❓ ప్రశ్న: తమిళనాట హీరో విజయ్ తలపతి గారు ‘తమిళగ వెట్రి కజగం’ అనే పార్టీని ప్రారంభించడాన్ని మీరు ఎలా చూస్తారు? (0:01:21) 🗳️🎭🤔
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (18m 41s) 🎙️🛡️
- ⚖️ వేచి చూడాలి: వేచి చూడాలి. ఇప్పుడు తొందరపడి మరి విజయ్ తలపతి గారి తమిళగా వెట్రీ కజగం అనే పార్టీ దాని గురించి వ్యతిరేకంగా గాని అనుకూలంగా గాని మాట్లాడడానికి ఇట్ ఇస్ టూ ఎర్లీ (It is too early). ఇంత తొందరగా మనం ఏమి చెప్పలేము. వారు వ్యక్తిగతంగా అయితే నాకు చాలా ఇష్టం. ఆ మరి అనగారిన వర్గాలలో నుండి అంటే పువ్వెత్తున ఎగిసినటువంటి ఒక కెరటం విజయ్ తలపతి గారు. మంచి కళాకారుడు, మంచి యాక్టరు.
- 📈 అనుభవం లేని అరంగేట్రం: మరి రాజకీయంగా వారికి అనుభవం లేదు. ఇప్పుడే అరంగేట్రం. ఫిబ్రవరిలోనే వారు పార్టీ రిజిస్ట్రేషన్ చేశారు. మొట్టమొదటి ఆ ర్యాలీ బహిరంగ ర్యాలీ మొన్న జరిగింది. కానీ ఫిబ్రవరి అంటే ఈ సంవత్సర ఆరంభంలోనే రిజిస్ట్రేషన్. ఈ లోపల అంతా గ్రౌండ్ వరకు అది చేసుకొని సభ్యత్వాన్ని అంత జరిగించుకొని వారు ఈ సంవత్సరంతం వరకు వచ్చేసరికి అంటే దాదాపు 10 నెలలు అనుకోండి, తొమ్మిది నెలల తర్వాత ఇది మెఘా ర్యాలీ ఏర్పాటు చేశారు. అనూహ్యంగా స్పందన వచ్చింది. 8 లక్షలకు పైగా జనం వచ్చారు. దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అంతమంది వస్తారని అనుకోలేదు.
- 🗳️ అభిమానులు vs ఓటర్లు: ఇప్పుడు వారిని గూర్చి ఆయన రావడం అనవసరమని, అవసరమని చెప్పడానికి ఇప్పుడు టూ ఎర్లీ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మొట్టమొదట సినీ కళాకారులు, సినీ హీరోస్ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ అభిమానులు అందరూ వస్తారు. వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారా లేదా అనేది ఒక ఎన్నికలు అయితే గాని చెప్పలేము. ఇప్పుడు చిరంజీవి గారి పార్టీ అలాగే జరిగింది. మెగాస్టార్ చాలా మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఆయన. ఎన్టి రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వాళ్ళ తర్వాత ఇంకా నెక్స్ట్ తరంలో మోస్ట్ సక్సెస్ఫుల్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. కానీ రాజకీయంగా అంతా ఆయన ఆ విజయవంతం కాలేకపోయారు. ప్రజారాజ్యం పెట్టారు తర్వాత మళ్ళీ. కాబట్టి జనం నాడి పసిగట్టడం చాలా కష్టం. ఒక ఎన్నికలు జరిగితే తప్ప చెప్పలేము.
- 🛡️ హేట్ పాలిటిక్స్: కానీ ఇప్పుడు వారి ఉద్దేశాలు మంచివి. ఆయన నో హేట్ పాలిటిక్స్ (No Hate Politics) అని అన్నారు ప్రారంభోత్సవ సభలో. ఇప్పుడు దేశంలో జరుగుతున్నది అదే హేట్ పాలిటిక్స్, నఫరత్ కి రాజనీతి. ఫలానా మతం వాళ్ళ ద్వారా, ఫలానా వాళ్ళ ద్వారా మన ధర్మానికి హాని కలిగింది, వాళ్ళను హేట్ చేయండి, వాళ్ళ నుండి మనం మన ధర్మాన్ని రక్షించుకోవాలని ఒక విద్వేషాన్ని, అభద్రత భావాన్ని పుట్టించి దాని మూలంగా ఓట్ల బ్యాంకును క్రియేట్ చేసి ఓట్ బ్యాంకు క్రియేట్ చేసుకున్నటువంటి పార్టీ ఇప్పుడు దేశాన్ని ఏలుతుంది బీజేపీ. కనుక హేట్ పాలిటిక్స్ అవసరం లేదు, అణచివేతను మేము అంగీకరించం.
- 🏛️ భాషా సమస్య: ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ వారు ఏంటంటే మాకు తమిళ్ అండ్ ఇంగ్లీష్ చాలు, నో హిందీ ఇన్ సౌత్ ఇండియా. మా రాష్ట్రంలో అయితే ఆ భాషాపరమైన ఇష్యూ కూడా ఆయన టేక్ అప్ చేశారు. ఆ ప్రారంభ ఉపన్యాసంలో ర్యాలీలో విజయ్ తలపతి గారు ఈ హిందీని బలవంతంగా రుద్దొద్దు అనేది కూడా ప్రస్తావించారు. కనుక అది ఎప్పటి నుంచో రగులుతున్నటువంటి రావణ కాష్టం లాగా ఉన్నటువంటి ఇష్యూ అది. సో హిందీ మన నెత్తిన రుద్దడం ఎవరికీ ఇష్టం లేదు. తెలుగుోళ్ళకి ఇష్టం లేదు, కన్నడగాస్ కి ఇష్టం లేదు, మలయాళీస్ కు అసలు ఇష్టం లేదు, టెమిలియన్స్ కి ఇష్టం లేదు. ఈవెన్ బెంగాళీస్, ఈవెన్ పంజాబీస్, మరాఠీస్ ఎవరికీ ఇష్టం లేదు. కాబట్టి హిందీ వన్ నేషన్ షుడ్ హావ్ వన్ లాంగ్వేజ్ అని నెహ్రూ గారి టైం నుంచి ప్రయత్నం చేస్తుంటే ఎవరు ఒప్పుకోలేదు. ఈ నార్త్ ఇండియా నుంచి వచ్చిన పార్టీస్ ఎవరైనా సౌత్ ఇండియాలో కనీసం మొఖమన్న చూపించాలంటే వాళ్ళు ఒక మాట అనాలి – హిందీని బలవంతంగా మీ నెత్తి మీద రుద్దము, మీ ఇష్టమే అనే మాట అనకపోతే అడుగు కూడా పెట్టలేరు ఇక్కడ.
- 🏢 డీఎంకే మరియు రాజకీయ శూన్యత: కానీ ఇప్పుడు స్టేటస్ కో ఏమిటంటే, ఇప్పుడు ద్రవిడ మున్నేట్ర కజగం ఉంది కదా, డిఎంకే ఉంది కదా, డీఎంకే ఇస్ ఫంక్షనింగ్ వెరీ వెల్. స్టాలిన్ గారు, కరుణానిధి గారు తర్వాత స్టాలిన్ గారు చాలా మంచిగా పరిపాలన చేస్తున్నారు. మనువాదానికి వ్యతిరేకంగా, ఆ దళితుల అణచివేయబడ్డ వారి హక్కుల పరిరక్షణ కోసం మంచి ఐడియాలజీతో వారు పరిపాలన చేస్తున్నారు. సో హోల్ తమిళనాడు ఇస్ వెరీ హ్యాపీ అబౌట్ మిస్టర్ స్టాలిన్స్ గవర్నెన్స్. మరి ఇప్పుడు అక్కడ ఏం పెద్ద రాజకీయంగా పెద్ద గ్యాప్ ఏమి ఏర్పడలేదు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంజయ్య గారిని రాజీవ్ గాంధీ గారు ఎయిర్పోర్ట్లో అవమానించినప్పుడు ఒక వాక్యూమ్ ఏర్పడింది. ఆ వాక్యం నింపడానికి అప్పుడు ఎన్టి రామారావు గారిని కన్విన్స్ చేసి తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేశారు. కానీ అలాంటి గ్యాప్ తమిళనాడు పాలిటిక్స్ లో లేదు. స్టాలిన్ గారు బలమైన ప్రజా పునాది ఉన్న నాయకుడు. వారిని ఎదుర్కోవాలంటే ఇంకొక బలమైన నాయకుడిని స్టాలిన్ గారి పక్కలో బల్లెం లాగా తయారు చేయాలని అనుకొని విజయ్ తలపతి గారిని తయారు చేశారా అనేది ఒక డౌట్ అయితే ఉంది చాలా మందిలో.
- 🤝 ముగింపు: ఇప్పుడు దళితుల కొరకు పని చేద్దామన్నా, మనువాద నిర్మూలన కొరకు పని చేద్దామన్నా అక్కడ ఆల్రెడీ డిఎంకే చేస్తున్నది అదే. కరుణానిధి గారు వీళ్ళంతా పెరియారు గారి శిష్యులు. ఇప్పుడు ఈయన కూడా పెరియర్ గారిని ఆదర్శంగా తీసుకున్నాడు. మరి పెరియారు గారే ఆదర్శమైనప్పుడు మళ్లా ఇంకొక పార్టీ ఎందుకు? ఏదేమైనా విజయ్ తలపతి గారికి అభినందనలు, వారు విజయం సాధించాలి. ప్రజలకు వారి ద్వారా మేలు జరగాలని నేను ఆశిస్తున్నాను.
Detailed English Translation:
❓ Question: How do you view actor Vijay Thalapathy’s entry into politics and his ‘Tamizhaga Vettri Kazhagam’ party? 🗳️🎭🤔
- Premature to Judge: It is too early to speak for or against Vijay’s party. Personally, I like him. He is a wave rising from the grassroots. While he is a fine artist, he lacks political experience. His recent mega rally saw 8 lakh people, shocking the nation.
- Fans vs. Voters: Fans don’t always become voters. Chiranjeevi was a legendary hero but couldn’t achieve the same success in politics. The people’s pulse is hard to catch until an actual election occurs.
- No Hate Politics: His stance against “Hate Politics” is good. Currently, some parties thrive on creating fear and hatred between religions to build vote banks. Vijay’s ideology opposes this oppression.
- The Language Issue: He addressed the long-standing resistance against Hindi imposition in South India. Most Southern states oppose the “One Nation, One Language” policy if it means forced Hindi. He correctly identified this sensitive nerve.
- Is there a Political Vacuum?: Currently, the DMK under Stalin is functioning well, fighting against Manuvada and for Dalit rights. Since Vijay follows the same Periyar-based ideology, the necessity for a new party is questionable. Some wonder if he is being positioned to weaken Stalin’s base.
- Wishes: Any citizen has the right to form a party. I wish him success and hope his entry benefits the people ultimately.
