92.Q: Why is There Hatred Within the Christian Community? (KSM 06) 💔

❓ ప్రశ్న: సార్, అన్యుల సంగతి పక్కన పెడితే.. అసలు క్రైస్తవ సమాజంలోనే మీ మీద ఇంత ద్వేషం పుట్టడానికి గల అసలు కారణం ఏమిటి? ఇది ఎందుకు జరుగుతోంది? (1:04:23)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 46s)

  • 💔 ద్వేషానికి గల కారణం: క్రైస్తవ సమాజంలో నా మీద ద్వేషానికి కారణం ఏమిటి అని అడిగితే.. సేమ్ కారణం (Same reason). ఇప్పుడు దావీదు మీద సౌలుకి ఎందుకు ద్వేషము? యోసేపు మీద అన్నలకు ఎందుకు ద్వేషము? అంటే అదే నా మీద కూడా. ద్వేషానికి కారణం ఉండదు, అది నిత్య చీకటిలో ఉన్నటువంటి లక్షణం. యేసుని ఎందుకు యూదులు ద్వేషించారు? కారణం ఉండదు.
  • 📖 లేఖన సాక్ష్యం: అంత్య దినాలలో రెండవ తిమోతి 3వ అధ్యాయంలో చెప్పాడు కదా.. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును, మనుషులు స్వార్థ ప్రియులు, గర్వాంధులు, బింకములాడువారు, అతి ద్వేషులు మరియు ‘సజ్జన ద్వేషులు’ అని కూడా ఉంది. అంటే మంచివారిని ద్వేషిస్తారు. ప్రభువైన యేసునే ద్వేషించే వాళ్ళు ఆ తరంలో ఉన్నారు.
  • 🏛️ చారిత్రక ఉదాహరణలు: పౌలును ద్వేషించిన వాళ్ళు ఆయన తరంలో ఉన్నారు. మార్టిన్ లూథర్ (Martin Luther) ను ద్వేషించిన వాళ్ళు ఉన్నారు. భక్త్ సింగ్ (Bakht Singh) గారిని ద్వేషించిన వాళ్ళు ఉన్నారు. పి.ఎం. సమూయేలు (P.M. Samuel) గారిని ద్వేషించిన వాళ్ళు ఉన్నారు. బిల్లి గ్రాహం (Billy Graham) గారిని ద్వేషించిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని ద్వేషించిన వాళ్ళు లేరు చెప్పండి? అందరికీ విమర్శకులు ఎప్పుడూ ఉంటానే ఉంటారు.
  • పాజిటివ్ యాంగిల్: ఈ విమర్శలు, ద్వేషం అనేది ఒక విధంగా మంచిది కూడా. ఎందుకంటే అన్నలు ద్వేషించి గోతిలో త్రోయబట్టే దేవుడు యోసేపును బయటకి తీసి ఐగుప్తు రాజును చేశాడు. ఇప్పుడు మనందరి మధ్యలో యోసేపు హీరో అయిపోయాడు. బంగారం ఎట్లా నిగ్గుదేలుతుంది అంటే.. అది కంసాలివాని అగ్నిలో వేసినప్పుడే అది ‘రోల్డ్ గోల్డ్’ ఆ లేక ‘అసలు బంగారమా’ అనేది తెలిసిపోతుంది.
  • 🛡️ ముగింపు: గనుక ఈ వ్యతిరేకతల మధ్యలోనే దైవజనుడు అసలు దైవజనుడా కాదా, వాని భక్తి విశ్వాసం ఎంత గట్టిగా ఉందో తెలుస్తుంది. మా మీద ఇంత ద్వేషం ఉన్నది అంటే నేను ధన్యుడిని. ఎందుకంటే యోసేపు, మార్టిన్ లూథర్, దావీదు, యేసుప్రభువు.. ఇలాంటి వాళ్ళ వరుసలో నేను ఉన్నాను. నాకు ఆ విషయంలో ఏం బాధ లేదు, యాక్చువల్లీ ఐ ఎంజాయింగ్ ద హోల్ సిచువేషన్ (Actually, I am enjoying the whole situation). అది విషయం. ఓకే.

Detailed English Translation:

❓ Question: What is the root cause of the hatred you face within the Christian community itself? Why is there so much opposition from fellow believers?

  • The Root of Hatred: The hatred I face within the Christian community is for the same reason Joseph faced hatred from his brothers and David faced it from Saul. Hatred often lacks a logical reason; it is simply a characteristic of spiritual darkness.
  • Scriptural Warning: 2 Timothy 3 warns that in the last days, perilous times will come where people will be “despisers of those that are good” (Sajjana Dweshulu). If they hated our Lord Jesus and the Apostle Paul, we should expect nothing less.
  • A History of Persecution: Every great man of God in history, from Martin Luther to Billy Graham and Bakht Singh, faced intense opposition and hatred during their time. Critics have always existed for those doing God’s work.
  • The Refining Fire: I see this opposition in a positive light. Just as the fire reveals whether metal is imitation or pure gold, opposition tests a servant of God’s faith. Joseph became a hero because his brothers’ hatred pushed him toward his destiny.
  • Conclusion: Facing such hatred places me in the company of the prophets and saints of old. I do not feel discouraged; rather, I find peace in knowing that this opposition is a testimony to the truth I stand for. I am embracing this journey.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram