❓ ప్రశ్న: యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు జరగబోయే స్పష్టమైన సూచనలు ఏమిటి? మీరు ప్రవక్తగా భవిష్యత్తులో యుగాంతానికి ముందు ఎలాంటి సూచనలు కనబడబోతున్నాయి? దేవుడు మీకు చూపించిన విషయాలు, ప్రజలందరూ మెలుకువగా ఉండాల్సినటువంటి విషయాలు ఏమిటి? జరగబోయే సంభవాల గురించి వివరిస్తారని ఆశిస్తున్నాం. (1:01:49)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (6m 42s)
- 🎺 యుగాంతం గ్రంథం: మొట్టమొదటి విషయము – యేసు నా దేవుడు, రెండవ రాకడలో నేను ఎత్తబడాలి అనే నమ్మకం, నిరీక్షణ, ఆశ కలిగిన ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవుడు నా చేత రచింపజేసిన మొట్టమొదటి ప్రణాళికా గ్రంథం “యుగాంతం” అనే గ్రంథం తప్పక చదివి తీరాలి. అందులో ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాను.
- 🚫 రహస్య రాకడ అపోహ: అందులో నేను చెప్పింది ఏంటంటే – చెప్పా పెట్టకుండా, ఎలాంటి సూచనలు లేకుండా ఆకస్మికంగా రహస్య రాకడ రావడం అనేది (Secret Pre-Tribulation Rapture).. అలాంటి రాప్చర్ అనేది లేనే లేదు, అది లేఖనానుసారము కాదు. దట్ ఈజ్ డెఫినెట్లీ నాట్ స్క్రిప్చురల్ (That is definitely not scriptural). యేసు రాకడకు ముందు కొన్ని స్పష్టమైన సంభవాలు జరుగుతాయి, అది జరిగిన తర్వాతనే ప్రభువు వస్తాడు.
- 🤰 ప్రసవ వేదన వంటిది: గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆకస్మికముగా ఆ దినము సంభవించును అంటాడు మొదటి థెస్సలొనీకయులకు 5వ అధ్యాయంలో. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన రెండో నెలలో, మూడో నెలలో రాదుగా! తొమ్మిది నెలలు నిండిన తర్వాత (9th month) ఎనీ డే (Any day) వస్తుంది. అలాగే సూచనలన్నీ నెరవేరిన తర్వాతనే ఇంకా ఇప్పుడో అప్పుడో తెలియదు అన్న పరిస్థితి అప్పుడు ఉంటుంది కానీ, ఎప్పుడు పడితే అప్పుడు కాదు.
- 👤 పాప పురుషుడు: కనుక ప్రభువు రాకడకు ముందు డెఫినెట్ (Definite) గా జరగాల్సిన ఒక సంభవం రెండో థెస్సలొనీకయులకు 2వ అధ్యాయంలో చెప్పాడు. అక్కడ నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అన్నాడు పౌలు భక్తుడు. అతడు ఎవడు అంటే – ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో వాటన్నిటినీ ఎదిరించుచు, దానంతటికీ పైగా తనను తాను హెచ్చించుకొనుచు తానే దేవుడనని కనబరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుంటాడు.. అంటే ఎరుషలేములో కూర్చుంటాడు.
- ⚖️ సత్యమును సవరించుట: గనుక ఇది జరిగితే తప్ప యేసు రాకడ దినము సంభవించదు. ప్రభువు దినం ఇప్పుడే వచ్చిందని ఎవడైనా మీకు చెబితే మీరు మోసపోవద్దు, చంచల మనస్కులు కావద్దు అని పౌలు రాస్తాడు. మీరు థామ్సన్ చైన్ రిఫరెన్స్ (Thompson Chain Reference) గాని, స్కోఫీల్డ్ (Scofield) గాని, ఏ బైబిల్ కామెంటరీ (Commentary) చూసినా.. ఈ రెండో థెస్సలొనీకయులకు పత్రికకు పరిచయ వాక్యాలు రాసినటువంటి ఆ బైబిల్ పండితులు ఇదే రాస్తారు. మొదటి శతాబ్దంలో క్రీస్తు రెండవ రాకడను గూర్చి వ్యాపించిన అసత్య బోధలను, తప్పుడు అభిప్రాయాలను ఖండించి సవరించి సత్యాన్ని చెప్పడానికి పౌలు ఈ పత్రిక రాశాడు అని.
- 🗺️ దశరాజ్య కూటమి: రానున్న అంతిమ అబద్ధ క్రీస్తు, అంతిమ క్రీస్తు విరోధి ప్రపంచ నియంత వాడు రాకముందు దశరాజ్య కూటమి ఒకటి ఏర్పడి ప్రపంచ ప్రభుత్వము స్థాపించి వాడికి తర్వాత అప్పగిస్తారు. యేసు రాకడకు ముందు సకల ప్రజలు కూడా స్పష్టంగా ఇదిగో ప్రభువు రాకడ అడుగుల ధ్వని వినబడుతుంది అని గ్రహించగలగడానికి ఒక తిరుగు లేనటువంటి సూచన ఏంటంటే – ప్రపంచ రాజకీయ నాయకులందరూ ఏకమై ఏక ప్రభుత్వం స్థాపించాలని డిమాండ్ చేస్తారు, ఆ విషయం వార్తా పత్రికల్లో వస్తుంది.
- 🌍 ఏక ప్రపంచ ప్రభుత్వం: ప్రపంచమంతటా ఒకే ప్రభుత్వం స్థాపించడానికి ఏ ఒక్క రాజ్యానికి అప్పుడు సత్తా ఉండదు. గనుక అరబ్ రాజ్యాలు పది రాజ్యాలు (మధ్య ప్రాచ్యంలో ఉన్నవి) కలిసి ఆ పది నేషన్ కాన్ఫెడరేషన్ (10 Nation Confederation), సంయుక్త సంకీర్ణ ప్రభుత్వం ఒకటి ప్రపంచ ప్రభుత్వంగా స్థాపిస్తారు. దాంట్లోకి ఇండియా కూడా వస్తుంది, ఇండియా కూడా సబ్మిసివ్ (Submissive) గా ఉండాలి. ఆ పదిమంది రాజులు కలిసి స్థాపించే ప్రభుత్వానికి మొత్తం ప్రపంచ దేశాలన్నీ లోబడతాయి.
- ✨ ముగింపు: అది ఒక గడియ అన్నాడు. వీళ్ళు ఆ ప్రపంచ ప్రభుత్వానికి హెడ్ ఆఫ్ ది వరల్డ్ గవర్నమెంట్ (Head of the world government) గా ఈ కొత్త రాజు ఒకడిని ఎన్నుకుంటారు. ఆ రాజు యొక్క దేశం ఇశ్రాయేలుకు నార్త్ (North) లో ఉంటుంది.. అంటే సిరియా కావచ్చు, ఇరాక్ కావచ్చు. వాడు అధిపతి అయిన తర్వాత ఇక గర్భిణీ స్త్రీకి ఎప్పుడైనా వేదన వస్తుంది అన్నట్టు అప్పుడు మనం ఎదురు చూడాలి కానీ అంతకంటే ముందు రాదు. అది విషయం.
Detailed English Translation:
❓ Question: What are the clear signs before the Second Coming of Christ? As a prophet, what signs do you see occurring before the end of the age? What should believers be alert about regarding future world events?
- The Book of Eschatology: Anyone hoping to be part of the Rapture must read my first book, Yugantham (The End of the Age). It clearly outlines the timeline of these events.
- The Myth of a Secret Pre-Trib Rapture: The idea of a secret, sign-less Rapture occurring at any moment before the Tribulation is not scriptural. Certain specific events must occur first.
- The Analogy of Birth Pains: 1 Thessalonians 5 compares that day to birth pains. Birth pains don’t start in the early months of pregnancy; they occur only after the full term. Similarly, Christ returns only after all signs are fulfilled.
- The Reveal of the Man of Sin: According to 2 Thessalonians 2, the “Day of the Lord” will not come until the Man of Sin is revealed. He will oppose everything called God and will eventually seat himself in the Temple of God in Jerusalem, claiming to be God.
- Correction of False Teachings: Paul wrote his second letter to the Thessalonians specifically to correct the false teaching that the Day of the Lord had already come or could happen without these signs. Prominent scholars like Scofield and Thompson confirm that this letter was a correction of ‘any moment’ expectations.
- The Ten-Nation Confederacy: Before the Antichrist takes power, a confederacy of ten nations/kings will form a global government. This will be a major news event. This one-world government will likely emerge from the Middle Eastern/Arab region.
- A Global Superpower: No single nation will have the power to rule alone; therefore, nations including India will become submissive to this ten-nation coalition. They will eventually hand over their authority to a single leader—the Antichrist—from a region north of Israel (likely Syria or Iraq).
- Conclusion: Only after this global political alignment and the rise of this leader should we expect the return of Christ. Until these specific political and spiritual signs manifest, the final hour has not yet arrived.
