74.Q: Out of Whose Womb Comes the Ice? – Job 38:29 (KSM 05) ❄️

❓ ప్రశ్న: యోబు గ్రంథము 38వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట ఉంటుంది సార్.. “మంచు గడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును?” అనే మాట రాయబడి ఉంది కదా సార్. అయితే ఇందులో ‘ఎవని గర్భములో నుండి వచ్చును’ అంటే ఏమిటి? మంచుగడ్డలు గర్భములో నుండి రావడం ఏమిటి? దీని ఆత్మీయ అర్థం ఏమిటి? (0:48:30)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (5m 30s)

  • 📖 లేఖనాల విభజన – కావ్య భాష: అదంతా కూడా కావ్య భాష. బైబిల్ గ్రంథమును మనము వ్యాఖ్యానించేటప్పుడు లేఖనాలన్నీ ఒక క్యాటగిరీ కాదు. భూమి అంతా ఒక క్యాటగిరీ కాదు.. అందులో నల్లరేగడి భూమి, ఎర్రమన్ను, ఇసుక పర్రలు ఉంటాయి, మరి బంకమన్ను.. ఒక్కొక్క రకమైన సాయిల్ (Soil) లో ఒక్కో రకమైన పంట బాగా పండుతుంది. అలాగే బైబిల్ కూడా. ఈ భూమ్మీద మట్టి అంతా ఒక రకంగా ఉన్నట్టు, బైబిల్ కూడా ఒక రకం కాదు. సత్య వాక్యమును సరిగా విభజించాలి అని పౌలు భక్తుడు తిమోతికి రాశాడు.
  • 📚 బైబిల్ వర్గీకరణ: భక్తులు బైబిల్ ను విభజించారు – మొట్టమొదట ఐదు గ్రంథాలు పంచకాండములు (Pentateuch), ద కోర్ సెంట్రల్ కోర్ ఆఫ్ ద స్క్రిప్చర్ (The core central core of the scripture). ఆది, నిర్గమ, లేవీయ, సంఖ్యా, ద్వితీయోపదేశ కాండాలు పంచకాండాలు. తర్వాత యెహోషువ నుండి ఎస్తేరు వరకు చరిత్ర గ్రంథాలు. తర్వాత యోబు నుండి ఐదు కావ్య గ్రంథాలు – యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఆ తర్వాత ప్రవక్తలు. ఈ కావ్య గ్రంథములు అనేవి అలంకార భాషతో కూడుకున్నటువంటివి. అక్కడ విషయాన్ని ఉపమాన రీతిగా అనేక దృష్టాంతాలతో, ఉపమాన భాషలో చెప్తారు.
  • ❄️ మంచు – పరిశుద్ధాత్మకు సూచన: యోబు అనేది మొట్టమొదటి కావ్య గ్రంథం. గనుక అక్కడ మంచు గడ్డ అంటే ఇప్పుడు మనం చూసే ఈ మంచు గడ్డ అనేది కాదు. అక్కడ మంచు గడ్డ ఎవని గర్భములో నుంచి వచ్చును అని అంటే.. మంచు అనేది పరిశుద్ధాత్మ దేవునికి సూచన. ఎందుకంటే వేకువ జామున మంచు కురిసినప్పుడు మంచుతో పాటు మన్నా కురిసింది. మంచు కరిగిపోయినాక మన్నా మిగిలిపోయింది. ఇంకా బాగా ఎండెక్కేదాకా ఆగితే మన్నా కూడా కరిగిపోతుంది. గనుక మన్నాను పరలోకం నుండి తీసుకువచ్చింది మంచు. మంచు లాగా నువ్వు కనుముల వలె తెల్లగా, కొత్తిమీర గింజల వలె అంటే ధనియాలు లాగా అంతా ఉండేదన్నమాట.
  • 💧 నీటి రూపాలు – ఆత్మీయ అర్థం: కాబట్టి మంచు అనేది ఎప్పుడైనా కూడా పరిశుద్ధాత్మ దేవునికి సూచన. మంచు గడ్డ ఎవని గర్భంలో నుంచి వచ్చు అని అంటే.. పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు వర్షం అయినా, మంచు అయినా నీటి యొక్క విభిన్న రూపాలే కదా! ఆవిరి, మంచు, నీరు ఏదైనా కూడా నీటి యొక్క విభిన్న రూపాలు. జీవజలములు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఒక్కొక్క పరిస్థితులు, అవసరాన్ని బట్టి మంచు గడ్డ అవుతాడు, వర్షం అవుతాడు, ముసురు అవుతాడు. ఆయన ఆ నీరు అనే ఆ యొక్క పాత్రలోకి వచ్చినప్పుడు, ఆ రోల్ (Role) లోపలికి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆయన మంచు గడ్డ కూడా.
  • దేవుని ప్రశ్న – యోబు సమాధానం: ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవని గర్భంలో నుంచి వస్తాడు అనేది యెహోవా దేవుని ప్రశ్న. ఆ ప్రశ్న అడిగింది ఎవరు? యెహోవా దేవుడు అడిగాడు. “యోబు నీకు అంతా తెలిసినట్టు చెప్తున్నావు, మాట్లాడుతున్నావు.. నీకు అన్నీ తెలుసు కదా నేను ప్రశ్న వేసెద ప్రత్యుత్తరం నువ్వు ఇవ్వు” అని అంటే.. “నాకేం తెలియదు బాబు” అంటాడు. ఆయన అనేక ప్రశ్నలు అడిగాడు – “నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి?” అని చెప్తూ.. దాని పరిమాణమును, కొలతను, బరువును, గాలికి ఇంత బరువు ఉండాలని నియమించినవాడు అంటూ ఇవన్నీ అడిగాడు. దానికి సగమేమో భౌతికంగా అక్షరాల అర్థం ఉంటుంది, సగమేమో యౌగిక అర్థం ఉంటుంది. కనుక ఆత్మీయంగా తీసుకుంటే గనుక మంచు గడ్డ అనేది పరిశుద్ధాత్మ దేవునికి సూచన. ఓకే.

Detailed English Translation:

❓ Question: Job 38:29 asks, “Out of whose womb came the ice? And the hoary frost of heaven, who hath gendered it?” What is the meaning of ice coming out of a womb, and what is its spiritual significance?

  • Rightly Dividing the Word: Scripture is not a single category; it is like different types of soil (black, red, sandy) where different crops grow best. Apostle Paul told Timothy to “rightly divide the word of truth.” The Bible is categorized into the Pentateuch (the core), History, Poetic Books (Job to Song of Solomon), and Prophecy. The Poetic Books use allegorical and metaphorical language.
  • Ice as the Holy Spirit: In spiritual symbolism, ice or frost represents the Holy Spirit. In the wilderness, manna descended from heaven enveloped in dew (frost). Once the dew evaporated, the manna remained. Thus, the ‘frost’ was the vehicle that brought the heavenly bread.
  • Different States of Living Water: Water, steam, and ice are different states of the same substance. Similarly, the Holy Spirit, the ‘Living Water,’ manifests as rain, mist, or ice depending on the spiritual climate and necessity.
  • The Creator’s Challenge: God asked Job these cosmic questions—about the earth’s foundations and the weight of the wind—to show that human wisdom is limited. While there is a literal physical meaning, the spiritual answer to “whose womb” points to the Holy Spirit proceeding from the Father.
  • Conclusion: Poetically and spiritually, the ‘Ice’ coming from a ‘Womb’ refers to the manifestation of the Holy Spirit from the essence of God. It highlights God’s absolute sovereignty over both the physical elements and spiritual manifestations.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram