ్ళకు లేదు. వీళ్ళు అనుకున్నదే ప్రజలు అనుకోవాలి. అనే హిట్లర్ పందా అనుసరిస్తుఉన్నారు. అట్లాగే నేను చెబుతున్నాను. అట్లాగే ఇంకో బిల్లు పాస్ చెయ్యెచ్చు. అస్సాంలో ఉన్నటువంటివారు, ముస్లింలుగా ఉంటే మీకు వారసత్వ అవకాశం లేదు. హిందువులు అయితే ఉన్నది అని చెప్పినట్లు దేశంలో హిందువుగా ఉంటేనే ఉద్యోగం. హిందువుగా ఉంటేనే ఇది అని అమెండ్మెంట్ చేయొచ్చు. చట్టంలో కాని అప్పటి దాకా హృదయంలో యేసుని ప్రార్థిస్తున్నవారు, ఈ చట్టం కొత్తగా వచ్చింది గనుక నేను రామా, కృష్ణ అయ్యప్ప, వెంకటేశ్వర అని అంటారా వాళ్ళు ఎంత అమాయకులు. ఇట్లా అనుకుంటారా! ఇప్పుడు ముస్లింలు ఉన్నారు. చట్టాలు మార్చేసారు. వీళ్ళు పార్లమెంట్లో మంద బలాన్ని చూసుకొని చట్టాలు, కొత్త చట్టాలు తెచ్చారు అని అల్లాహుఅక్బర్ అని మానేసి వెంకటేశ్వరహుఅక్బర్ అని అంటారా? అనరు. వీళ్ళు పిచ్చోళ్ళు అలాగు అనుకున్న వారందరు. 2021 కాదు 2091కి కూడ హిందూదేశం కాదు. వాళ్ళు ఎట్లా చేస్తారో చేయమనండి. ఒకవేళ వాళ్ళు అట్లా చేస్తే గనుక ఇంకా క్రైస్తవ్యం వ్యాపిస్తుంది. ఇస్లాం వ్యాపిస్తుంది. తప్పకుండా నేను చెబుతున్న ప్రవచనం వాళ్ళు అలాగు చేస్తే పుట్టగతులుండవ్. వాళ్ళ భావజాలానికి పార్టీలకు నూకలు కూడ ఉండవు. అన్ని పిచ్చిఆలోచనలు మానుకొని అన్నిమాతాలను సమానంగా గౌరవించాలి. అందరికి ప్రచార స్వేచ్ఛ ఉంది. మతాంతీరీకరణ, conversion స్వేచ్ఛా ఉంది. అది ప్రాథమిక హక్కు అనుకునే తెలివి వీళ్ళకు ఎంత తొందరగా వస్తే అంతమంచిది. లేకపోతే వీళ్ళు గాలిలో కలిసిపోతారు. అంతర్థానం అయిపోతారు.