1124.Q: The Carcass, the Vultures, and Spiritual Death (KSM 221) 🦅

❓ ప్రశ్న: ‘పీనుగ ఎక్కడ ఉంటే గద్దలు అక్కడ పోగవుతాయి’ (మత్తయి 24:28) అనే మాటలోని అంతరార్థం ఏంటి? ప్రకృతి సంబంధమైన జీవానికి మరియు ఆధ్యాత్మిక జీవానికి ఉన్న తేడా ఏమిటి? ఆధ్యాత్మిక మృతులు అంటే ఎవరు? (1:37:20)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 00s)

  • 🛡️ రెండు రకాల జీవాలు: జీవం అంటే – భౌతికమైన ప్రాణం, భౌతికమైన చైతన్యము. కాన్షియస్ స్టేట్ (Conscious state) అనుకుంటే మనం మాట్లాడుకుంటున్నాము కాబట్టి జీవంలో ఉన్నాము అని తెలుస్తుంది. అయితే ఇది ప్రకృతి సంబంధమైన జీవం. యేసుప్రభువు వారు చెప్పిన జీవం ఆధ్యాత్మిక జీవం. “నేనే మార్గమును సత్యమును జీవమును” అన్నాడు.
  • 🧱 ఆధ్యాత్మిక కమ్యూనికేషన్: నీ కృప జీవము కంటే ఉత్తమము. ఆ ఆధ్యాత్మిక జీవము మనలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన కమ్యూనికేషన్ (Communication) జరుగుతా ఉంటుంది. మన నుండి దేవునికి వెళ్ళేది ప్రార్థన, దేవుని నుండి మనకు వచ్చేది బైబిల్ ద్వారా, ప్రసంగాల ద్వారా వచ్చే సమాచారం.
  • ⚖️ జీవమున్నందుకు నిరూపణ: దైవిక విషయాలలో ఆత్మ సంబంధమైన సమాచారం ఒకరి నుండి ఒకరికి వెళ్ళడం అనేది ఆధ్యాత్మిక జీవము ఉన్నందుకు నిరూపణ. ఒక మనిషి ఆ జీవంలో లేనప్పుడు వాడి ద్వారా ఎవరికీ ప్రయోజనకరమైన కమ్యూనికేషన్ ఉండదు. వాడి నుండి దేవునికి సమాచార సంబంధం ఉండదు, దేవుని నుండి వాడికి ఏమి ఉండదు.
  • ఆధ్యాత్మిక మృతులు: సార్ది సంఘం లాగా “జీవించుచున్నావు అన్న పేరే ఉన్నది కానీ నువ్వు మృతుడవే” అంటాడు. ప్రకృతి సంబంధమైన జీవం ఉన్నా (మేధావులు, శాస్త్రవేత్తలు అయినా), దేవునితో కమ్యూనికేషన్ లేనప్పుడు ఆధ్యాత్మికంగా వాడు చచ్చిపోయినట్టే. పీనుగ ఎక్కడ ఉంటే గద్దలు అక్కడ పోగవుతాయి అంటే – ఆత్మీయంగా చనిపోయిన వారి చుట్టూ దురాత్మలు, సాతాను శక్తులు ఆవరించి ఉంటాయి అని అర్థం.

Detailed English Translation:

❓ Question: What is the inner meaning of the saying “Wherever the carcass is, there the vultures will gather” (Matthew 24:28)? What is the difference between natural life and spiritual life? Who are the spiritually dead?

  • Two Types of Life: Life can be defined as physical existence and consciousness. Since we are speaking and conscious, it is evident we have life—but this is merely natural life. The life Jesus spoke of is spiritual life. He said, “I am the Way, the Truth, and the Life.”
  • Spiritual Communication: Your loving-kindness is better than life itself. When this spiritual life is within us, a spiritual communication occurs. Prayer is what goes from us to God, and information through the Bible and sermons is what comes from God to us.
  • Evidence of Life: The exchange of spiritual information in divine matters is proof of having spiritual life. When a person lacks this life, there is no beneficial communication through them. There is no link from them to God, nor from God to them.
  • Conclusion: Like the church in Sardis, it is said, “You have a reputation of being alive, but you are dead.” Even if one has natural life (even if they are intellectuals or scientists), if they lack communication with God, they are spiritually dead. “Wherever the carcass is, there the vultures will gather” means that those who are spiritually dead are surrounded and influenced by evil spirits and satanic forces.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram