❓ ప్రశ్న: క్రైస్తవులు అప్పు (Debt) చేయవచ్చా? అసలు అప్పు చేయడాన్ని బైబిల్ సమర్థిస్తుందా? అలాగే వడ్డీ వ్యాపారం గురించి బైబిల్ ఏం చెబుతోంది? దీనిపై మీ జవాబు చెప్పండి సార్. (0:56:11)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (3m 50s)
- 💰 అప్పు – నేరం కాదు: అప్పు చేయొచ్చా అని అంటే.. వ్యభిచారం చేయొచ్చా అంటే చేయకూడదు అని చెప్పొచ్చు, నరహత్య చేయొచ్చా అంటే చేయకూడదు అని చెప్పొచ్చు, అబద్ధం చెప్పొచ్చు అంటే చెప్పకూడదు అనాలి. ఇంకా అద్వేషించవద్దు, అబద్ధ వార్తలు లేని వార్త ప్రచారం చేయకూడదు, అసూయ పడకూడదు.. ఇలాగ ఎన్నైనా మనం ఆజ్ఞలను గూర్చి మాట్లాడొచ్చు. కానీ అప్పు అనేది అటువంటి నేరము కాదు.
- ⚠️ అవసరత మరియు అప్పు: ఒక వ్యభిచారం లాంటిది, ఒక నరహత్య లాంటిది, అబద్ధం లాంటిది, మోసం లాంటిది కాదు అప్పు అనేది. అప్పు అనేది ఎవరూ కూడా సరదాగా చేయరు. ఇప్పుడు ఆదాయానికి మించి అవసరత ఉన్నప్పుడు.. వీడికి పదివేల రూపాయలే ఆదాయం ఉన్నది కానీ ప్రాణం మీదకి వచ్చే అవసరం ఒకటి వచ్చింది, ఇప్పుడు ఆయనకు 20,000 కావాలి.. అలాంటప్పుడు ఎవడైనా అప్పు చేస్తాడు, మళ్ళీ తర్వాత ఇస్తానని చెప్పి. గనుక అప్పు చేయడం గూర్చి బైబిల్ లో ఆజ్ఞ లేదు.
- 🚫 దుర్మార్గపు వడ్డీ వ్యాపారం: అప్పు ఇచ్చేటప్పుడు ‘వడ్డీకి ఇవ్వద్దు’ అనే ఆజ్ఞ ఉన్నది. వాడు బలహీనుడు, ఆర్థికంగా బలహీనుడు, వాడు వచ్చి నీ దగ్గరికి వచ్చి డబ్బులు అడిగినప్పుడు “తమ్ముడు తీసుకో వాడుకో, మళ్ళీ నీకు ఉన్నప్పుడు ఇవ్వు” అనేది ఇచ్చి దయా ధర్మంగా, సహోదర ధర్మంగా మనం ఇవ్వాలి గానీ.. వాడు అవసరంలో ఉన్నాడు గనుక దీని మీద నాకు వందకు పది రూపాయలు ఇవ్వు, వందకు ఐదు రూపాయలు ఇవ్వు అంటే.. వాడు జీవితకాలం వడ్డీ కట్టిన అసలు అట్లాగే మిగిలిపోతుంది.
- ⚖️ పీడించే వడ్డీ: పదివేలు అప్పు చేసి లక్ష రూపాయలు వడ్డీ కట్టి, ఇంకా అది అక్కడే పిల్లలు పెడుతోంది.. పదివేలు అట్లాగే ఉన్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. కనుక ఆ విధంగా దుర్మార్గంగా వడ్డీ వ్యాపారం చేయొద్దు అని బైబిల్ లో ఉంది తప్ప, అప్పు చేయొద్దు అని ఆజ్ఞ ఎక్కడా లేదు.
- ✨ దీవెన – అప్పు ఇవ్వడం: దేవుడు నిన్ను ఆశీర్వదించి “నీవు అప్పు చేయవు, అప్పు ఇచ్చెదవు గాని అప్పు చేయవు” అని అన్నాడు. అక్కడ దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు ఏం చేస్తాడు? అప్పు చేయడు, అప్పు ఇస్తాడు. అంటే దీవించబడ్డ ప్రతివాడు అప్పు ఇస్తాడు.. మరి అప్పు ఎవడికి ఇస్తాడు? ఎవడో ఒకడు అడిగితేనే కదా! కనుక ఎవ్వరూ అప్పు చేయొద్దు అనే రూల్ (Rule) పెడితే “నువ్వు అప్పు ఇచ్చెదవు” అనే మాటకు నెరవేర్పు ఉండదు. కనుక అది జ్ఞానయుక్తమైనటువంటి మీమాంస కాదు, దాన్ని వదిలేయండి. ఓకే.
Detailed English Translation:
❓ Question: Is it scripturally permissible for Christians to take loans or debts? What does the Bible say about lending money for interest?
- Debt is Not a Sin: Unlike adultery, murder, or lying, which are explicitly forbidden as sins, taking a debt is not a moral crime. No one takes a debt for pleasure; it is usually a necessity driven by circumstances where expenses exceed income, such as a medical emergency.
- No Prohibition on Borrowing: There is no biblical commandment that forbids a person from borrowing money. It is a financial arrangement based on a promise to repay.
- The Sin of Usury (Exorbitant Interest): The Bible’s concern is not with the borrower but with the lender. It commands that we should not charge interest to a needy brother. If someone is in financial distress, we should help them out of brotherly love, not exploit their desperation by charging high interest rates.
- Exploitative Lending: Many people borrow a small amount but end up paying many times that in interest while the principal remains untouched. This kind of exploitative interest (usury) is what the Bible condemns.
- The Blessing of Lending: God promised His people that they would be so blessed that they would “lend to many nations but borrow from none.” This is a position of blessing. However, for lending to exist, someone must be in a position to borrow. Therefore, a blanket ban on borrowing is logically inconsistent with the promise of being a lender.
- Conclusion: While it is a blessing to be out of debt, borrowing is not a sin. The focus should be on the character of the lender—being merciful and not exploitative—and the responsibility of the borrower to repay what they owe.
