1107.Q: Status of Women in Indian Culture and Manu Smriti (KSM 221) 🛡️

❓ ప్రశ్న: భారత్‌లో స్త్రీల మీద జరుగుతున్న దాడులకు గల మూల కారణాలు ఏంటి? మను ధర్మశాస్త్రం మరియు భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఉన్న స్థానం ఏమిటి? ఒకవైపు గౌరవిస్తూనే, మరోవైపు అణిచివేయడం వెనుక ఉన్న సామాజిక కారణాలు ఏమిటి? (0:08:20)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (15m 00s)

  • 📉 దిగజారిన దేశ గౌరవం: భారతదేశంలో ఇలాంటి స్థితి రావడానికి మూల కారణం ఏమై ఉంటది అంటే – మన దేశం యొక్క పరువు మొత్తం ప్రపంచ దేశాల దృష్టిలో దిగజారిపోయింది. భారతదేశం అంటే వీళ్ళు ఏదో మహోన్నతమైన సంస్కృతి అని చెప్పుకున్నా, అది రేపుల దేశం. ఇక్కడికి టూరిస్టులు రావాలంటే భయపడే పరిస్థితి. విదేశీ స్త్రీలు వస్తే కూడా వాళ్ళని అలాగే చేశారు.
  • 🧱 రెందు సమాంతర భావజాలాలు: దీనికి మూలాలు ఎక్కడ ఉన్నాయి అంటే – మను ధర్మశాస్త్ర ప్రకారం ఆమెకు ఒక వ్యక్తిత్వము, ఒక సమాన స్థాయి హోదా అనేది లేనే లేదు. మన భారతీయ సంస్కృతిలో రెండు సమాంతరంగా నడిచినాయి. ఒకటి స్త్రీని గౌరవించాలనే థాట్ లైన్ (Thought Line), రెండోది స్త్రీ అంటే ఒక యంత్రం లాంటిది, ఆమెకు హక్కులు ఉండవు అనే థాట్ లైన్.
  • ⚖️ అణిచివేత వ్యవస్థలు: ఒకవైపు చూస్తే జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ. శూద్ర, దళిత అమ్మాయిలను దేవుడికి పెళ్లి చేస్తే ఊరి పెద్దలందరూ ఆమెను అనుభవించడం. సతి సహగమనం – భర్త పోతే ఆమెను కూడా కాల్చి చంపేయడం. “నస్త్రీ స్వాతంత్ర మర్హతి” – అంటే స్త్రీకి స్వాతంత్రం ఉండకూడదు, పసితనంలో తండ్రి చాటున, యవ్వనంలో భర్త చాటున, వృద్ధాప్యంలో కొడుకు చాటున ఉండాలని మనువు చెప్పాడు.
  • 🏛️ మాతృస్వామ్య ఆనవాళ్లు: కానీ మళ్ళీ విచిత్రం ఏంటంటే – ఆడవాళ్ళు చదువుకోకూడదు అంటే మరి మొల్ల రామాయణం ఎలా రాసింది? వేద మంత్ర ద్రష్టలలో ఋషికలు (స్త్రీలు) ఉన్నారు. సౌత్ ఇండియా మాతృ స్వామ్య వ్యవస్థ. శాతకర్ణి మహారాజు తన తల్లి పేరు పెట్టుకొని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అని పిలిపించుకున్నాడు. భీష్ముడిని ‘గాంగేయుడు’ అని, కుంతి పుత్రులను ‘కౌంతేయులు’ అని పిలిచేవారు.
  • సంఘర్షణల ఫలితం: కాబట్టి 100% స్త్రీని అణిచివేశారని చెప్పలేము. ఈ ఆర్య ద్రావిడ సంస్కృతులు కలవడము, పోట్లాడుకోవడము.. ఈ సంఘర్షణలోనే భారతీయ కల్చర్ తయారయింది. ఒకవైపు స్త్రీ పూజింపబడుతూనే, ఒకవైపు అణిచివేయబడింది. ఈ మిశ్రిత ఆలోచన విధానం వల్ల అల్టిమేట్ గా సాతాను తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు – మనుషులు రక్షకుడిని తెలుసుకోకుండా చేసే వ్యవస్థను సృష్టించాడు.

Detailed English Translation:

❓ Question: What are the root causes of the atrocities against women in India? What was the position of women according to Manu Smriti and Indian culture? Why is there a contradiction between honoring and suppressing them?

  • Declining National Reputation: The root cause of this situation is that our country’s prestige has declined globally. Despite claims of a great culture, India is increasingly viewed as a land of rapes. Tourists, including foreign women, are afraid to visit due to the lack of safety.
  • Two Parallel Thought Lines: The roots lie in the fact that, according to Manu Smriti, a woman has no individual personality or equal status. Two parallel thought lines have existed in Indian culture: one that advocates for honoring women, and another that treats a woman as a mere machine without rights.
  • Systems of Oppression: On one hand, we see systems like Jogini and Devadasi, where Dalit and Shudra girls were ‘married’ to gods only to be exploited by village elders. Practices like Sati (burning widows alive) and the Manu Smriti dictate “Na stri swatantramarhati,” meaning a woman deserves no independence—she must be under her father in childhood, husband in youth, and son in old age.
  • Traces of Matriarchy: Yet, there is a paradox. If women were forbidden from education, how did Molla write the Ramayana? There were female seers (Rishikas) among the Vedic authors. South India had matriarchal roots. King Satakarni called himself ‘Gautamiputra Satakarni’ after his mother. Bhishma was called ‘Gangeya’ and Kunti’s sons ‘Kaunteyas.’
  • Conclusion: Therefore, we cannot say women were 100% suppressed. Indian culture was formed through the interaction and conflict between Aryan and Dravidian cultures. While she was worshipped on one hand, she was crushed on the other. Ultimately, Satan used this mixed ideology to create a system that prevents people from knowing the True Savior.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram