❓ ప్రశ్న: బాప్తిస్మం పొందాలంటే కచ్చితంగా దర్శనం రావాలా? దేవుడు స్వయంగా కనిపించి “నీ పాపాలు క్షమించాను” అని చెబితేనే బాప్తిస్మం తీసుకోవాలా? అసలు సరైన బాప్తిస్మం అంటే ఏమిటి? విశాఖపట్నం నుండి కిరణ్ గారు అడుగుతున్నారు. (0:27:01)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 00s)
- 🌊 ఒత్తిడి చేయకండి: కిరణ్ గారు వందనాలు.. వందనాలండి.. ఎవరు మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆ విశాఖపట్నం నుంచి అండి కృష్ణా జిల్లా కిరణ్ అండి పేరు.. కిరణ్ గారు మీ యొక్క సందేహం ఏమైనా ఉంటే రంజిత్ ఓఫీర్ గారు ఉన్నారు మాట్లాడండి అడగండి.. గుడ్ ఈవెనింగ్ కిరణ్ బాబు చెప్పండి.. వందనాలు అయ్యగారండి.. వందనాలు వందనాలు కిరణ్ గారు ఏంటి మీ సందేహం? నేను అంటే ఈ మధ్య రీసెంట్ గా నాకు మ్యారేజ్ అయిందండి.. వండర్ఫుల్ కంగ్రాాచులేషన్స్ విష్ యు హ్యాపీ లాంగ్ మ్యారీడ్ లైఫ్.. ఆ థాంక్యూ అయ్యగారండి అయితే నేనైతే బాప్తిస్మం పొందానండి.. సంతోషం.. మా మిసెస్ అయితే తను వేరే వచ్చింది అయితే వాళ్ళకి మారుమనసు అయితే పొందారు కానీ ఇంకా దర్శనం రావాలి బాప్తిస్మం తీసుకోవడానికి అని వెయిటింగ్ లో ఉన్నారండి.
- 📖 లేమన్స్ ఫెలోషిప్ సిద్ధాంతం vs బైబిల్: ఓకే ఆమెకి సువార్త అర్థమయినప్పుడు ఆమె మానసికంగా హృదయంలో పరిశుద్ధాత్మ ఆత్మ ద్వారా ఒప్పించబడ్డప్పుడు ఆమెకు బాప్తిస్మం ఇప్పించండి. అప్పటిదాకా మనం ఆమెకి అవకాశం వచ్చినప్పుడల్లా హెచ్చరిక ఇవ్వడము, ప్రార్థన చేయడము, మనము ప్రేమ చూపించి మాదిరి చూపించడం అనేదే చేయాలి తప్ప బాప్తిస్మానికి ఒత్తిడి మాత్రం చేయకండి. అదే అంటే దర్శనం ఒత్తిడి తీసుకోవాలని ఆలోచన.. ఆ అది లేమన్స్ ఫెలోషిప్ వాళ్ళ యొక్క సిద్ధాంతము.. ఆ అది బైబిల్ ప్రకారం కాదు. ఈ విషయంలో లేమన్ సోదరులు ఎవరైనా వింటూ ఉంటే వారికి బాధ కలిగితే అందుకు నేను బాధ కలిగినందుకు చింతిస్తున్నాను కానీ నేను చెప్తున్న సత్యాన్ని విని వాళ్ళు బాధపడితే ఆ స్థితిలో వాళ్ళు ఉన్నా కూడా నేను చింతించాల్సి వస్తది. ఇప్పుడు లేమన్స్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఫెలోషిప్, మారుమనసు అవసరం పరిశుద్ధత అవసరం అని నేర్పించే ఒక మంచి డినామినేషన్ మంచి సహవాసం లేమన్స్ ఫెలోషిప్. కానీ దర్శనము చూస్తేనే దేవుడే వచ్చి నీకు నేను నీ పాపాలు క్షమించాను అని చెబితేనే నువ్వు బాప్తిస్మం పొందాలనేది వాక్యానుసారం అయితే కాదు.
- 🛤️ బైబిల్ లోని బాప్తిస్మము ఉదాహరణలు: ఎందుకంటే ఇప్పుడు ఆ ఫిలిప్పీ చెరసాలలో చెరసాల అధిపతి.. ఆ చెరసాల అధిపతి ఆ రాత్రి ఆ గడియలోనే వచ్చి వాళ్ళందరూ బాప్తిస్మాలు పొందారు.. మరి ఎవరికి దర్శనం వచ్చింది? పెంతెకోస్తు పండుగ దినం అప్పుడు 3000 మంది అందరూ పట్టపగలే మెలుకువగా ఉన్నారు.. అప్పుడే వాక్యం విన్నారు ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు బాప్తిస్మాలు పొందారు. నిద్రపోయింది ఎప్పుడు? కలలు వచ్చింది ఎప్పుడు? దర్శనాలు వచ్చింది ఎప్పుడు వాళ్ళకి? ఇంకొక మాట.. కందాకే రాణి ఇథియోపియా రాణి కందాకే రాణి యొక్క ఫైనాన్స్ మినిస్టరు.. అపోస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయంలో “ఇదిగో నీళ్ళు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమి” అని అతడు అడిగాడు. అప్పుడు ఫిలిప్పు.. ఫిలిప్పు అనే సువార్తికుడు కదా వన్ ఆఫ్ ద సెవెన్ డీకన్స్ ఫిలిప్పు.. అతని రథములో పెట్టి యెషయా గ్రంథమును అనుసరించి సువార్త చెప్పాడు. అప్పుడు మరి ఆ ఫిలిప్పు గారు అని ఉండాలి.. “ఇదిగో నీరు నాకు ఆటంకం ఏమి అంటే ఆటంకం ఉన్నది సోదరుడా.. నువ్వు ప్రార్థించవలెను మూడు వారంలో ఏడు వారంలో కనిపెట్టవలెను.. నీకు దర్శనం రావలెను” అని చెప్పాల్సి ఉంది. మరి “ఇదిగో నీళ్ళు నాకు ఆటంకం ఏమి” అంటే ఫిలిప్పు ఇమ్మీడియట్ గా రథం నిలిపండి అని చెప్పేసి ఇచ్చేసాడు. అప్పటికప్పుడే ఆ కనీసం ఆయనక ఒక గంట ప్రార్థనలో ఉండమని కూడా చెప్పినట్టు లేదు అక్కడ.
- 🛡️ దర్శనం నిరీక్షణపై వివరణ: గనుక ఈ విషయంలో లేమన్స్ ఫెలోషిప్ వాళ్ళు తప్పకుండా మీకు దర్శనం రావాలి అని చెప్పడంలో ఉద్దేశ్యం మంచిదై ఉండొచ్చు.. మారుమనసే లేకుండా కొంతమంది ఏదో ఆచారంగా ఆనవాయితీగా పొందేస్తున్నారు.. మళ్ళీ వెళ్లి పాపానికి చిక్కుబడిపోతున్నారు.. పాప బంధకాలు అనేది వాళ్ళు చూసి కాస్త గట్టిగా వాళ్ళని సిద్ధపరిస్తే మంచిది.. ఉపవాసం ఉండి ప్రార్థన కొంచెం భయంగా తీసుకోవాలి గానీ.. దాని ఉందిలే బిస్కెట్ తిన్నట్టుగా నువ్వు బాప్తిస్మం తీసుకోవద్దు అనే ఉద్దేశ్యం మంచిదే.. కానీ బైబిల్ ప్రకారం మాత్రం కాదు. ఆమెకు దర్శనం రానక్కర్లేదు మీ మిసెస్ కి ఏమక్కర్లేదు.. నేను పాపినని గ్రహించి యేసు నా కొరకు మరణించి లేచాడు అని గ్రహింపగలిగి.. పశ్చాత్తాపం యేసయ్య నా పాపాలు క్షమించమని ప్రార్థించగలిగిన విశ్వాసం చాలు ఆమె బాప్తిస్మం పొందొచ్చు అయ్యా.
- ✨ నిజమైన బాప్తిస్మము: అసలు నిజమైన బాప్తిస్మం ఎలా తీసుకోవాలి అంటే.. మీరు నేను రచించిన ‘సింహనాదం’ అనే గ్రంథాన్ని మీరు చదివితే చాలా మంచిది. అందులో నీటి బాప్తిస్మాన్ని గూర్చి చాలా పేజీలు.. దాదాపుగా 100 పేజీల వరకు రాసి ఉంటాను. అందులో నీటి బాప్తిస్మం ఏ నామంలో తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు ఇవ్వాలి, ఎందుకు.. అన్ని దాని యొక్క సకల సంగతులు సింహనాదంలో రాశాను. మీరు ఆ పుస్తకం తెప్పించుకొని చదవండి.. అది దొరకట్లేదా మీరు మా ఆఫీస్ కి చెప్పండి మన ఆఫీస్ లో ఉన్నాయి స్టాక్ పంపించేస్తాను ఇమ్మీడియట్ గా. అది విషయం. ఓకే బ్రదర్ థాంక్యూ సో మచ్ గాడ్ బ్లెస్ యు. ఓకే.
Detailed English Translation:
❓ Question: Is a vision mandatory for baptism? Should a believer wait until God personally appears and says, “Your sins are forgiven”? (0:27:01)
- Pressure vs. Conviction: Baptism should never be the result of social or familial pressure. It must be a personal response to the conviction of the Holy Spirit. While certain groups like the Laymen’s Evangelical Fellowship mandate a supernatural vision as proof of salvation before baptism, this is not a biblical requirement.
- Scriptural Refutation: The New Testament shows that baptism was often immediate. The Philippian jailer was baptized the same hour he believed. On the Day of Pentecost, 3,000 people were baptized instantly after the sermon without any mandatory waiting period for visions.
- The Ethiopian Eunuch: In Acts 8, the Ethiopian eunuch simply confessed his faith in Christ and was baptized immediately by Philip. There was no instruction to wait for weeks or seek a dream as a prerequisite.
- The True Essence of Baptism: True baptism requires realization of sin, faith in the finished work of Jesus on the cross, and a repentant heart. A supernatural vision is not the standard for spiritual obedience. For a complete understanding of the name, authority, and mode of baptism, one should study the book ‘Simhanadam.’
