❓ ప్రశ్న: రాబోయే ‘వన్ వరల్డ్ గవర్నమెంట్’ (ప్రపంచ ఏక ప్రభుత్వం) గురించి బైబిల్ ఏం చెబుతోంది? క్రీస్తు విరోధి ఎవరు? వాని 42 నెలల పరిపాలన ఎలా ఉంటుంది? ఈ కాలంలో క్రైస్తవ సంఘాల పరిస్థితి ఏమిటి? (0:36:30)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (10m 00s)
- 🌍 ఏక ప్రభుత్వ స్థాపన: అసలు వన్ వరల్డ్ గవర్నమెంట్ రాబోతున్నది. సిద్ధపడండి, వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు సీ ఏ వన్ వరల్డ్ గవర్నమెంట్ (గ్లోబల్ గవర్నమెంట్). ఒక్కడే రాజు, చాలా క్రూరుడైన ఒక నియంత. ప్రపంచ చరిత్రలో హిట్లర్ గాని, ముస్సోలిని గాని, స్టాలిన్ గాని.. ఎవరినీ కూడా మనం ఊహించలేనంత క్రూరమైన స్థాయిలో వాడు ఉంటాడు.
- 👺 సాతాను కుమారుడు: వాడు మనిషాకారంలో ఉన్న ఒక క్రూర మృగమే, వాడు సాతాను కుమారుడు. “నేనే దేవుణ్ణి, అన్ని మతాలు అబాలిష్ చేస్తున్నాను.. నో ఇస్లాం, నో క్రిస్టియానిటీ, నో హిందూయిజం” అని డిమాండ్ చేస్తూ వాడు 42 నెలలు భూమిని పరిపాలిస్తాడు. అప్పుడు వానినే దేవునిగా ఆరాధించాలని శాసిస్తాడు.
- ⚔️ దశరాజ్య కూటమి: భౌతికంగా జరిగేది ఏమిటంటే – ఒక అరబ్బు రాజు, అంతకుముందు పది మంది రాజులు కలిసి దశరాజ్య కూటమి ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. తర్వాత 11వ రాజుగా వాడు చేరి, చైర్మన్ అయిపోయి “నేనే భూలోకానికి రారాజును, నేనే దేవుడు” అని ప్రకటించుకుంటాడు. అలా వాడు ప్రకటించుకున్న తర్వాత 42 నెలల వరకు క్రైస్తవ సంఘాలను వాడు హింసిస్తాడు.
- ✨ ప్రభువు రాకడ – విజయం: ఆ తర్వాత మధ్యాకాశానికి యేసుప్రభువు వచ్చి తన భక్త సమాజాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత యేసుప్రభువు వారు మళ్ళీ దృశ్య రూపకంగా వచ్చి ఈ ప్రపంచ రాజుతో వాడి సేనలతో యుద్ధం చేసి చంపేసి, అగ్ని గంధకాల గుండంలోకి వాళ్ళని విసిరి వేస్తాడు. సాతానును బంధించి అగాధ కూపంలో పడవేస్తాడు.
Detailed English Translation:
❓ Question: What does the Bible say about the upcoming ‘One World Government’? Who is the Anti-Christ? How will his 42-month reign be? What will be the state of Christian churches during this time?
- The Emergence of a Global Government: A One World Government is indeed coming. Prepare yourself, for very soon we are going to see a global government. There will be a single ruler, a tyrant more cruel than anyone in history—surpassing even Hitler, Mussolini, or Stalin in his brutality.
- The Son of Satan: He is a beast in human form, the son of Satan. He will abolish all religions—declaring “No Islam, no Christianity, no Hinduism”—and demand that he alone be worshipped as God. His absolute reign over the earth will last for 42 months.
- The Ten-Kingdom Alliance: Physically, what unfolds is this: an Arab leader, along with ten other kings, will form a ten-kingdom alliance to establish a world government. He will emerge as the 11th king, eventually becoming the chairman and proclaiming, “I am the King of the Earth, I am God.” Following this declaration, he will persecute Christian churches for 42 months.
- Divine Intervention and Victory: After that period, Lord Jesus will descend to the mid-air to take His faithful followers (the Rapture). Subsequently, Jesus will return visibly to wage war against this world ruler and his armies, defeating them and casting them into the lake of fire and sulfur. Satan will then be bound and thrown into the bottomless pit.
