❓ ప్రశ్న: ఆదాము హవ్వలు చేసిన పాపం మానవజాతికి జెనెటికల్ గా (Genetically) ఎలా సంక్రమించింది? వారు పాపం చేయకముందు మానవ శరీరం ఎలా ఉండేది? ముసలితనం మరియు మరణం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? (1:33:50)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 00s)
- 🛡️ పాపము లేని స్థితి: ఆదాము హవ్వలు పాపము చేయకుండా ఉంటే – పిల్లలు పుట్టేటోళ్ళు, యవ్వనం దాకా ఎదిగి ఆగిపోయేటోళ్ళు. ఇంకా మళ్ళీ ముసలితనం ఉండదు, మరణం ఉండదు. కానీ ఇప్పుడు పాపం ప్రవేశించినందుకు మరణం వచ్చింది గనుక.. ఎదుగుదల ఆగిపోవట్లేదు.
- 🧱 కణాలలో మార్పు (Cellular Change): పాప నియమము లేకుండా పరిశుద్ధులుగానే పుట్టేవారు దైవ స్వభావంతో. కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఆ సెల్స్ లో (Cells) మార్పు వచ్చింది. పీక్ పాయింట్ కి వచ్చినాక డిటిరేషన్ (Deterioration) స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా క్షీణించి మరణానికి దగ్గర కావడమే ముసలితనం.
- ⚖️ మరణ ప్రక్రియ ప్రారంభం: ముసలితనం అనేది మెల్లిమెల్లిగా చచ్చిపోవడమే. దేవుడు “నీవు నిశ్చయముగా చచ్చెదవు” అన్నది స్లోగా చావడమే. ఆ రోజే డెత్ ప్రాసెస్ (Death process) స్టార్ట్ అయిపోయింది. నరుని దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. దేవుని దృష్టిలో ఒక దినము వెయ్యి సంవత్సరాలు. ఆ లెక్కన ఆదాము వెయ్యేళ్ళు బ్రతకలేదు, వెయ్యి లోపలనే చచ్చిపోయాడు.
- ✨ వారసత్వంగా వచ్చిన పాపం: పండు తినగానే డెత్ ప్రారంభమై ఒక వన్ డే (దేవుని లెక్కన ఒక రోజు) కంప్లీట్ కాకముందే చచ్చిపోయాడు. ఆదాము నుండి ఆ పాప స్వభావం, ఆ మరణ శాసనం జెనెటికల్ గా ప్రతి మనిషికి సంక్రమించింది. అందుకే మనిషి పుట్టగానే ఏడుస్తాడు, ఆకలి వేస్తుంది, రోగాలు వస్తాయి.. ఇవన్నీ ఆదాము ద్వారా వచ్చిన వారసత్వమే.
Detailed English Translation:
❓ Question: How was the sin of Adam and Eve genetically transmitted to mankind? What would the human body have been like if they hadn’t sinned? What is the real reason behind aging and death?
- The Sinless State: If Adam and Eve had not sinned, children would still have been born, growing until they reached youth and then remaining at that peak. There would have been no old age and no death. But because sin entered, death followed, and the process of growth no longer stops at a peak.
- Changes in Cells: Humans would have been born holy, with a divine nature and without the law of sin. However, when Adam sinned, a change occurred in his cells. After reaching a peak point, deterioration began. Old age is simply the process of gradually declining and drawing closer to death.
- The Onset of the Death Process: Aging is a form of slow death. When God said, “You shall surely die,” it referred to this slow process. The death process started that very day. Human perspective differs from God’s; in His sight, a day is like a thousand years. By that count, Adam did not live a full ‘day’ because he died before reaching a thousand years.
- Inherited Sin Nature: As soon as the fruit was eaten, death began, and Adam died before one ‘divine day’ was completed. From Adam, that sinful nature and the decree of death were genetically transmitted to every human being. This is why a human cries at birth, feels hunger, and suffers from diseases—all are part of the inheritance from Adam.
