❓ ప్రశ్న: కాకతీయ సామ్రాజ్యం మరియు ప్రాచీన భారతదేశ చరిత్రలో దళితులు, శూద్రులు ఉన్నత స్థానాలకు ఎలా ఎదిగారు? శివాజీ మహారాజు పట్టాభిషేకం సమయంలో జరిగిన అవమానాలు మరియు ఆధిపత్య వర్గాల కుట్రల వెనుక ఉన్న అసలు నిజాలేమిటి? (0:18:30)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (08m 00s)
- 🛡️ కాకతీయుల మూలాలు: కాకతీయ సామ్రాజ్యం స్థాపించిన వాళ్ళు దళితులు. ఇంటర్నెట్ లో చాలా వీడియోస్ ఉన్నాయి వాళ్ళ గురించి, కాకతీయులు ఎవరు, వాళ్ళ కులం ఏది అని కొడితే వచ్చేస్తుంది. ఆ కాలంలో వేరే రాజులు కాకతీయులను గౌరవించడానికి ఇష్టపడలేదు, “మీరు చండాలురు” అని అన్నట్టుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజ శాసనాలు ఇప్పుడు దొరికాయి.
- 🧱 క్రీమీ లేయర్ – ప్రతిభ: మరి కాకతీయులు దళితులై ఉండి ఎలాగో ఒక మహా సామ్రాజ్యం స్థాపించారు. సమాజంలో ‘క్రీమీ లేయర్’ అనేది ఒకటి ఉంది – ఏ కులంలో పుట్టిన వాళ్ళకైనా తెలివి, జ్ఞానం, సాహసం, తెగింపు ఉంటే వాళ్ళు ఉన్నత స్థానానికి వచ్చేసి కొన్ని కార్యాలు సాధించారు. మొల్ల రామాయణం రచయిత్రి శూద్రురాలే. భారత సమాజం నూటికి నూరు శాతం మను ధర్మ శాస్త్రమే పాటించాలనే దాంట్లో ఎప్పుడూ లేదు.
- ⚖️ శివాజీ మహారాజు మరియు అవమానం: శివాజీ మహారాజు శూద్రుడు, క్షత్రియుడు కాదు. ఆయన రాజుగా ఎదుగుతున్నప్పుడు బ్రాహ్మణులు ఆయన ఎదుగుదలను ఆపలేకపోయారు. కానీ ఎదిగిన తర్వాత మాత్రం “మా సిస్టం కి కుదరదు, ఇతను శూద్రుడు గనుక రాజ్య పరిపాలన అధికారం లేదు” అని అతని పట్టాభిషేకానికి రావడానికి ఇష్టపడలేదు. “నువ్వు శూద్రుడివి, నా కుడి చేత్తో నీకు తిలకం దిద్దను, ఎడమ కాలి బొటన వేలుతో దిద్దుతాను” అని ఒకాయన అన్నట్టు చరిత్ర చెబుతుంది.
- 🔍 పీశ్వాల కుట్ర: శివాజీని కుట్ర చేసి చంపించిన తర్వాత అతని సామ్రాజ్యం పీశ్వా బ్రాహ్మణుల చేతికి ఎందుకు వెళ్ళింది? మొఘలుల చేతికి ఎందుకు పోలేదు అంటే వీళ్ళు కుమ్మక్కై కుట్ర చేశారు. కష్టపడి రక్తం ఓడ్చి సాధించాల్సిందేమో శూద్రుడు, తర్వాత నెత్తినెక్కి కూర్చోవాల్సిందేమో బ్రాహ్మణుడు – ఇలా నడుస్తూ వచ్చింది. విద్య మొత్తం బ్రాహ్మణుల చేతుల్లో ఉంది గనుక వాళ్లకు అనుకూలంగా చరిత్ర రాశారు.
- ✨ ప్రాచీన సామాజిక స్థితి: వేదవ్యాస మహర్షి మహాభారతంలో ‘ధర్మ వ్యాధుడు’ కథ రాశాడు. మాంసం అమ్ముకునే కటిక వాడు వేద పండితుడైన కౌశిక మహర్షికి పరమ సత్యాలు నేర్పించాడు. అంటే ప్రాచీన భారతదేశమంతా ఒకే సోషల్ ఆర్డర్ లో లేదు. ఎప్పుడైతే వీరత్వం, పరాక్రమం అవసరమైనాయో అప్పుడు శూద్రులే పనికొచ్చారు, వాళ్ళని ముందు పెట్టుకున్నారు. అల్టిమేట్ గా మనుషులు రక్షకుడిని తెలుసుకోకుండా చేసే వ్యవస్థను సృష్టించడమే సాతాను లక్ష్యం.
Detailed English Translation:
❓ Question: How did Dalits and Shudras rise to high positions in the Kakatiya Empire and ancient Indian history? What is the truth behind the conspiracies of dominant classes and the insults faced by Shivaji Maharaj?
- Dalit Roots of Kakatiyas: The founders of the Kakatiya Empire were Dalits. Numerous videos and historical records exist online regarding their caste. Royal inscriptions from that era show that other contemporary kings refused to respect them, often labeling them as ‘Chandalas.’
- Meritocracy and the ‘Creamy Layer’: Despite their background, the Kakatiyas established a great empire. There has always been a ‘creamy layer’ in society—individuals from any caste with intelligence, courage, and determination who rose to accomplish great feats. For instance, Molla, who wrote the Ramayana, was a Shudra. Indian society never strictly followed Manu Smriti 100%.
- Shivaji Maharaj’s Coronation: Shivaji Maharaj was a Shudra, not a Kshatriya. While he was rising to power, the dominant classes couldn’t stop him. However, once he established his kingdom, they refused to attend his coronation, claiming a Shudra had no right to rule. History records an instance where one priest refused to apply the tilak with his hand, offering to do it with his left big toe instead.
- The Peshwa Conspiracy: After Shivaji’s death—often suspected to be a result of conspiracy—his empire eventually fell into the hands of Peshwa Brahmins rather than Mughals because of internal collusions. The pattern was: the Shudra sheds blood to build the empire, and the dominant class takes the seat of power. Since they controlled education, they wrote history in their favor.
- Ancient Social Diversity: In the Mahabharata, Veda Vyasa writes the story of ‘Dharma Vyadha,’ a butcher who teaches ultimate truths to the Vedic scholar Kaushika. This proves that ancient India did not have a uniform social order. Shudras were sought after whenever bravery and valor were needed. Ultimately, Satan’s goal is to maintain these systems to prevent humanity from recognizing the True Savior.
