1117.Q: Devotion vs. Knowledge and Human Limitations (KSM 221) 📖

❓ ప్రశ్న: గొప్ప దైవజనులు, భక్తులు కూడా తమ బోధల్లో కొన్నిసార్లు పొరపాట్లు చేయడానికి కారణం ఏమిటి? వారు సర్వజ్ఞులు కారా? దేవుని గురించి పూర్తిగా తెలిసిన వారే నిజమైన భక్తులా? (1:00:45)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 00s)

  • 🛡️ సర్వజ్ఞత దేవునికే సొంతం: ఎవరు కూడా సర్వజ్ఞులు కారు నాయనా. ఇప్పుడు అన్ని ఎరిగి ఉండడం వేరు, దేవుణ్ణి యదార్థమైన హృదయంతో ఆరాధించడం, ప్రేమించడం వేరు. ఈ రెండు వేరు. దేవుణ్ణి పూర్తిగా తెలుసుకుంటేనే ఈ భక్తి నిజమైనది అనేది తప్పు తీర్పు అది రాంగ్ జడ్జిమెంట్ (Wrong Judgment).
  • 🧱 జ్ఞానము vs ప్రేమ: దేవుని గురించి ఎంతో ఎరిగిన వాడు ఉన్నాడు, వాడు మొత్తం నీచ నికృష్టుడు వాడు సైతాను. దేవుని గూర్చి సైతానుకు తెలిసినంతగా మనకు ఎవరికీ తెలియదు, కానీ వాడు దేవుని ప్రేమించడు ద్వేషిస్తాడు. దానికి రివర్స్ అన్నమాట – భక్తుడు దేవుణ్ణి పూర్తిగా ఎరుగడు అయినా ఆరాధిస్తాడు, ప్రేమిస్తాడు.
  • ⚖️ యథార్థమైన భక్తి: వాళ్ళ భక్తి, పరిశుద్ధత, దేవుని ప్రేమించడం, దేవునికి లోబడటం ఈ విషయాల్లో వాళ్ళు మనకందరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఒక చిన్న పిల్లోడికి డాడీ గురించి ఏమీ తెలియదు, అయినా కూడా యదార్థంగా ప్రేమిస్తాడుగా.. అలాగా. ప్రేమ అలా ఉండాలి కానీ సిద్ధాంతం కాదు.
  • 🔍 లేఖనమే అంతిమ తీర్పు: దైవజనుడు దైవజనుడే కానీ దేవుడైతే కాదు. ఎవరైనా తప్పు చేయొచ్చు, నేనైనా చేయొచ్చు. నేను చెప్పిందైనా తప్పు కావచ్చు అవకాశం ఉంది. లేఖనములో పరీక్షించండి అనే కదా నేను చెప్తున్నాను. నేను చెప్పింది అల్టిమేట్ (Ultimate) అని నేను అనట్లేదు. ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ (Final Court of Appeal) బైబిల్ గ్రంధం మాత్రమే.
  • దృష్టి కోణం – దిద్దుబాటు: ఒక కొండను దూరం నుండి చూసేవానికి నున్నగా కనపడుతుంది. అదే కొండ దగ్గరికి వచ్చి చూస్తే దాని మీద డీటెయిల్స్ అన్ని కనబడతాయి – ఆ రాళ్లు, రప్పలు, చెట్లు, గడ్డి పరకలు. అలాగే నేను దగ్గర నుండి చూస్తున్నాను కనుక ఏ తరములో ఏ ప్రత్యక్షత అవసరమో అది ఆ తరములో దేవుడు ఇచ్చాడు. దిద్దుబాటుకు రంజిత్ ఓఫీర్ తో సహా అందరం ఇష్టపడాలి.

Detailed English Translation:

❓ Question: Why do even great men of God and devotees sometimes make mistakes in their teachings? Are they not omniscient? Are only those who fully know God considered true devotees?

  • Omniscience belongs to God Alone: No human is omniscient. Knowing everything is different from worshipping and loving God with a sincere heart. Judging that devotion is real only if one fully understands God is a ‘wrong judgment.’
  • Knowledge vs. Love: There is one who knows a great deal about God but is utterly base and wicked—Satan. None of us know as much about God as Satan does, yet he does not love God; he hates Him. The reverse is true for a devotee—they may not fully know God, yet they worship and love Him.
  • Sincere Devotion: In matters of holiness, loving God, and submitting to Him, great saints stand at heights unreachable by us. A small child knows nothing about their father’s complexities, yet loves him sincerely. Love should be like that—relational, not just doctrinal.
  • Scripture is the Final Authority: A man of God is just that—a man, not God. Anyone can make a mistake, including me. There is a possibility that what I say could be wrong. That is why I always say, “Examine it in the Scriptures.” I do not claim that my word is ultimate. The ‘Final Court of Appeal’ is the Bible alone.
  • Perspective and Correction: A mountain looks smooth from a distance, but when you look closely, all the details—the rocks, trees, and blades of grass—become visible. Because I look closely, God provides the revelation necessary for each generation. Everyone, including Ranjith Ophir, must be open to correction.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram