93.Q: Why was the Name ‘Jehovah’ not continued in the New Testament? (KSM 06) 📛

❓ ప్రశ్న: పాత నిబంధన గ్రంథం అంతటిలో ‘యెహోవా’ అని రాయబడి ఉంది కదా! మరి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ మాట ఎందుకు కొనసాగలేదు? అక్కడ ‘యేసుక్రీస్తు’ అని, ‘దేవుడు’ అని ఎందుకు రాయబడింది? సంగారెడ్డి నుండి పాస్టర్ స్వరాజు గారు ఈ ప్రశ్నను అడుగుతున్నారు. (1:07:09)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (3m 31s)

  • 📛 నామము మరియు అవతారము: పాత నిబంధన కాలములో ‘యెహోవా’ అనే నామము ఆయన దేవుడుగా ఉన్నప్పుడు, నరావతారం ఎత్తకముందు ఆయనకు ఉన్న పేరు. అది హెబ్రీ భాషలో ఆయన నామము. అయితే మానవ చరిత్రలో యజ్ఞ పురుషుని గుర్తుపట్టాలంటే.. ఆయన మనిషిగా పుట్టినప్పుడు ఆయనకు ఉన్న నామం ఏమిటి అనేది మనం ఐడెంటిఫై (Identify) చేసినప్పుడే రక్షకుడిని గూర్చి కరెక్ట్ గా మనం చేరుకోగలుగుతాం.
  • 📖 లేఖన సాక్ష్యం: అపోస్తలుల కార్యములు 4:12 లో ఒక కీలకమైన మాట ఉన్నది – “మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమునను రక్షణ పొందలేము”. అంటే మానవజాతిలో ఒకడుగా ఆ యజ్ఞ పురుషుడు పుట్టినప్పుడు.. ఒక మనిషిగా ఆయన ఎలా ఐడెంటిఫై చేయబడ్డాడు? ఆయనకు దేవుడే పెట్టిన మానవ నామధేయం ‘నజరేయుడైన యేసు’.
  • యేసు అనే నామములోని రక్షణ: యేసుక్రీస్తు ప్రభువు అనేది దేవునికి ఇవ్వబడిన మానవ నామధేయం. ‘యేసు’ అంటే రక్షకుడు. ఆయన ఎలా రక్షిస్తాడు అంటే.. తన రక్తము వలన, తన యజ్ఞము వలన, సిలువలో మరణించి పాప పరిహారక యజ్ఞం చేయడం వలన రక్షిస్తాడు. యెహోవా అని అంటే ఆయన సృష్టికర్త అని చెప్పుకుంటాం, కానీ యజ్ఞమైనటువంటి చారిత్రిక నామధేయం మాత్రం ‘యేసు’.
  • 🛡️ ముగింపు: చారిత్రికంగా జరిగిన ఆ సంఘటనను (సిలువ యజ్ఞాన్ని) నమ్మి, ఆ పురుషుని చేరినప్పుడే రక్షణ వచ్చేది. ఆయన బయలుపరచబడకముందు దేవుడు దేవుడుగా నిత్యత్వంలో ఉన్నప్పుడు ఆయన నామధేయము ఇప్పుడు చెబితే లాభం లేదు. ఆయన మానవుడిగా జన్మించి యజ్ఞం అయినప్పుడు ఏ పేరు ఉందో, ఆ పేరుననే రక్షణ కలుగుతుంది అని బైబిల్ చెబుతోంది. అందుకే కొత్త నిబంధనలో ‘యేసు’ అనే నామము ప్రాముఖ్యముగా కొనసాగింది. అది విషయం. ఓకే.

Detailed English Translation:

❓ Question: Why is the name ‘Jehovah,’ which is prominent in the Old Testament, not continued in the New Testament? Why do we see the names ‘Jesus Christ’ and ‘God’ instead?

  • The Name and the Incarnation: The name ‘Jehovah’ was the name used before God took human form. To recognize the ‘Sacrificial Man’ in human history, we must identify Him by the name He bore when He walked among us as a human.
  • Scriptural Evidence: Acts 4:12 states that there is no other name under heaven given among men by which we must be saved. When God manifested in the flesh, His historical name was Jesus of Nazareth.
  • The Significance of the Name Jesus: ‘Jesus’ means Savior. This is the name given by God to the Incarnate Christ to signify His role as the one who provides salvation through His blood and sacrifice on the cross. While ‘Jehovah’ identifies the Creator, ‘Jesus’ identifies the historical redeemer.
  • Conclusion: Salvation comes by believing in the historical sacrifice of the person of Jesus Christ. The New Testament focuses on this name because it is the specific name revealed for the redemption of mankind.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram